Brahmamudi November 10 Episode: బ్రహ్మముడి- రేఖ వైపే శేషు, లక్కీ- రాజును గెంటేసిన చలపతి- ఐశ్వర్య కంపెనీకి బ్లాక్ మార్క్

Brahmamudi Serial November 10th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10వ ఎపిసోడ్‌‌లో రుద్రాణి చేసిన దారుణాలు చెప్పి ఇంకోసారి గొప్పగా చెప్పాలని చూస్తే ఏం చేయడానికైనా రెడీ అంటాడు సుభాష్. దాంతో రాజు విజిల్ కొడతాడు. కోపంతో రేఖ రగిలిపోతుంది. తల్లివైపే లక్కీ మాట్లాడుతాడు. రాజును చలపతి గెంటేస్తాడు.

Published on: Nov 10, 2026, 09:59:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణి దారుణాల గురించి ఆవేశంగా సుభాష్ చెబుతాడు. ఏది కుదరకపోయేసరికి అందరి ప్రాణాలు తీసి మహాపాపం మూటగట్టుకుంది. అలాంటి పాపిష్టి ఫొటోలు నట్టింట్లో పెట్టుకోమంటావా. రోజు పొద్దున్నే చూడమంటావా. ఇంకొక్కసారి వాళ్ల గురించి గొప్పగా చెప్పాలని చూస్తే నేను ఏం చేయడానికైనా వెనుకాడను అని ఆవేశంగా వార్నింగ్ ఇస్తాడు సుభాష్.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10 ఎపిసోడ్

సుభాష్ మాటలకు రాజు విజిల్

దాంతో రాజు విజిల్ కొడతాడు. సూపర్ తాతయ్య.. గట్టిగా ఇచ్చేశావ్ అంటాడు. ఏంటీ పిన్ని చెవులకు పట్టిన తుప్పు పోయిందా. ఇకనుంచి నీ ఆటలు ఆడవా. అక్కడి నుంచి తీస్తే స్టోర్ రూమ్‌లో అయినా సేఫ్‌గా ఉంటాయి. లేకుంటే డంపింగ్ యార్డ్‌లో ఉంటాయని రాజు అంటాడు. రేఖ అరిస్తే రాజు మరింత అరుస్తాడు. రాజు కోపానికి రేఖ సైలెంట్ అవుతుది.

భూషణ్ అంటే అతనికి కూడా కౌంటర్ ఇస్తాడు రాజు. మాకు కూడా ఓ రోజు టైమ్ వస్తుందని భ్రమరాంబ అంటుంది. అసలు మీ అందరికి ఏంటీ సమస్య. దుగ్గిరాల సంస్థను స్థాపించి వేలమందికి అన్నం పెట్టారు. ఇలాంటి వాళ్ల ఫొటోలు పెట్టకుండా వాళ్లవి పెడతారా అని రుద్రాణి, రాహుల్ ఫొటోలు తీసేసి సీతారామయ్య, ఇంద్రాదేవి ఫొటో ఫ్రేమ్ పెడతాడు రాజు.

ఈ ఫొటోను ఇక్కడి నుంచి తీసే దమ్ము ఎవరికైనా ఉందా అంటాడు రాజు. నువ్వు పెట్టాకా తీసే దమ్ము ఎవరికి ఉంటుందని శేషు అంటాడు. రేఖ కోపంగా వెళ్లిపోతుంది. అపర్ణ, సుభాష్, ఇందు అంతా సంతోషిస్తారు. సుభాష్‌కు అపర్ణ ట్యాబ్లెట్ ఇస్తుంది. రాజు వస్తాడు. ఆ ట్యాబ్లెట్స్ నాకు అవసరం లేదు. నువ్వు వచ్చావు. నువ్వున్నావన్న గుండె ధైర్యంతో బతికేస్తానంటాడు సుభాష్.

పోయిన ప్రాణాలు తిరిగొచ్చాయి

పాతికేళ్లు తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు బయటపెట్టలేకబతికామని ఆవేదన చెప్పుకుంటారు సుభాష్, అపర్ణ. ఈరోజు అమ్మనాన్నల ఫొటోలు పెట్టగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయని సుభాష్ అంటే.. వాళ్లకు సరైన గౌరవం తెచ్చావని అపర్ణ అంటుంది. వాళ్లకు ఘనమైన నివాళి అందించావని సుభాష్ అంటాడు. ప్రతి కాలంలో రాక్షసులు ఉంటారు. కానీ రాక్షస సంహారం ఉంటుందిగా. అది ఇప్పుడే మొదలైంది. ముందు ముందు చాలా చూస్తారు. వాళ్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోవడం చూస్తారని రాజు అంటాడు.

శభాష్.. ఈ ఒక్కమాటతో దుగ్గిరాల కుటుంబం మొత్తం ప్రక్షాళణ అవుతుందన్న భరోసా వచ్చిందని సుభాష్ అంటాడు. నాకు ఇంకొక్క మాట ఇస్తావా. ఎప్పుడు ఇలాగే ఇందుకు తోడుగా ఉండు. దూరమైన ఆనందాన్ని తిరిగి ఇవ్వు. మాటివ్వు అని అపర్ణ అంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇందు కంట్లో కన్నీళ్లు రావని రాజు మాటిస్తాడు.

