...
...
Next Story

Brahmamudi March 24th Episode: బ్రహ్మముడి- ఇందుకు కాలు చూపిన రేఖ- అక్క అన్న నందు- 10 లక్షల నెక్లెస్ అమ్మనున్న ఐశ్వర్య!

Brahmamudi Serial March 24th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 24వ తేది ఎపిసోడ్‌లో ఇందును కావాలని కాలు అడ్డుపెట్టి పడగొడుతుంది భ్రమరాంబ. దాంతో సాంబార్ కిందపడుతుంది. ఇందును తుడుస్తుంది. ఇందు మొహానికి కాలూ చూపుతూ అవమానిస్తుంది రేఖ. ఐశ్వర్యకు తీసుకొచ్చిన 10 లక్షల నెక్లెస్‌ను అమ్మాలనుకుంటుంది.

Published on: Mar 24, 2026, 08:36:07 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇందు చేసిన వంట బాగా లేదని కావాలనే వంకలు పెడతారు. అపర్ణను రెచ్చగొట్టేలా నానా మాటలు అంటారు. కనీసం సాంబారు అయిన బాగా చేశావా అని రేఖ అంటే చేశాను అని వడ్డించబోతుంది ఇందు. కావాలనే ఇందుకు భ్రమరాంబ కాలు అడ్డం పెడుతుంది.

ఈ మాత్రం బరువు మోయలేవా

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 24వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 24వ ఎపిసోడ్

దాంతో ఇందు కిందపడిపోతుంది. రేఖ చీరపై సాంబారు పడుతుంది. అపర్ణ వచ్చి ఇందును లేపుతుంది. ఈ మాత్రం బరువు మోయలేవా, రేఖ కాస్ట్‌లీ చీర పాడైపోయేది అని తిడుతుంది భ్రమరాంబ. కింద పడిన సాంబార్ ఇప్పుడే క్లీన్ చేయమంటుంది రేఖ. దాంతో ఇందు క్లీన్ చేస్తుంది. శుభ్రం చేస్తుంటే అన్నం తింటూ ఇందు మొహానికి కాలు పెడుతుంది రేఖ.

అది చూసి అపర్ణ ఆవేశంతో ఊగిపోతుంటే.. ఇందు వద్దని వారిస్తుంది. కాలు ఆడిస్తూ ఇందును అవమానిస్తుంది రేఖ. తుడిచింది చాలు ఇక వెళ్లమని చెబుతుంది రేఖ. క్రూరంగా ప్రవర్తించి రాక్షస ఆనందం పొందుతారు రేఖ, భ్రమరాంబ. నువ్వు పెట్టిన భయం బాగానే పనిచేస్తుందని నవ్వుకుంటారు. మరోవైపు నందు దగ్గరికి వచ్చిన వెంకీ కోపంగా చూస్తాడు.

పబ్‌లో చేసినదాని గురించి కోప్పడతాడు వెంకీ. నీతో డ్యాన్స్ చేయడం వల్లే నా గర్ల్‌ఫ్రెండ్ వదిలి వెళ్లిపోయిందంటాడు. అసలు నీ గర్ల్‌ఫ్రెండ్ నిజంగా పబ్‌కి వచ్చిందా అని నందు అడుగుతుంది. వచ్చిందని మా అన్నయ్య వాళ్లు చెప్పారని జరిగింది చెబుతాడు వెంకీ. మీ అన్నయ్య వాళ్లు అబద్ధం చెప్పి నీతో బిల్లు కట్టించుకున్నారు. నిన్ను కమెడియన్ స్టోరీ చెప్పారు అని నందు అంటుంది.

తల్లిదండ్రుల ప్రేమకథలా

రేపటి నుంచి మన జర్నీ స్టార్ట్ అండి అని వెంకీ అంటే.. మనది కాదు మీది అని నందు అంటుంది. సేమ్ తండ్రి కల్యాణ్ ప్రేమకు తల్లి అప్పు హెల్ప్ చేసినట్లుగానే రాజ్ తమ్ముడు వెంకీకి నందు హెల్ప్ చేయనుంది. అంటే తల్లిదండ్రుల ప్రేమకథలాగే నందు లవ్ స్టోరీ ఉండనుంది. మరోవైపు ఇందుని అంతలా అవమానించినదాని గురించి స్వాతి బాధపడుతుంది.

ఆ రేఖ ఆంటీని ఏదో ఒకటి చేయాలని అంటుంది స్వాతి. తాతయ్య, నానమ్మలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసేంతవరకు ఏం చేయకూడదని ఇందు అంటుంది. ఇంతలో ఇందుకు మెసేజ్ రావడంతో జాబ్ కోసం ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చిందని, నా పరిస్థితికి ఇదే పరిష్కారం అని చెబుతుంది. నీకో సపోర్ట్ దొరికితే చాలు, నీకు ఆ సపోర్ట్ ఏ రూపంలో వస్తుందో అని స్వాతి అంటుంది.

