Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్‌నే కొట్టిన జ్యోత్స్న- పోలీసుల ఎంక్వైరీలో మాలిని పేరు చెప్పిన జ్యో

Karthika Deepam 2 Serial October 23rd Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 23వ ఎపిసోడ్‌‌‌లో పీఏగా జాబ్ చేతకాదని తిట్టడంతో సూరజ్‌నే కొట్టి కాలర్ పట్టుకుని రివర్స్ అవుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న కిడ్నాప్‌పై పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. కిడ్నాప్ చేసింది మాలినే అని చెబుతుంది జ్యోత్స్న.

Published on: Oct 23, 2026, 07:07:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న ప్లాన్ చేసిన షెడ్యూల్‌పై సూరజ్ కోప్పడతాడు. పేపర్స్ అన్నింటిని జ్యోత్స్నపై విసిరేస్తాడు. రికమండేషన్‌తో వచ్చిన వాళ్లకు పని చేతకాదు. అది ఒప్పుకోవు. ఇలాంటిదానివి కాబట్టే నిన్ను రెజెక్ట్ చేశాను. పనిచేయడానికి యోగ్యత లేని నీలాంటిదాన్ని నిర్మోహాటంగా రెజెక్ట్ చేస్తాను అని సూరజ్ అరుస్తాడు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్

సూరజ్‌ని లాగిపెట్టి కొట్టిన జ్యోత్స్న

దాంతో అన్ని గుర్తు చేసుకున్న జ్యోత్స్న వెళ్లి కుర్చీని కాలుతో తంతుంది. సూరజ్‌ని లాగిపెట్టి కొడుతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. కాలర్ పట్టుకుని ఏంట్రా అన్నావ్. నన్ను రెజెక్ట్ చేస్తావా. రికమండేషన్‌తో వచ్చానా. ఎవర్రా వచ్చింది. మీ తాత దక్షిణామూర్తి నన్ను తీసుకొచ్చి మరీ ఇచ్చాడ్రా ఈ ఉద్యోగం అని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది జ్యోత్స్న.

ఆరోజే నేను అడిగాను. నేను రికమండేషన్‌తో వచ్చానంటారు తాత.. ఏం చేయమంటారని. అప్పుడు తాత ఏం చెప్పాడో గుర్తులేదా అని దక్షిణామూర్తి జ్యోత్స్నను అంటే తనను అన్నట్లే అని, అగౌరవపరిచినట్లే అని చెప్పింది గుర్తు చేస్తుంది జ్యోత్స్న. నీ చెవిలో దూది పెట్టుకున్నావా అని జ్యో అంటుంది. జ్యోత్స్న అని సూరజ్ అంటే.. విను.. నేను చెప్పేది విను అని రివర్స్‌లో జ్యోత్స్నే బెదిరిస్తుంది.

ఒకప్పుడు ఇదే కంపెనీలో నేను సీఈఓ అయ్యాను. షార్ట్‌కట్‌లో ఛైర్మన్ అయ్యావని ఫోజ్ కొడుతున్నావా.. తగ్గించు.. రేయ్ దక్షిణామూర్తి మనవడా.. నేను యాటిట్యూడ్‌కి అంబాసిడర్ లాంటిదాన్ని నా మీదే యాటిట్యూడ్ చూపిస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు పేపర్స్ విసిరేస్తే నేను ఫైల్స్ విసిరేస్తా. డిగ్నిటీ ఆఫ్ లేబర్. శ్రమకు గౌరవం ఇవ్వాలి. అసలు మనిషి అనేవాడికి గౌరవం ఇవ్వాలి. అది తెలియని నీలాంటివాడి దగ్గర పనిచేయడం నా దౌర్భాగ్యం అని జ్యోత్స్న ఇచ్చిపడేస్తుంది.

నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నా

అసలు నీకు నేను పీఏగా పనికిరావడం కాదురా నువ్వే నాకు బాస్‌గా పనికిరావు. నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను పోరా.. అని జ్యోత్స్న కోపంగా అంటుంది. కానీ, అదంతా జ్యోత్స్న కలకంటుంది. సూరజ్ పిలిచి అడిగినదానికి సమాధానం చెప్పవేంటని అంటాడు. ప్లానింగ్ బాగానే ఉందని జ్యో అంటుంది. అంటే నాకు చూడటం చేతకాలేదా. నీలాంటిదానికి పీఏ జాబ్ పనికిరాదు. రికమండేషన్ కాబట్టి భరించకతప్పదు. పనిచేతకాకుంటే వెళ్లిపో అని సూరజ్ తిడతాడు.

జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇంత ఈజీగా పోతావనుకోలేదే సుమిత్ర కూతురా అని మాలిని మనసులో అనుకుంటుంది. కింద పడేసిన పేపర్స్ అన్ని తీసుకుంటుంది జ్యోత్స్న. సారీ సర్ మీకు నచ్చినవిధంగా షెడ్యూల్ ప్లాన్ చేయలేకపోయాను. మళ్లీ చేసి తీసుకొస్తాను. మీ టైమ్ వేస్ట్ చేసినందుకు క్షమించండి అని వెళ్లి వర్క్ చేసుకుంటుంది జ్యోత్స్న.

అంత ఈజీగా ఎలా పోతావే. ఎన్నాళ్లు భరిస్తావో చూస్తానే అని నవ్వుతుంది. అది జ్యోత్స్న చూస్తుంది. జ్యోత్స్న కాఫీ తాగుతూ సూరజ్ అన్న మాటలు తలుచుకుంటుంది. మరోవైపు క్యాబిన్‌లో సూరజ్ కూడా గుర్తుచేసుకుంటాడు. కార్తీక్, దీప వచ్చి జ్యోత్స్నతో మాట్లాడుతారు. వెళ్లిపోతావనుకున్నా అని కార్తీక్ అంటే.. అదే అనుకున్నా అని జ్యో అంటుంది.