మరోవైపు ముసుగు వేసుకుని భ్రమరాంబ ఫీల్ అవుతుంది. రేఖ కోపంతో రగిలిపోతుంది. రేఖ గదిలో రాహుల్, రుద్రాణి ఫొటోలను పెడతారు భూషణ్, లక్కీ. రేఖ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా ముందే ఫొటోలు తీస్తుంటే అడ్డుకోలేకపోయాను, అవమానాన్ని ఆపలేకపోయాను అని రేఖ అంటుంది. నువ్వు ఫైర్ బ్రాండ్ అని విన్నాను. కానీ ఎందుకు సైలెంట్ అయ్యావని లక్కీ అంటాడు.

ఇల్లు స్మశానం చేస్తాను

చెల్లెమ్మ ఫైర్ ఆరిపోయిందని శేషు అంటాడు. టైమ్ చూసుకుని అందరిని తగలబెట్టేస్తుందని భూషణ్ అంటాడు. అవును మా అమ్మ టార్గెట్ చేస్తే మనుషులే కాలి బూడిదైపోయారు. నేను టార్గెట్ చేస్తే ఈ ఇల్లు మొత్తం స్మశానం అయిపోతుందని రేఖ అంటుంది. ఆ రాజుగాడిని అస్సలు వదిలిపెట్టను. ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని భయపడేలా చేస్తానని రేఖ అంటుంది.

వాడు అవమానించింది మా నాన్నను, నానమ్మను. ఆ రాజు సంగతి నేను చూసుకుంటాను. వాళ్లను ఎలా దెబ్బ కొడతానో చూడండి. ఆల్రెడీ నేను చేయాల్సింది చేస్తున్నాను. జస్ట్ వెయిట్ చేయండని ఐశ్వర్య అంటుంది. ఏంటమ్మా అని శేషు అడిగితే.. వెళ్లి రాజుకు చెబుతావా అని భ్రమరాంబ అంటుంది. అదే జరిగితే అన్నయ్యవన్నది కూడా చూడను అని రేఖ అంటుంది.

హమ్మమ్మ.. మీరు ఏ గట్టునా ఉంటే ఆ గట్టునే పట్టుకుంటా అని శేషు అంటాడు. మరోవైపు రాజు దగ్గరికి ఇందు ఫిల్టర్ కాఫీ, నందు ఎనర్జీ డ్రింక్ తీసుకొస్తారు. ముందు ఏది తాగుతావ్ అని ఇద్దరు పోటీ పడతారు. పెళ్లాం కాదు మరదలు కాదు అని రెండు మిక్స్ చేసి తాగుతాడు రాజు. దీన్ని ఎనర్జీ కాఫీ డ్రింక్ అంటారని తాగేస్తాడు రాజు. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. రాజు థ్యాంక్స్ చెబుతాడు.

రాజును ఇరికించిన మరదళ్లు

నిజానికి థ్యాంక్స్ మేమే చెప్పాలి. నీతో ఇంకో గొప్ప పని చేయించబోతున్నామని ఇందు అంటుంది. నీ తమ్ముడికి జాబ్ బయట ఎక్కడ రావట్లేదుగా. మన కంపెనీలోనే జాబ్ ఇద్దామని అంటారు. వావ్ ఐడియా బాగుంది. ఇంకేంటీ ఫోన్ చేసి చెప్పేయండని రాజు అంటాడు. నువ్వు వెళ్లి మా మావయ్య గారిని ఒప్పించాలని ఇందు అంటే.. రాజు భయపడతాడు.

వెంకీ కష్టం గురించి చెప్పి సెంటిమెంట్ డైలాగ్స్ కొడతారు రాజు మరదళ్లు. దాంతో రాజు ఒప్పుకుంటాడు. అలా రాజును ఇరికిస్తారు మరదళ్లు. మీరు నాకు ఎనర్జీ కాఫీ డ్రింక్ ఇవ్వడానికి ఇంత కుట్ర కోణం ఉందా అంటాడు. ఎస్ అని ఇద్దరు రాజును పంపిస్తారు. రాజు ఇంటికి వెళ్తాడు. మీ ఆవిడ గెంటేసిందా అని చలపతి అంటాడు. మన వెంకీకి జాబ్ విషయం మాట్లాడదామని వచ్చానని రాజు అంటాడు.

వాడికి నేను జాబ్ సెట్ చేశాను. మన కంపెనీలో జాబ్ పెట్టేశాను. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వాడికి జాబ్ ఇద్దామనుకుంటున్నా అని రాజు అంటాడు. దాంతో కోపంగా రాజును బయటకు పొమ్మంటాడు చలపతి. ఆ ఇంటికి నీ తమ్ముడిని లాక్కెళ్దామనుకుంటున్నావా, కొత్త భయాలు పెట్టకని తిడతాడు చలపతి. వెళ్లిపొమ్మని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు చలపతి.

