...
...
Next Story

Brahmamudi March 16 Episode: ఐశ్వర్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. పబ్‌లో రాజు ఒడిలో ఇందు.. ఇంట్లో రేఖకు దొరికిపోయి..

Brahmamudi March 16 Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 16 ఎపిసోడ్ లో ఐశ్వర్యను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమెను విడిపించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇందు.. రేఖకు అడ్డంగా దొరికిపోవడం చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Mar 16, 2026, 07:17:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్లు కనిపించాయి. పబ్ లో ఇందుని రాజు పరోక్షంగా కాపాడటంతోపాటు స్మగ్లర్ ను ఇందు పట్టుకోవడం, అటు ఐశ్వర్య, లక్కీలను పోలీసులు అరెస్ట్ చేయడంలాంటివి ఆసక్తి రేపాయి. అయితే ఐశ్వర్యను కాపాడాలన్న ఆలోచన ఇందును ప్రమాదంలో పడేసింది.

ఇందుని కాపాడిన రాజు.. రాఖీని కొట్టి..

Brahmamudi March 16 Episode: ఐశ్వర్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. పబ్‌లో రాజు ఒడిలో ఇందు.. ఇంట్లో రేఖకు దొరికిపోయి..
Brahmamudi March 16 Episode: ఐశ్వర్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. పబ్‌లో రాజు ఒడిలో ఇందు.. ఇంట్లో రేఖకు దొరికిపోయి..

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 16) ఎపిసోడ్ పబ్ లో ఇందుకిి రాఖీ మత్తు మందు కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. తన జాబ్ ఏమైందని ఇందు అడిగితే.. దానికి కొంచెం టైమ్ పడుతుంది.. ముందు ఇది తాగు అని రాఖీ ఇవ్వబోతాడు. ఇంతలో రాజు, లక్కీ గొడవ పడుతూ వచ్చి వాళ్ల మీద పడతారు. దీంతో జ్యూస్ గ్లాసు కింద పడిపోతుంది.

అది చూసిన ఇందు.. రాజుని తిడుతుంది. ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తావా అని అంటుంది. అటు రాఖీ కూడా బస్తీ నుంచి వచ్చినట్లున్నాడు అని రాజుని అంటాడు. దీంతో అతని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. రాఖీని లాగి చెంపదెబ్బ కొడతాడు. అది మనసులో పెట్టుకొని నీకు ఉద్యోగం లేనట్లే అని ఇందుతో అంటాడు. అతడు ఎవరో తనకు తెలియదని చెప్పినా వినకుండా వెళ్లిపోతాడు.

రాజు ఒడిలో ఇందు

రాఖీ వెళ్లిపోయిన తర్వాత రాజుకి ఇందు క్లాస్ పీకుతుంది. నీ వల్ల నా ఉద్యోగం పోయిందని అంటుంది. వాడు నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని రాజు అంటాడు. ఇక జన్మలో నన్ను కలవకు అంటూ ఇందు చెబుతుంది.

మరోవైపు పబ్ లో ఫోన్ల దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి మాటు వేసిన నందుకు ఆ ఛాన్స్ వస్తుంది. ఆ స్మగ్లర్ ఓ వ్యక్తికి తాను దొంగిలించిన ఫోన్ అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే నందు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకుంటుంది. ఎవరు నువ్వు అని అడిగితే.. ఫోన్లు దొంగతనం చేసి అమ్మే నీలాంటి వాడి కోసం పిల్లనివ్వడానికి వస్తారా.. పదా పోలీస్ స్టేషన్ కు అంటూ అతన్ని తీసుకెళ్తుంది.

ఐశ్వర్య, లక్కీలను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇటు పబ్ నుంచి ఐశ్వర్య పీకలదాకా తాగి తూగుతూ బయటకు వస్తుంది. ఆమె కారు స్టార్ట్ అవదు. అది గమనించిన లక్కీ తన బైకు తీసుకెళ్లి ఆమె ముందు ఉంచుతాడు. దీంతో ఆమె లిఫ్ట్ అడుగుతుంది. అప్పటికే బయట పోలీసులు ఉంటారని, వద్దని రాజు వారించినా లక్కీ వినడు. ఇద్దరూ కలిసి బయటకు రాగానే పోలీసులు లక్కీని పట్టుకుంటారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నామని చెబుతాడు.

అతడు తాగడమే కాదు.. వెనుక ఐశ్వర్య ఉండటం, ఆమె పేరు కూడా అతడు మరచిపోవడంతో పబ్ కి వచ్చి అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నావా అంటూ లక్కీని అరెస్ట్ చేస్తారు. ఐశ్వర్యను కూడా తీసుకెళ్తారు. పబ్ బయటే ఉన్న ఇందు, రాజు కూడా ఇదంతా చూస్తారు. ఇందు వెంటనే స్వాతికి ఫోన్ చేసి జరిగింది చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఐశ్వర్యను తీసుకొద్దామని అంటుంది.

పోలీస్ స్టేషన్‌లో నందు, ఐశ్వర్య, లక్కీ

మరోవైపు నందు ఆ ఫోన్ల దొంగను పోలీస్ స్టేషన్ ను తీసుకొస్తుంది. ఆమెను పెంచిన తండ్రి, హెడ్ కానిస్టేబుల్ నందుని హెచ్చిరించినా ఆమె వినదు. రేపు పోలీసు అయ్యాక ఎలాగూ ఇదే పని చేయాలి కదా అంటుంది. అప్పుడే లక్కీ, ఐశ్వర్యను తీసుకొని ఎస్సై అక్కడికి వస్తాడు. పోలీస్ స్టేషన్ లో ఐశ్వర్య తన పేరు, తన వాళ్ల పేర్లను కూడా చెప్పలేకపోతుంది.

అయితే ఇందు, స్వాతి కలిసి ఎలాగోలా ఐశ్వర్యను ఇంటికి తీసుకొస్తారు. కానీ రేఖ, భ్రమరాంబ వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఇంత రాత్రి ఎక్కడికెళ్లావని ఇందుని రేఖ నిలదీస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe