Brahmamudi March 14 Episode: పబ్‌లో రాజు హంగామా.. ఇందుని కాపాడి.. ఐశ్వర్యను మాటలతో పడేసి.. రాఖీని కుమ్మేసి..
Brahmamudi March 14 Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 14 ఎపిసోడ్ లో పబ్ లో రాజు హంగామా మామూలుగా ఉండదు. ఇందుని రాఖీ నుంచి అనుకోకుండా కాపాడటంతోపాటు అటు ఐశ్వర్యను కూడా మాటలతో పడేస్తాడు. అయితే అప్పుడే అసలు ట్విస్ట్ వస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో పబ్ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లి రాఖీ చేతుల్లో చిక్కుకుంటుంది ఇందు. ఆమెను అనుభవించడానికి రాఖీ ప్లాన్ చేస్తుండగా అనుకోకుండా రాజు కాపాడతాడు. ఈ క్రమంలో ఇందు మరోసారి అతనికి క్లాస్ పీకుతుంది. ఇటు ఇంట్లో రేఖ తనకు రాబోయే ఆస్తి లెక్కలు వేసుకుంటూ ఉంటుంది.

పబ్‌లోనే ఇందు ఇంటర్వ్యూ
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మార్చి 14) ఎపిసోడ్ పబ్ లో ఇందుని రాఖీ ఇంటర్వ్యూ చేసే సీన్ తో మొదలవుతుంది. రాత్రి పూట పని చేస్తావా? తాను చెప్పింది చేస్తావా లేక సొంతంగా ఆలోచిస్తావా అంటూ ఏవేవో ప్రశ్నలు అడుగుతాడు. ఇందు చెప్పిన సమాధానాలు విని రాఖీ ఓకే అంటూ వెళ్తాడు. అతని ఫ్రెండ్ మాత్రం ఇందుని అదోలా చూస్తూ ఉంటాడు. దీంతో ఆమె ఇబ్బందిగా ఫీలవుతుంది.
ఆస్తి లెక్కలు వేసుకున్న రేఖ, భ్రమరాంబ
ఇటు ఇంట్లో రేఖ ఏవో పేపర్లు చూస్తూ ఉంటుంది. భ్రమరాంబ వచ్చి ఈ టైమ్ లోనూ పని ఏంటి అని అడుగుతుంది. పని కాదు.. రేపు ఇందు సంతకం పెట్టిన తర్వాత మనకు వచ్చే ఆస్తుల లెక్కలు వేసుకుంటున్నాను అని రేఖ చెబుతుంది. ఆ ఆస్తుల చిట్టా చూసి భ్రమరాంబ ఆశ్చర్యపోతుంది.
వీళ్లకు ఇన్ని ఆస్తులు ఉన్నాయా అని అంటుంది. ఇందు సంతకం పెట్టిన తర్వాత కూడా ఈ మంద మనకు అవసరమా అని అడుగుతుంది. వాళ్లు ఉండాలి.. వాళ్లపై నేను పగ తీర్చుకోవాలి.. నా తల్లిని ఇందు తల్లి కావ్య నా కళ్ల ముందే చంపేసింది.. అందుకే ఆ పగ నేను ఇందుపై తీర్చుకుంటాను అని రేఖ అంటుంది.
పబ్‌లో ఐశ్వర్యపై కన్నేసిన లక్కీ
మరోవైపు పబ్ లో రాజు ఫ్రెండ్ లక్కీ పక్కనే ఉన్న ఐశ్వర్యపై కన్నేస్తాడు. వెంకీ కూడా నందుతో డ్యాన్స్ చేయడం చూసి తనకు మాత్రమే అమ్మాయి లేదని ఫీలవుతాడు. ఐశ్వర్య దగ్గరికి వెళ్లి ఆమె నంబర్ సంపాదిస్తానని రాజుతో ఛాలెంజ్ చేస్తాడు.
ఆమె డబ్బున్న అమ్మాయిలా ఉంది.. పొగరు ఉన్నట్లుంది వద్దని రాజు వారించినా వినడు. ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. చాలా అందంగా ఉన్నావ్.. స్మైల్ బాగుందని అంటాడు. ఆమె పట్టించుకోదు. నంబర్ అడిగితే మా ఇంట్లో పని మనిషిదా అని అతన్ని అవమానిస్తుంది. దీంతో లక్కీ ఫీలైపోయి వెళ్లిపోతాడు.
ఐశ్వర్యను మాటలతో పడేసిన రాజు
దీంతో రాజు అతన్ని ఎగతాళి చేస్తాడు. తానైతే ఆ అమ్మాయిని ఇట్టే పడేస్తానని అంటాడు. లక్కీ ఛాలెంజ్ చేస్తాడు. రాజు ఓకే అంటూ ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. ఆమెను తన మాటలతో పడేస్తాడు. తన సెన్సాఫ్ హ్యూమర్ తో ఆకట్టుకుంటాడు. ఐశ్వర్య కూడా అతని మాటలు విని పడిపోతుంది. రాజు అడగ్గానే తన నంబర్ కూడా ఇస్తుంది. అది చూసిన లక్కీ షాక్ తింటాడు. తనను మాటలతో గెలవడం ఎవరి వల్లా కాదని చెప్పాను కదా అని రాజు అంటాడు. ఐశ్వర్య నంబర్ ఇవ్వాలని లక్కీ అతని వెంట పడతాడు.
ఇందుపై రేఖ అనుమానం.. కాపాడిన స్వాతి
ఇటు ఇంట్లో రేఖ సడెన్ గా దగ్గుతూ ఇందుని పిలుస్తుంది. నీళ్లు ఇవ్వాలని అడుగుతుంది. అపర్ణ తీసుకొని వస్తుంది. ఇందు ఎక్కడ అని రేఖ, భ్రమరాంబ అడుగుతారు. మా పనులను నీతో చేయించదు కదా అని అంటారు. ఆమె అలసిపోయి పడుకుందని అపర్ణ చెప్పినా వాళ్లలో అనుమానం పోదు.
గదిలోకి వెళ్లి చూసి రమ్మని భ్రమరాంబకు చెబుతుంది రేఖ. అపర్ణ వద్దని అంటున్నా ఆమె వెళ్తుంది. అక్కడ నేలపై దుప్పటి కప్పుకొని స్వాతి పడుకుని ఉంటుంది. ఆమెను చూసి ఇందునే అనుకొని భ్రమరాంబ వెళ్లిపోతుంది. దీంతో అపర్ణ, స్వాతి ఊపిరి పీల్చుకుంటారు.
ఇందుని కాపాడిన రాజు
పబ్ లో ఇందుని లొంగదీసుకోవడానికి రాఖీ ఆమెకు ఓ ఆరెంజ్ జ్యూస్ ఆఫర్ చేస్తాడు. అందులో మత్తు మందు కలుపుతాడు. ఆ డ్రింక్ ను ఇందుకి ఇవ్వబోతుండగా లక్కీ, రాజు డ్యాన్స్ చేస్తూ తూలిపడటంతో ఆ డ్రింక్ కింద పడిపోతుంది. అనుకోకుండా ఇందుని రాజు అలా కాపాడతాడు.
కానీ ఇందు అతన్ని చూసి క్లాస్ పీకుతుంది. అన్నీ ఇలాంటి పనులే చేస్తావా అని అంటుంది. రాజుని రాఖీ నిలదీయడానికి ప్రయత్నించగా అతన్ని లాగిపెట్టి కొడతాడు. అది చూసి ఇందు షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


