Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- పారు ఆట- సూరజ్ కొత్త బిజినెస్ డీల్- జ్యోత్స్న కోరిక తీర్చాలన్న క్లయింట్
Karthika Deepam 2 Serial November 9th Episode: కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 9వ ఎపిసోడ్లో చీకటి యుద్ధం ఆపేద్దామని జ్యోత్స్న జీవితం అలా కావడానికి కారణం నువ్వేనని పారుతో కార్తీక్ అంటాడు. సూరజ్‌కి బిజినెస్ డీల్ వస్తుంది. అది ఓకే అయితే జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి పాన్ ఇండియా స్థాయి వస్తుందంటాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు అన్నదాని గురించి తలపట్టుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ కాల్ చేసి తన తల్లిని అనాల్సిన అవసరం ఏముందని తిడతాడు. నిజానికి అలా కాల్ చేసేలా చేసింది మీ అమ్మే అని. ఇదివరకు ఇంటికొచ్చినప్పుడు తన గురించి చాలా దారుణంగా మాట్లాడి రెచ్చగొట్టిందని జ్యోత్స్న అంటుంది.

మీ అమ్మనే తప్పుబట్టాలి
ఏమన్నదని సూరజ్ అడిగితే.. మా అమ్మ పెంపకాన్నే తప్పుబట్టిందని జ్యోత్స్న అంటుంది. తప్పుబట్టాల్సింది పెంపకాన్ని కాదు మీ అమ్మనే అని సూరజ్ అంటాడు. ఏయ్.. మా అమ్మను అనకు. రోడ్డు మీద అలా కనపడితే ఎవరైనా అలాగే అర్థం చేసుకుంటారు. ఎంత చెప్పిన వినరు. అదంతా నా మీదకు వచ్చింది. నన్ను పెళ్లి చేసుకోమ్మని అంటున్నారు అని జ్యోత్స్న అంటుంది.
షాక్ అయిన సూరజ్ నువ్వేమని చెప్పావని సూరజ్ అడుగుతాడు. పెళ్లి సంబంధాలు చూడమన్నాను అని జ్యో అంటుంది. దాంతో సూరజ్ అవాక్కవుతాడు. అని చెబుతానని అనుకున్నావా. నేను ఏం చెప్పానో చెప్పను. నేను ఎవరిని చేసుకుంటే ఏంటీ. నీకు భయం ఉండదు. కానీ. మీ అమ్మకుంది. నేను నిన్ను ఎక్కడ ఎగరేసుకుని పోతానో అని భయపడుతూ బతుకుతుంది. అందుకే ఇదంతా అని జ్యోత్స్న అంటుంది.
మీ అమ్మ మా అమ్మను తిడుతుంటే ఆపాలిగా అని సూరజ్ అంటాడు. నేనెందుకు ఆపాలి. మీ అమ్మ మా అమ్మను వచ్చి తిట్టిందని జరిగింది చెబుతుంది జ్యోత్స్న. దానికి ఇది కౌంటర్. ఆరోజు మీ అమ్మ మాట్లాడింది తప్పు కాదనుకుంటే ఈరోజు మా అమ్మ మాట్లాడింది తప్పు కాదు. అసలు మీ అమ్మ అలా ఎందుకనాలి. మీ అమ్మకు నువ్వు జ్యోత్స్న కావాలని చెప్పావా అని జ్యో అంటుంది.
నా ముందు ఒప్పుకోవు
ముందు మీ అమ్మను లిమిట్స్‌లో ఉండమను అని సూరజ్ అంటే.. అది మీ అమ్మకు చెప్పు. నోరుంది కదా అని ఏదిపడితే అది మాట్లాడకను. మీ అమ్మ స్వార్థపరురాలు. నేను నీకు ఎక్కడ దగ్గరవుతానని భయం. అందుకేగా బాడీ గార్డులతో ఫాలో అవుతుంది. నాకు తెలియదనుకుంటున్నావా. నువ్వు నన్ను కలిసిన ప్రతిసారి నన్ను ఫాలో అవుతుంది. నిజానికి అది నీకు కూడా తెలుసు. కానీ నా ముందు ఒప్పుకోవు. ఆ మాటకొస్తే నువ్వు ఏది ఒప్పుకోవు అని జ్యో అంటుంది.
ఏది ఎక్కడితో ఆగదు. అన్ని పూర్తి చేయాల్సిందే. జాగ్రత్తగా ఉండు. మీ అమ్మ స్వార్థం నన్నే కాదు నిన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వదని జ్యో అంటుంది. మా అమ్మ మంచితనం గురించి నీకు తెలియదు. నిన్ను అత్తను ఇంటికి తీసుకొచ్చేందుకు ఎంతలా ట్రై చేస్తుందో తెలియదని సూరజ్ అంటాడు. ఆ ఆలోచన నీకుందేమో. మీ అమ్మకు లేదు. ప్లీజ్ కాస్తా త్వరగా రియలైజ్ అవ్వు అని జ్యోత్స్న అంటుంది.
నీతో మాట్లాడి అనవసరం అని కాల్ కట్ చేస్తాడు సూరజ్. మరోవైపు జ్యోత్స్న పెళ్లి గురించి కార్తీక్‌తో మాట్లాడుతుంది పారిజాతం. ఆస్తి వచ్చేవరకు పెళ్లి చేసుకోనంటే అది జరగదురా. జ్యోత్స్న జీవితం నాశనం అయింది నీ వల్ల, దీప వల్ల. అది పాత జ్యోత్స్నల ఉంటేనే హాయిగా ఉండేది. ఇప్పుడు అన్నిటికి దూరమై బతుకుతుంది అని పారిజాతం కోప్పడుతుంది.
చీకటి యుద్ధం వద్దు
సరే అన్నింటికి కారణం మేమే అంటావు. దానికి ఒప్పుకుంటాను. దానికంటే ముందు నువ్వోటి ఒప్పుకోవాలి. ఇన్ని మాటలన్నాకా మనమధ్య చీకటి యుద్ధం ఎందుకు. ఓపెన్‌గానే మాట్లాడుకుందాం. జ్యోత్స్న జీవితంలో కష్టాలు మొదలైంది సూరజ్ రావడంతో కాదు. ఆ రాత్రి బిడ్డలను మార్చడంతో. నువ్వు చాలా తెలివిగా పిల్లలను మార్చాను అనుకున్నావ్. కానీ నువ్వు మార్చింది వాళ్ల తలరాతలను కూడా మార్చావ్ అని కార్తీక్ అంటాడు.
దాంతో పారిజాతం షాక్ అవుతుంది. ఎవరి స్థానంలో వాళ్లు ఉంటే పగ తీర్చుకునేందుకు సూరజ్ శివ నారాయణ ఇంట్లో అడుగుపెట్టేవాడా. మండపంలో ఉన్నావుగా. అక్కడ నిజమెందుకు చెప్పలేదు. బిడ్డలను మార్చింది మర్చిపోయావా అని కార్తీక్ రివర్స్ అవుతాడు. దాంతో కార్తీక్‌ను భయంతో ఆపుతుంది. అందరూ దూరంగానే ఉన్నారు. నిజం బయటపడతుందో అని భయంతో చచ్చిపోకు. బయటపడేదే అయితే ఎప్పుడో పడేది అని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్నకు అన్యాయం జరిగింది అంటే అది నీవల్లే. నువ్వే చేశావ్ అని కార్తీక్ అంటే.. నువ్వు చెప్పినదానికి నేను ఒప్పుకుంటాను. కానీ, జ్యోత్స్నకు అడ్డుపడతాను. నా మనవరాలి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోను. దాన్ని మళ్లీ పాత జ్యోత్స్నగా మారుస్తాను. మీరంతా నా ముందు పిల్లబాతు బచ్చాలురా. నేను ఆట ఇప్పుడు మొదలుపెడతాను. ఇప్పుడు చూడు నా ఆట అని పారిజాతం అంటుంది.
ఈ డీల్ నాకు చాలా ముఖ్యం
జ్యోత్స్న జోలికి వెళ్లకని కార్తీక్ అంటే.. పారు వినదు. ఛాలెంజ్ చేసి వెళ్తుంది. మరుసటి రోజు ఆఫీస్‌లో అగ్రిమెంట్స్ పేపర్స్ కరెక్టుగా ఉన్నాయి. 2 సెట్స్ జిరాక్స్ తీసి పెట్టమని జ్యోత్స్నకు సూరజ్ చెబుతాడు. ఈరోజు జరిగే మీటింగ్ నాకు చాలా ముఖ్యం. సిటీలో పెద్ద రెస్టారెంట్స్ ఉన్నా మనతో కలిసి బిజినెస్ చేసేందుకు పెద్ద సంస్థ ముందుకు వస్తోంది. ఈ డీల్ ఓకే అయితే భారీగా మన కంపెనీలో పెట్టుబడులు పెడతారని సూరజ్ చెబుతాడు.
ఆ సంస్థకు నేషనల్ మార్కెట్ ఉంది. మనతో వాళ్లు బిజినెస్ చేస్తే మనకు కూడా ఆ గుర్తింపు వస్తుంది. అంటే జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి పాన్ ఇండియా గుర్తింపు వస్తుంది. అక్కడ కూడా మనం ది బెస్ట్ అని నిరూపించుకుంటే నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది వేరే స్థాయి. ఆ స్థాయిని అందుకోవాలంటే ఈ డీల్ ఓకే అవ్వాలి. పేపర్స్, అగ్రిమెంట్స్ అన్ని క్లియర్‌గానే ఉన్నాయి. నా ఫోకస్ వాళ్లపై ఉంటుంది. నా పీఏగా ఈ బాధ్యతలు నువ్వే చూసుకోవాలని సూరజ్ చెబుతాడు.