యాక్సిడెంట్ కల

మరోవైపు రాజ్ చిన్నతనంలో జరిగిన యాక్సిడెంట్ గురించి కల వస్తుంది. అదే విషయం తల్లిదండ్రులకు చెబుతాడు రాజ్. చుట్టు మంటలే ఉన్నాయి. ఇంకేం కనిపించలేదు అని రాజ్ అంటాడు. చిన్నప్పటి నుంచి నీకు ఇదే వస్తుందని తండ్రి సెటైర్ వేస్తాడు. చిన్నతనంలో వచ్చింది ఇప్పుడు మళ్లీ ఎందుకు వచ్చింది. ఎవరైనా వాడికి సంబంధించినవాళ్లు దగ్గరవుతున్నారా అని తల్లి అంటుంది.

అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకని భర్త అంటాడు. మరోవైపు హాల్లో అంతా ఉంటారు. ఇందు బయటకు ఇంటర్వ్యూ వెళ్లేందుకు ఎదురుచూచ్తుంది. ఐశ్వర్యకు స్పెషల్‌గా నెక్లెస్ చేయమని చెప్పారుగా, అది తీసుకొచ్చానని వచ్చిన అతను అంటాడు. అది చూసి చాలా బాగుందనుకుంటారు రేఖ, భ్రమరాంబ. ఆ నెక్లెస్ చూసి బాగుందని ఐశ్వర్య చెబుతుంది.

అది చేయించడానికి రూ. 10 లక్షలు అయింది. అంత సింపుల్‌గా చెబుతావేంటీ అని భ్రమరాంబ అంటుంది. అంతా నీ మేనకోడలుకేనా నా కూతురికి ఏం లేదా అని భ్రమరాంబ అంటుంది. ఐశ్వర్యకు పెద్దగా చదువురాదు. త్వరగా పెళ్లి చేసి పంపిద్దామని ఇవన్నీ చేయిస్తున్నా. స్వాతికి ఇప్పుడే ఏమొచ్చింది. దానికి టైమ్ ఉందిగా అని రేఖ అంటుంది.

ఐశ్వర్యకు పెళ్లి చేయాలని

నా కూతురు దగ్గరికి వచ్చేసరికి దీనికి ఏ టైమ్ ఉండదని భ్రమరాంబ మనసులో అనుకుంటుంది. ఇందును త్వరగా శివరామ్ ఇంటికి వెళ్లమంటుంది రేఖ. దాంతో ఇందు వెళ్లిపోతుంది. ఆ ఇందు నిజంగానే శివరామ్ ఇంటికి వెళ్తుందా అని భ్రమరాంబ అంటుంది. నేను ప్రతిసారి ఏదో వంక పెట్టుకుని శివరామ్‌తో మాట్లాడుతున్నా అని రేఖ చెప్పి వెళ్లిపోతుంది.

ఏం భ్రమరాంబ బాగా నిరాశపడినట్లు ఉన్నావ్. నిన్ను బాగానే పిచ్చిదాన్ని చేసింది. ఆస్తి విషయంలో కూడా నువ్వు ఇలాగే వట్టి చేతులతో మిగిలిపోతావ్ అని హెచ్చరించి వెళ్లిపోతాడు శేషు. మరోవైపు ఐశ్వర్యకు రాకేష్ కాల్ చేసి డబ్బులు అడుగుతాడు. ఈరోజు డబ్బు పంపిస్తే సరి లేకుంటే నేరుగా వచ్చి మీ ఆంటీతో మాట్లాడతా అని రాకేష్ బెదిరిస్తాడు.

అప్పుడే నెక్లెస్ గుర్తుకు వచ్చి దాన్ని అమ్మేసి పది లక్షలు తీసుకుని రాకేష్‌కు ఇద్దామనుకుంటుంది ఐశ్వర్య. అనుకున్నట్లుగానే నెక్లెస్ తీసుకెళ్తుంది. ఎక్కడ అమ్మాలో ఆలోచిస్తున్న ఐశ్వర్యకు లక్కీ కనిపించి కారులో ఎక్కించుకుంటాడు. అది ఇందు చూస్తుంది. లక్కీని ఫాలో అవుతుంది ఇందు.

అక్క అన్న నందు

ఈ క్రమంలో రౌడీల వెంటపడుతూ నందు వస్తుంది. నందును ఇందు కాపాడుతుంది. దాంతో అక్క అని ఇందును నందు పిలుస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe