Brahmamudi November 14 Episode: బ్రహ్మముడి.. ఎక్స్‌పోలో ఐశ్వర్యకు 300 కోట్ల డీల్.. రాజు, ఇందుకి షాకిచ్చిన రఘువీర్
Brahmamudi Serial November 14th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్ లో కడుపులో బిడ్డను అడ్డం పెట్టుకొని మాట నెగ్గించుకున్న ఐశ్వర్య ఎక్స్‌పోలో రాజు, ఇందును దొంగ దెబ్బ తీస్తుంది. ఆమెకు రూ.300 కోట్ల డీల్ రావడం, రఘువీర్ ఎంట్రీతో రాజు, ఇందుకు షాక్ తగులుతుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ మొత్తం జువెలరీ ఎక్స్‌పో చుట్టూ తిరిగింది. కడుపులో బిడ్డను అడ్డం పెట్టుకొని ఇందుతో సంతకం చేయించుకుంటుంది ఐశ్వర్య. అదే రాజుతో ఇందు గొడవకు కారణమవుతుంది.

ఐశ్వర్యపై జాలి చూపొద్దన్న రాజు
అలిగిన ఐశ్వర్య కోసం ఇందు భోజనం తీసుకెళ్లే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. ఆమెకు అడ్డుపడిన రాజు ఐషూపై జాలి చూపొద్దని అంటాడు. ఇలాగే మనం లొంగితే ఆమె రెచ్చిపోతుంది.. ఆమె చేసిన మోసం గుర్తు పెట్టుకో అని చెబుతాడు.
కానీ ఇందు మాత్రం ఇది ఐషూ కోసం కాదు.. ఆమె కడుపులో బిడ్డ కోసం అని చెబుతుంది. అయినా రాజు వినడు. ఆమె చేతుల్లో నుంచి భోజనం తీసుకొని నువ్వు వెళ్లు అని ఇందుతో అంటాడు.
ఐశ్వర్య అలక గురించి ఇందుకి చెప్పిన లక్కీ.. తిట్టిన అపర్ణ, ఇందు
మరుసటి రోజు ఉదయమే ఇందు హడావిడిగా ఎక్స్‌పోకు వెళ్తుంది. ఆమెకు లక్కీ అడ్డుపడతాడు. ఐశ్వర్య తినడం లేదని చెబుతాడు. ఆమెకు ఏం కావాలో చేసి పెట్టమని అపర్ణతో అంటుంది ఇందు. కానీ ఐషూకి ఎక్స్‌పో కోసం సంతకం కావాలని లక్కీ అంటాడు. ఆ
మె అలక తీర్చడానికి తన సంతకమే పరిష్కారమా అని అపర్ణ, ఇందు అతన్ని తిడతారు. అయినా లక్కీ మాత్రం కనీసం ఆమె కడుపులోని బిడ్డ కోసమైనా ఆలోచించండి అని బతిమాలుతాడు. దీంతో చేసేది లేక ఇందు వెనుకడుగు వేస్తుంది.
ఎక్స్‌పోలో స్వరాజ్ స్టాల్.. ప్రశాంత్‌కు రాజు క్లాస్
ఇటు ఎక్స్‌పో మొదలవుతుంది. స్వరాజ్ స్టాల్ ను సిద్ధం చేసి ప్రశాంత్ పాట పాడుతూ ఉంటాడు. అతన్ని చూసి రాజు క్లాస్ పీకుతాడు. పని చేయమంటే పాట పాడుతున్నావా అని అంటాడు.
ఇక్కడ అన్నీ స్టోన్ జువెలరీలే ఉన్నాయి.. డిజైనరీ జువెలరీ ఎక్కడ అని అడుగుతాడు. దీంతో ప్రశాంత్ వాటిని తెచ్చి పెడతాడు. స్వరాజ్ స్టాల్ చాలా గ్రాండ్ గా సిద్దమవుతుంది.
ఎక్స్‌పోకి వచ్చిన ఐశ్వర్యకు షాక్.. పేరు లేదంటూ..
అప్పుడే ఎక్స్‌పో కోసం ఐశ్వర్య వస్తుంది. తన పంతం నెగ్గించుకోవడంపై పారు ఆమెను అభినందిస్తాడు. అయితే ఆమెకు ఎంట్రీ దగ్గరే షాక్ తగులుతుంది. మీ పేరు లిస్టులో లేదని, లోనికి వెళ్లడం కుదరదని అక్కడున్న సెక్యూరిటీ వాళ్లు అడ్డుకుంటారు.
తన దగ్గర ఇందు ఇచ్చిన లెటర్ ఉందని, గంట ముందే అనుమతి వచ్చిందని ఐషూ చెప్పినా వాళ్లు వినరు. లిస్టులో పేరు లేకపోతే లోనికి పంపించలేమని అంటారు. అయితే స్వరాజ్ స్టాల్ దగ్గర ఉన్న రాజు అనుమతి ఇస్తే పంపిస్తామని, ఆయనను పిలుచుకొస్తామని వెళ్తారు.
ఇందు లెటర్ ఫోర్జరీ అన్న రాజు.. రెచ్చిపోయిన ఐషూ
దీంతో రాజు అక్కడికి వస్తాడు. ఐశ్వర్యను చూడగానే అతడు వెటకారంగా మాట్లాడతాడు. ఈమె దగ్గర ఇందు మేడమ్ సంతకం చేసిన లెటర్ ఉందని చెబుతోంది అని దానిని రాజుకు చూపిస్తారు.
అది చూసిన రాజు.. ఛాన్సే లేదు.. ఇందు ఈమెకు సంతకం పెట్టదు.. ఇది కచ్చితంగా ఫోర్జరీయే అని అంటాడు. దీంతో ఐషూ రెచ్చిపోతుంది. రాజుతోపాటు అక్కడున్న వాళ్లతో గొడవకు దిగుతుంది. తాను లోనికి వెళ్తానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని అంటుంది. బలవంతంగా లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
ఐషూని కాపాడిన ఇందు.. రాజుకి షాక్
దీంతో సెక్యూరిటీ వాళ్లు బలంగా ఆమెను తోయడంతో కింద పడబోతోంది. అప్పుడే ఇందు వచ్చి ఆమెను పట్టుకుంటుంది. సెక్యూరిటీ వాళ్లను తిడుతుంది. ఆమె వద్దన్నా వినకుండా లోనికి రావడానికి ప్రయత్నిస్తే అలా చేశామని వాళ్లు చెబుతారు. ఆమె దగ్గర లెటర్ ఉంది అని, కానీ అది ఫోర్జరీ అని రాజు చెబుతాడు. కానీ ఆ సంతకం తాను చేసిందే అని ఇందు చెప్పడంతో రాజు షాకవుతాడు. ఆమెను అనుమతించాలని ఇందు చెప్పడంతో సరే అని ఐషూని లోనికి పంపిస్తారు.
ఇందు, రాజుకి క్లాస్ పీకిన ఐశ్వర్య
అయితే లోనికి వచ్చిన తర్వాత కూడా ఐషూ రెచ్చిపోతుంది. ఇద్దరిలో ఎవరి ప్లాన్ ఇది.. మీ ముఖాలు చూస్తేనే ఇది మీ ప్లానే అని అంటుంది. కావాలని పిలిచి అవమానించడానికే ఇలా చేశారని నిందిస్తుంది. కానీ రాజు మాత్రం ఎదురు తిరుగుతాడు. ఎలా అయితేనేం.. లోనికి వచ్చావు కదా.. ముందు నీ స్టాల్ సంగతి చూసుకో అని తిట్టి పంపిస్తాడు.
ఇందు సంతకం చేసిందని తెలిసి రాజు అప్‌సెట్
ఆమె వెళ్లిన తర్వాత అసలు ఐశ్వర్యకు నువ్వు సంతం చేయలేదు కదా.. ఫోర్జరీ చేసిందని తెలిస్తే అక్కడ పరువు పోతుందని అబద్ధం చెప్పావు కదా.. అని ఇందుని రాజు అడుగుతాడు. కానీ ఇందు మాత్రం తాను సంతకం చేశానని అంటుంది. తాను వద్దన్నా ఎందుకు చేశావని రాజు నిలదీస్తాడు. ఇలా అయితే ఇంట్లో తన మాటకు గౌరవం ఎలా ఉంటుందని అంటాడు. కానీ ఇందు మాత్రం ఇంట్లో జరిగిన పరిస్థితులను రాజుకు వివరిస్తుంది.
ఎలాంటి పరిస్థితుల్లో తాను సంతకం చేయాల్సి వచ్చిందో చెబుతుంది. కడుపులో బిడ్డను అడ్డం పెట్టుకొని ఆమె నాటకాలు ఆడుతోంది.. ఆమె నీతో ఆడుకుంటోంది.. ఇలాగే బ్లాక్‌మెయిల్ చేసి అగ్రిమెంట్లు, సంతకాలు తీసుకుంటుంది.. తొలి డీల్ లోనే ఆమె చేసిన మోసం గుర్తు లేదా.. ఆమె వల్ల మనం రూ.కోటి నష్టపోయాం అని రాజు అంటాడు. తొలిసారి కదా.. వదిలెయ్.. ఎప్పటికైనా ఆమె తన తెలివితేటలతో మనల్ని మించిపోతే చాలు అని ఇందు అంటుంది. కానీ రాజు మాత్రం ఆమె నిర్ణయంతో తీవ్రంగా అప్‌సెట్ అవుతాడు.
రాజు, ఇందుకి షాక్
ఇక ఎక్స్‌పో విన్నర్ ను చివర్లో అనౌన్స్ చేస్తారు. స్వరాజ్ గ్రూపు సిస్టర్ కంపెనీ ఐశ్వర్య జువెలర్స్ గెలిచిందని చెప్పడంతో రాజు, ఇందు షాకవుతారు. అంతేకాదు ఆ కంపెనీకి రూ.300 కోట్ల డీల్ కుదిరిందని చెబుతారు. అందులో ఇన్వెస్ట్ చేయబోయేది రఘువీర్ అని అనౌన్స్ చేస్తారు. అప్పుడే రఘువీర్ ఎంట్రీ ఇవ్వడంతో వీడా అని అతన్ని చూసి రాజుతో ఇందు అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