వాళ్ల సంస్థ నుంచి బిజినెస్ హెడ్‌తోపాటు టీమ్ అంతా వస్తుంది. వాళ్లందరిని నువ్వే రిసీవ్ చేసుకోవాలి. వాళ్లకు కావాల్సింది చూసుకోవాలి. ప్రతీది అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడ సమస్య వచ్చిన డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఏ చిన్న తప్పు జరగకూడదు. ఆ తప్పు జరిగితే ఎవరిని క్షమించను అని వార్నింగ్ ఇస్తాడు. అమ్మా ఈ డీల్ నాకు చాలా పర్సనల్. మనం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నామని వాళ్లకు నమ్మకం కలగాలి. మీ వ్యక్తిగత కారణాల వల్ల ఎలాంటి తప్పు జరగకూడదు అని సూరజ్ చెబుతాడు.
ఇంత అందగత్తెవి
జ్యోత్స్న సరేనని ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఈ డీల్ అయ్యాక ఆఫీస్‌లో చాలా పెద్ద పార్టీ ప్లాన్ చేశాను. ఈరోజు కాదు. కానీ ముందే ఎందుకు చెబుతున్నానంటే మీ మీద నమ్మకంతో. ఈ డీల్ నాకు చాలా చాలా ముఖ్యం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండని వెళ్లిపోతాడు సూరజ్. ఇంతలో గెస్టులు వచ్చారని నాని చెబితే.. దీప, జ్యోత్స్న రిసీవ్ చేసుకుంటారు.
జ్యోత్స్నను పరిచయం చేస్తే బ్యూటిఫుల్ అనుకుంటాడు ఆ సంస్థ హెడ్. కాన్ఫరెన్స్‌లో వాళ్లను కూర్చొబెడుతుంది జ్యోత్స్న. కంపెనీ డీటెల్స్ను బయట ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. జ్యోత్స్న, హెడ్ బయటకు వెళ్తారు. తన పేరు జ్యోత్స్న అని తెలిసి కంపెనీ పేరు కూడా సేమ్ కావడం ఆశ్చర్యంగా ఉందంటాడు. రెస్టారెంట్ గురించి అడిగితే.. ఇంత అందగత్తెవి పీఏగా ఏం చేస్తున్నావ్. ఇంకా బెటర్ పొజిషన్లో ఉండొచ్చుగా అని అతనంటాడు.
మీ ఛైర్మన్ గారికి మంచి టేస్టే ఉందంటాడు. డీటేల్స్ చెప్పమంటారా అని అంటే నేను చూసుకుంటానులే అని జ్యోత్స్న చేయి పట్టుకుని తడుముతాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది జ్యోత్స్న. సూరజ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చేయి వదలమంటుంది. నేను సంతకం చేస్తేనే డీల్ ఓకే అవుతుంది. నువ్వు సరే అను నీ రేంజే మారిపోతుంది. ఎక్కడికో తీసుకెళ్తాను. నాకు వీక్నెస్ ఉంది. నాకు నచ్చిన పక్కనే పెట్టుకుంటాను అని అతనంటాడు.
నాతో పడుకో.. డీల్ ఓకే చేస్తా
సర్ ఇది ఇష్యూ అవుతుంది. ఇక్కడితో వదిలేయండని జ్యోత్స్న అంటుంది. ఛాన్స్ మీ ఛైర్మన్‌కే ఇస్తావా. మాకు ఛాన్స్ ఇవ్వవా. పోనీ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. నీలాంటి ఫిగర్‌కి ఎంతైనా ఇవ్వొచ్చు అని అతను అంటాడు. నాకూ వీక్నెస్ ఉంది సర్. కొన్ని కొందరి కోసం భరించడం. నా సహనం సముద్రమైతే దానికి సరిహద్దులు ఉంటాయి. హద్దు దాటిందో తుఫాను హెచ్చరికలు జారీ చేయాల్సిందే అని జ్యో అంటుంది.
నువ్వు ఇంకా బాగా నచ్చావు. నీ పొగరు నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. నువ్వు సరే (పడుకోడానికి అనే అర్థంలో) అను ఏం చూడకుండానే అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను అని అతనంటాడు. జ్యోత్స్న కోపంగా చూస్తుంది. ఏ నీ బాస్‌తోనే రొమాన్స్ చేస్తావా. మాతో చేయవా. నీలాంటి వాళ్లకి ఇలాంటివి అలవాటే లే. నన్ను వరదలా ముంచెత్తు. ఆనందంలో తడిపేయ్. ఏంటే అలా చూస్తున్నావ్ అని మళ్లీ జ్యోత్స్న చేయి పట్టుకుని వెకిలిగా ప్రవర్తిస్తాడు ఆ క్లయింట్.
మంచిగా మాట్లాడుతుంటే మునగ చెట్టు ఎక్కుతున్నావేంటీ. నేను చెప్పినదానికి సరే అనకపోతే డీల్ ఓకే అవ్వదు పాప. ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఒకే ఒక్క ఛాన్స్ అని పట్టుకుని నలిపేస్తాడు అతను. కోపం కట్టలు తెంచుకున్నా సరే చేయి వదిలేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