మేడమ్ కంటే పెద్ద పాము

మరోవైపు ఐశ్వర్య ఆఫీస్‌లో పీఏ ఏదో సెర్చ్ చేస్తుంటే మేనేజర్ వచ్చి అడుగుతాడు. డేటింగ్‌లో ఎవరైనా అమ్మాయి దొరుకుతుందేమో అని చూస్తున్నానని పీఏ అంటాడు. అది ఏదో జాబ్ సెర్చ్‌లా ఉంది. ఎందుకు అని మేనేజర్ అడిగితే.. త్వరలోనే ఈ కంపెనీ మూసేస్తారు కాబట్టి. నా సిక్త్స్ సెన్స్ చెప్పిందని పీఏ అంటాడు. మేడమ్ మొదటి ప్రాజెక్ట్‌లోనే టాలెంట్ చూపించింది. మొత్తం కంపెనీని మట్టికరిపించారని పీఏ అంటాడు.

ఆ మాటలు ఐశ్వర్య వింటుంది. మేనేజర్ చూసి షాక్ అవుతాడు. పా పా.. అని మేనేజర్ అంటే.. మన ఆఫీస్‌లో మేడమ్ కంటె పెద్ద పాము ఎవరున్నారు. పాముకు తలలో మాత్రమే విషం ఉంటుంది. మేడమ్‌కి ఒళ్లంతా విషమే. ఆవిడ దగ్గర బేసిక్ సెన్స్ ఉన్నోడు కూడా జాబ్ చేయడు. కష్టపడి కంపెనీ ముందుకు తీసుకెళ్లడం కాదు అడ్డదారిలో సంపాదించడమే ధ్యాస అని పీఏ అంటాడు.

పారు ఇవన్ని మేడమ్‌కి తెలిస్తే బాగుండదేమో అని మేనేజర్ సుబ్బు అంటే నాకు కనిపిస్తే ఆవిడ మొహం మీదే చెప్పేస్తానంటాడు. మరి చెప్పు అని ఐశ్వర్య అంటుంది. ఈరోజు ఇంత అందంగా ఉన్నారేంటీ మేడమ్ అంటాడు పారు. నేను వేరే కంపెనీకి వెళ్తున్నాను. అది మీకు కూడా తెలుసు. ఆ విషయం సుబ్బుకు కూడా తెలిసి భయపడుతున్నాడని పారు అంటాడు.

ఐషు కంపెనీకి బ్లాక్ మార్క్

వీడు దొరకడమేకాకుండా నన్ను కూడా ఇరికిస్తున్నాడు. వీన్ని ఇక్కడే పాతేయాలని సుబ్బు మనసులో అనుకుంటాడు. పారును క్యాబిన్‌కి పిలుస్తుంది ఐశ్వర్య. నీకు కొంచెం కూడా ఎథిక్స్ లేవా అని ఐషు అంటే అది మీరు మాట్లాడొద్దని పారు అంటాడు. మన కంపెనీలో ఫండ్స్ లేవు. కొత్తగా డీల్స్ రావు. వచ్చినా కూడా రిసోర్స్ లేవు అని పారు చెబుతాడు.

వై ఫై బిల్ కూడా కట్టలేని పొజిషన్‌లో ఉన్నామని పీఏ అంటాడు. టీవీ ఆన్ చేస్తుంది ఐశ్వర్య. అందులో జ్యూవెలరీ ఎక్స్‌పో గురించి వస్తుంది. అందులో జ్యూవెలరీ కంపెనీలు పాల్గొంటాయని, లార్జ్ స్కేల్‌లో బిజినెస్ చేసేవాళ్లతో జరుగుతుందని చెబుతారు. ఇందులో మనం పాల్గొంటే మనకు ఈజీగా డీల్స్ వస్తాయని ఐశ్వర్య అంటుంది.

అసలు ఈ కంపెనీకి మీరు ఎండీ ఎలా అయ్యారు మేడమ్ అని సెటైర్లు వేస్తాడు పారు. అది చాలా ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌పో. అక్కడ పాల్గొనే కంపెనీకి ఒక చరిత్ర ఉంటుంది. ఎస్టాబ్లిష్‌డ్ కంపెనీలకే పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు చేసిన ఘనకార్యం వల్ల మన కంపెనీ మీద బ్లాక్ మార్క్ పడింది. ఏదైనా మంచి పేరున్న కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకుని దానికి మన కంపెనీ సిస్టర్ కంపెనీ అని చూపించగలిగితే అక్కడికి వెళ్లే అవకాశం ఉందని పారు ఐడియా ఇస్తాడు.

సంతకానికి రాజు, ఇందు నో

దాంతో స్వరాజ్ కంపెనీకి సిస్టర్ కంపెనీగా చేయమని సంతకం పెట్టమని ఐశ్వర్య అడుగుతుంది. సంతకం చేయమని రాజు, ఇందు అంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More