బ్రహ్మముడి జూన్ 24 ఎపిసోడ్: జాక్‌పాట్ కొట్టిన ఇందు - ఉద్యోగులకు జీతాలు - రేఖ దుర్మార్గం - వెంకీ మాజీ లవర్‌కు నందు క్లాస్

Brahmamudi June 24th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 24 ఎపిసోడ్ లో రేఖ, రాజు, భూషణ్ లకు దిమ్మదిరిగే షాకిస్తుంది. జాక్‌పాట్ కొట్టి ఉద్యోగుల జీతాలు ఇవ్వడంతో రేఖ మరో దుర్మార్గానికి తెర లేపుతుంది. అటు వెంకీ మాజీ లవర్ కు నందు క్లాస్ పీకుతుంది.

Published on: Jun 24, 2026, 08:12:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు తన పవరేంటో రేఖకు చూపిస్తుంది. ఆమెను కూడా రాజు కూడా షాక్ తింటాడు. తన ఆధిపత్యం పోయిందని గమనించిన రేఖ తెరవెనుక దుర్మార్గాలకు తెరలేపుతుంది. దీంతో ఇందు ఆమె ఆగడాలను ఎలా అడ్డుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

బ్రహ్మముడి జూన్ 24 ఎపిసోడ్: జాక్‌పాట్ కొట్టిన ఇందు - ఉద్యోగులకు జీతాలు - రేఖ దుర్మార్గం - వెంకీ మాజీ లవర్‌కు నందు క్లాస్
బ్రహ్మముడి జూన్ 24 ఎపిసోడ్: జాక్‌పాట్ కొట్టిన ఇందు - ఉద్యోగులకు జీతాలు - రేఖ దుర్మార్గం - వెంకీ మాజీ లవర్‌కు నందు క్లాస్

ఇందు తోక జాడిస్తుందని కంగారు.. క్లాస్ పీకిన రేఖ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జూన్ 24) ఎపిసోడ్ ఇందు సీఈవో కావడంతో భూషణ్, భ్రమరాంబ టెన్షన్ పడే సీన్ తో మొదలవుతుంది. ఆమె ఇక తోక జాడిస్తుందని వాళ్లు అంటారు. కానీ రేఖ మాత్రం వాళ్లకు క్లాస్ పీకుతుంది. సీఈవో పదవి మాత్రమే మారింది.. కంపెనీ నా గుప్పిట్లోనే ఉంది.. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని ధైర్యం చెబుతుంది.

వెంకీ సాయం అడిగిన నందు

ఇటు నందు ఓ బొకే డెలివరీ కోసం వెళ్తుంటే తన బండి పంక్చర్ అవుతుంది. దీంతో ఆమె వెంకీకి ఫోన్ చేస్తుంది. సాయం చేయమని కోరుతుంది. మొదట తనకు అర్జెంట్ డెలివరీ ఉందని అతడు అంటాడు. జాబ్ రాగానే సెల్ఫిష్ గా మారిపోయావా అని నందు అనడంతో సరే వస్తానంటూ నందుకు దగ్గరికి వస్తాడు వెంకీ. అయితే ముందు తన డెలివరీ తర్వాతే నీ డెలివరీ చేద్దామని అంటాడు. నందు సరే అంటుంది.

పెద్ద కాంట్రాక్టే సంపాదించిన ఇందు.. వంద గుళ్లలో ఆభరణాలు

ఇటు ఆఫీసులో ఇందు, రాజు, రేఖ, భూషణ్ లతో హర్ష కాంట్రాక్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. తమకు ఏకంగా 100 పురాతన గుడులను పునరుద్ధరించే కాంట్రాక్ట్ దక్కిందని, ఆ గుళ్లలోని విగ్రహాలకు ఆభరణాల కాంట్రాక్ట్ మీకు ఇద్దామనుకుంటున్నట్లు చెబుతాడు. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తున్నాడేంటి అని రేఖ, భూషణ్ షాక్ తినగా.. రాజు మాత్రం లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. తమకు కావాల్సినట్లుగా ఆభరణాలు కావాలని కొన్ని డిజైన్లు ఇందుకు చూపిస్తాడు హర్ష. వాటిని చూసి బిజినెస్ అంతా తెలిసినట్లుగా ఇందు మాట్లాడటంతో రేఖ మరింత షాకవుతుంది.

ఇందు సంతకం చేయడం చూసి రేఖ, భూషణ్ షాక్

ఆ తర్వాత కాంట్రాక్టుపై మొదట హర్ష సంతకం చేస్తాడు. తర్వాత ఇందుని సంతకం చేయమంటాడు. ఆమె దానిని చదువుతుండటంతో అదంతా నటన అని రేఖకు భూషణ్ చెబుతాడు. నటన కాదు.. ఆమె నిజంగానే చదువుతోంది.. తర్వాత జరగబోయేది చూసి మీకు దిమ్మదిరుగుతుంది అని రాజు అనుకుంటాడు.

తాను టైమ్ విషయంలో పక్కాగా ఉంటానని, డిజైన్లు, డెలివరీ ఆలస్యమైతే పెనాల్టీలు ఉంటాయని హర్ష అంటాడు. అన్నింటికీ సరే అని చెప్పిన ఇందు సంతకాలు పెడుతుంది. అది చూసి రేఖ మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే నిలదీద్దామని భూషణ్ చెప్పినా.. ఇంటికెళ్లిన తర్వాత చూసుకుందామని రేఖ అంటుంది.

అడ్వాన్స్ రూ.50 లక్షలు.. రాజు, రేఖ ఫైట్.. షాకిచ్చిన ఇందు

అడ్వాన్స్ గా హర్ష రూ.50 లక్షలు ఇస్తాడు. అది చూసి రాజు, రేఖలో ఆశ పెరుగుతుంది. ఆ డబ్బును నొక్కేయాలని ఇద్దరూ అనుకుంటారు. దానికోసం ఫైట్ చేస్తారు. సూటుకేసును లాక్కొనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇందు మాత్రం ఇద్దరికీ డబ్బు ఇవ్వనని, మొదట ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆ సూటుకేసు తీసుకొని వెళ్లిపోతుంది.

దీంతో రేఖ, రాజు, భూషణ్ దిమ్మదిరిగిపోతుంది. ఇందు పూర్తిగా మన చేయి జారిపోయినట్లే అని భూషణ్ ఆందోళన చెందుతాడు. డబ్బు మనకు ఇస్తుందంటే అలా తీసుకెళ్లిపోయిందేంటి అని అంటాడు. రేఖ కూడా షాక్ లో ఉండిపోతుంది.

వెంకీని అవమానించిన మాజీ గర్ల్‌ఫ్రెండ్.. క్లాస్ పీకిన నందు

మరోవైపు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ఓ చోటికి వెళ్తాడు వెంకీ. ఓ వ్యక్తి ఆర్డర్ అందుకుంటాడు. వెంకీని చూసి అతని పక్కనే కారులో ఉన్న వెంకీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ బయటకు వస్తుంది. నువ్వు చివరికి ఇలాంటి ఉద్యోగం చేస్తున్నావా.. నీకు ఇదే సూటవుతుంది.. నీ లవ్ యాక్సెప్ట్ చేయకుండా చాలా మంచి పని చేశాను అని అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో నందు జోక్యం చేసుకొని ఆమెకు క్లాస్ పీకుతుంది.

డబ్బు కోసం వేషాలు మార్చే నువ్వా వాడిని అనేది.. ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి వాడు దొరుకుతాడు.. వాడి కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు.. ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు.. ఏదో రోజు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అని చెప్పి వెంకీని తీసుకొని వెళ్లిపోతుంది.

ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చిన ఇందు

ఇటు కంపెనీలో అందరికీ జీతాలు ఇస్తుంది ఇందు. దీంతో ఉద్యోగులందరూ చాలా సంతోషిస్తారు. అది చూసి రేఖ, భూషణ్ మరింత ఉడుక్కుంటారు. కొత్త కాంట్రాక్ట్ కోసం రాజు, ఇందు పని చేస్తుంటారు. అయితే రేఖ మాత్రం ఆ కాంట్రాక్ట్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. శృతికి ఫోన్ చేసి మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఎంత డబ్బయినా తాను ఇస్తానని, ఈ డెలివరీ ఆలస్యం కావాలని చెబుతుంది. ఆమె అలాగే చేస్తానని అంటుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More