ఓడిపోయానని అర్థమైంది

మళ్లెందుకు వచ్చావని కార్తీక్ అడుగుతాడు. నాకు అర్థమైంది. నేను ఓడిపోయాను. గొప్పింటి బిడ్డగా రావడం గెలుపు అనుకున్నాను. కన్నతల్లికి దూరంగా ఉండటం ఓటమని లేటుగా అర్థమైంది. అమ్మనాన్నలను ప్రేమించడం గెలుపు అనుకున్నా. వాళ్లకోసం ఏం చేయలేకపోవడం ఓటమని అర్థమైంది. ఇష్టమైనవాడు కాదనుకుని వెళ్లిపోవడం ఓటమని లేటుగా అర్థమైంది. ఇక్కడ చేరడం మాలిని అత్తపై గెలవడం అనుకున్నా. సూరజ్ ముందు ఓడిపోయానని లేటుగా అర్థమైంది. నేను లూజర్‌ని అని లేటుగా అర్థమైందని జ్యోత్స్న అంటుంది.

నువ్వు ఓడిపోలేదు. నేర్చుకుంటున్నావ్. ముందుకు వెళ్లాలని కొత్తపాఠం నేర్చుకుంటున్నావ్ అని కార్తీక్ అంటాడు. సూరజ్ అన్ని మాటలు అంటున్న సహనంగా ఉన్నావంటే హ్యాట్సాఫ్ జ్యోత్స్న అని దీప అంటుంది. ఒక్క మెట్టు ఎక్కావ్ జ్యోత్స్న. నిన్ను నువ్వు కంట్రోల్‌లోకి తెచ్చుకుంటున్నావ్ అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న తనను ఆపింది దశరథ పెట్టుకున్న నమ్మకమని చెబుతుంది.

ఇది ఇక్కడితే ఆగిపోదు. ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. సూరజ్‌కి నువ్వు జాబ్ చేయడం నచ్చలేదు. అదెందుకో తెలియట్లేదు. నువ్వు కనిపిస్తే అతని తప్పులు కనిపిస్తాయి. వెళ్లి మాట్లాడాలని చూస్తే కోపం వస్తుంది. అతనే వచ్చి మాట్లాడితే ప్రవర్తన వేరుగా ఉంటుంది. కాబట్టి సూరజ్‌తో జాగ్రత్తగా ఉండు. నిన్ను పంపించడానికి 100 ప్రయత్నాలు చేస్తాడు. మాలినితో జాగ్రత్తగా ఉండు. లైట్ లేని చీకటి గదిలో మనతో పాము ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని కార్తీక్ అంటాడు.

అత్తకు చుక్కలు చూపించాలి

మనకి టైమ్ దొరుకుతుంది. దొరికినప్పుడు అత్తకు మనం చుక్కలు చూపించాలని దీప అంటుంది. మాలినితో సూరజ్ మాట్లాడుతుంటే.. షెడ్యూల్ ప్లాన్ ఇస్తుంది. ప్లాన్ ఓకే నేను పిలిచినప్పుడు కదా రావాల్సింది అని సూరజ్ అంటాడు. అప్పుడే పోలీసులు వస్తారు. ఎంక్వైరీ కోసం వచ్చానని కార్తీక్, దీపను పిలుస్తారు. జ్యోత్స్నను కూర్చోమని మీకోసమే వచ్చానంటాడు.

జ్యోత్స్నను కొన్ని ప్రశ్నలు అడగాలని ఎస్సై అడుగుతాడు. ఆధారాలు సాక్ష్యాలు లేనికారణంగా కేసు అలాగే ఉంది. ఇప్పుడు కేసు కొట్టేయాలంటే జ్యోత్స్న చెప్పినదాన్నిబట్టే ఉంటుందని ఎస్సై అంటాడు. మీరు కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు. ఎవరైనా మిమ్మల్ని బంధించారా. బలవంతంగా ఎవరైనా ఎత్తుకెళ్లారా అని ఎస్సై అంటాడు.

అలా అయితే క్షేమంగా ఎందుకొస్తుందని మాలిని అంటుంది. అడిగింది మిమ్మల్ని కాదుగా మేడమ్ అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న గారు మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకెళ్లారా అని ఎస్సై అడుగుతాడు. ఎత్తుకెళ్లారు. బ్లాక్ మెయిల్ చేశారు. ఓ చోట బంధించారు అని జ్యోత్స్న చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఎవరు అని ఎస్సై అడిగితే.. మాలిని, మాలిని బాడిగార్డ్ విజయ్ వైపు చూస్తుంది.

పోలీసుల ముందు ఇరుక్కున్న మాలిని

తెలియదని జ్యోత్స్న చెబుతుంది. దాంతో మాలిని, విజయ్ ఊపిరిపీల్చుకుంటారు. కళ్లకు గంతలు కట్టారు. వాళ్లే వదిలేశారు అని జ్యో చెబుతుంది. మీకు ఎవరిపైనా అయినా అనుమానం ఉందా అని ఎస్సై అంటాడు. ఉంది అని జ్యో అంటుంది. ఎవరు వాళ్లు అని ఎస్సై అడుగుతాడు.

మీకు అనుమానం ఉన్న మనిషి ఎక్కడున్నారని ఎస్సై అడిగితే.. ఇక్కడే ఉన్నారని వేలితో చూపిస్తుంది జ్యోత్స్న. అది మాలినివైపే వేలు చూపించినట్లుగా ఉంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More