బ్రహ్మముడి జూన్ 5 ఎపిసోడ్: ఇందుని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య.. రాజుపై రేఖ అనుమానం.. వెంకీని మోటివేట్ చేసిన నందు

Brahmamudi June 5th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 5 ఎపిసోడ్ లో ఇందుని ఐశ్వర్య కిడ్నాప్ చేస్తుంది. అయితే రేఖ మాత్రం రాజుపై అనుమానం వ్యక్తం చేస్తుంది. అటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన వెంకీని నందు మోటివేట్ చేసి మళ్లీ నవ్వేలా చేయడం ఈ ఎపిసోడ్ లో హైలైట్.

Published on: Jun 5, 2026, 08:32:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi June 5th Episode: స్టార్ మాలో ఒకప్పటి టాప్ సీరియల్ బ్రహ్మముడిలో కొత్త కొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. తాజా ఎపిసోడ్ లో ఇందు సీఈవో కాకుండా అడ్డుకోవడానికి ఐశ్వర్య ఆమెను కిడ్నాప్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయ్యే వరకు ఆమెను వదలనని భీష్మించుకుంటుంది. అటు రాజులో ఆందోళన మొదలవుతుంది.

బ్రహ్మముడి జూన్ 5 ఎపిసోడ్: ఇందుని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య.. రాజుపై రేఖ అనుమానం.. వెంకీని మోటివేట్ చేసిన నందు
బ్రహ్మముడి జూన్ 5 ఎపిసోడ్: ఇందుని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య.. రాజుపై రేఖ అనుమానం.. వెంకీని మోటివేట్ చేసిన నందు

ఇందుని మళ్లీ బుట్టలో వేసుకున్న ఐశ్వర్య

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్ సీఈవో పోస్ట్ తనే అన్న కాన్ఫిడెన్స్ లో రాజు సూటుబూటులో ఫొటోలకు పోజులిచ్చే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇందు వచ్చి లేటవుతుందని చెప్పడంతో రాజు వెంటనే రెడీ అవుతాడు.

అయితే ఇంతలో ఇందు దగ్గరికి వచ్చిన ఐశ్వర్య.. రాకేష్ తనను మళ్లీ బెదిరిస్తున్నాడని, కాపాడాలని అడుగుతుంది. తనకు బోర్డు మీటింగ్ ఉందని చెప్పినా వినదు. అరగంటలో పని పూర్తవుతుందని, నువ్వు చెబితే వాడు వింటాడని, తన వెంట రావాలని బతిమాలుతుంది. ఎంతో భయపడిపోతున్నట్లు నటిస్తుంది. దీంతో ఇందు మనసు కరిగి సరే వెళ్దామని అంటుంది.

సీఈవో పోస్టు తనదే అన్న రాజు.. రేఖకు షాక్

ఇటు సీఈవో పోస్ట్ తనదే అన్న కాన్ఫిడెన్స్ తో రేఖ కూడా ఉంటుంది. భ్రమరాంబ ఆమెకు హారతి ఇస్తుంది. సీఈవోగా తిరిగి రావాలని అంటుంది. కానీ రాజు ఎంట్రీ ఇచ్చి.. కాబోయే సీఈవో తానేనని అంటాడు. దీంతో రేఖ షాక్ తింటుంది. తనతో పెట్టుకోవద్దని అంటాడు. అది విని అపర్ణ, సుభాష్ చాలా సంతోషిస్తారు.

ఇందు ఎక్కడ అంటూ రాజును నిలదీసిన రేఖ

ఇంతకీ ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. సీఈవో పోస్టు కోసం నువ్వే మళ్లీ కిడ్నాప్ చేశావా అని నిలదీస్తుంది. కానీ రాజు మాత్రం తాను ఇప్పుడు తన భర్తనని, కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని అంటాడు. తనతో పోటీ పడలేక నువ్వే కావాలని ఏదో చేశావని రేఖ అంటుంది. దీంతో ఇందుకి ఫోన్ చేస్తాడు రాజు.

ఇందుని కిడ్నాప్ చేయించిన ఐశ్వర్య

హాల్లోనే ఉండమంటే ఎక్కడికెళ్లావ్ అని ఇందుని అడుగుతాడు. తాను అర్జెంట్ పని మీద బయటకు వచ్చానని చెబుతుంది. బోర్డు మీటింగ్ అని తెలిసి ఎందుకు వెళ్లావ్ అంటూ రాజు నిలదీస్తాడు. అది స్టార్ట్ అయ్యే లోపు తాను కచ్చితంగా వస్తానని ఇందు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఫాస్ట్ గా వెళ్లమని ఐశ్వర్యతో అంటుంది. కానీ ఆమె మాత్రం.. నిన్న సీఈవో కానివ్వను.. రాకేష్ లేడు ఎవడూ లేడు.. బోర్డు మీటింగ్ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉంటావు.. సాయంత్రం వరకు వదలను.. నిన్ను కిడ్నాప్ చేస్తున్నా అని మనసులో అనుకుంటుంది.

వెంకీని మోటివేట్ చేసిన నందు

మరోవైపు జాబ్ పోయి డిప్రెషన్ లోకి వెళ్లిన వెంకీని నందు కలుస్తుంది. అతన్ని ఓదారుస్తుంది. ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. తనకు ఉన్న కష్టాలతో పోలిస్తే నీకు ఒక శాతం కూడా లేవు అని వెంకీకి చెబుతుంది. తనకు ఉద్యోగం ఎవరూ ఇవ్వడం లేదని, అందరూ ఏఐ టెక్నాలజీ గురించి అడుగుతున్నారని వెంకీ చెబుతాడు.

అయితే ఆ కొత్త టెక్నాలజీ నేర్చుకోమని నందు చెబుతుంది. దానికి డబ్బులు కావాలిగా అని అంటే.. ఉదయం సమయంలో ఏదైనా జాబ్ చేస్తూ, సాయంత్రం కోర్సు జాయిన్ అవ్వమని చెబుతుంది. బైక్ నడపడం ఇష్టమైతే డెలివరీ చేయమని ఐడియా ఇస్తుంది. దీంతో వెంకీ సరే అంటాడు. మొత్తానికి అతడు నవ్వేలా చేస్తుంది నందు.

ఇందు కిడ్నాప్.. రాజులో టెన్షన్

ఇటు ఇందుని తీసుకెళ్లి తాను ముందే మాట్లాడిన రౌడీలకు అప్పగిస్తుంది ఐశ్వర్య. వీళ్లెవరు అని ఇందు అడిగితే.. నిన్ను సీఈవో కానివ్వను.. నేను నిన్ను కిడ్నాప్ చేశాను అని చెబుతుంది. దీంతో ఇందు షాక్ తింటుంది. అటు బోర్డు మీటింగ్ మొదలవుతుంది. ఇందు ఎక్కడ అని పరంధామయ్య అడుగుతాడు. వచ్చేస్తుంది అని రాజు చెబుతాడు. 12లోపు సీఈవోను అనౌన్స్ చేస్తామని, ఆలోపు రావాల్సిందే అని చెప్పడంతో రాజులో కంగారు మొదలవుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More