Rayavalasa Ringudu Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న రాయవలసలోని రింగుడు రింగుడు సాంగ్.. పాటను రాసి పాడిన హీరో కార్తీక్ జయంతి

Rayavalasa Ringudu Ringudu Song Trending On YouTube: ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయవలస’ చిత్రం నుంచి విడుదలైన ‘రింగుడు రింగుడు’ పాట యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతోంది. కార్తీక్ జయంతి, శ్రీషా నులు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ పాటను హీరో కార్తీక్ జయంతి రాసి పాడటం విశేషం.

Published on: Oct 15, 2026, 10:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rayavalasa Ringudu Ringudu Song Trending On YouTube: తెలుగు చిత్రసీమలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే వాస్తవిక కథలకు ఈమధ్య ఆదరణ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై ప్రతిభావంతులు తెరకెక్కించిన చిత్రం ‘రాయవలస’.

యూట్యూబ్‌ను ఊపేస్తున్న రాయవలసలోని రింగుడు రింగుడు సాంగ్.. పాటను రాసి పాడిన హీరో కార్తీక్ జయంతి
యూట్యూబ్‌ను ఊపేస్తున్న రాయవలసలోని రింగుడు రింగుడు సాంగ్.. పాటను రాసి పాడిన హీరో కార్తీక్ జయంతి

యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా సాంగ్

రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మాణంలో, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి రాయవలస సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, రాయవలస సినిమా.. ప్రమోషన్ల విషయంలో రచ్చ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకుంటున్న 'రింగుడు రింగుడు' జానపద బాణీ

అర్జున్ బాల అందించిన స్వరాలు, జానపద శైలిలో సాగే సాహిత్యం 'రింగుడు రింగుడు' పాటకు ప్రాణం పోశాయి. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ రాసిన ఈ పాటను ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.

అమెరికా నుంచి టాలీవుడ్‌కు.. కొత్త ప్రతిభకు పెద్దపీట

ఈ పాటను రాసి పాడిన వాళ్లలో హీరో కార్తీక్ జయంతి కూడా ఒకరు. రింగుడు రింగుడు పాట విడుదలైన కొద్ది సమయానికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ రాయలవస చిత్రం ద్వారా కార్తీక్ జయంతి హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. డైరెక్టర్ రాధిక జయంతి కుమారుడే హీరో కార్తీక్ జయంతి.

రేసన్ రికార్డ్స్ పేరుతో మ్యూజిక్ ఛానెల్

అమెరికా నుంచి వచ్చి టాలీవుడ్‌లో సొంతంగా నిలదొక్కుకోవడంతో పాటు సంగీతాన్ని, నూతన కళాకారులను ప్రోత్సహించేందుకు 'రేసన్ రికార్డ్స్' పేరుతో సొంత మ్యూజిక్ ఛానల్‌ను కూడా ప్రారంభించారు వీరు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభమైంది.

రాణి పాత్రలో హీరోయిన్ శ్రీషా

గ్రామీణ జీవితం, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన రాయవలస చిత్రాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల అంకితభావంతో ఒకే ఒక్క షెడ్యూల్‌లో పూర్తి చేయడం విశేషం. అలాగే, రాయవలస సినిమాలో హీరోయిన్ శ్రీషా నులు 'రాణి' అనే కీలక పాత్ర పోషించారు.

సహజసిద్ధమైన నటనతో

"తెరపై ఈ పాత్ర ఇచ్చే అనుభూతి ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది" రాణి పాత్ర గురించి గొప్పగా తెలిపింది రాయవలస సినిమా యూనిట్. శ్రీషా తన సహజ సిద్ధమైన నటనతో రాణి పాత్రకు జీవం పోశారని చెప్పుకొచ్చారు.

ఇతర నటీనటులు

అలాగే, సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు వంటి దిగ్గజాలు ఇందులో కీలక పాత్రల్లో మెరవనున్నారు. వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరా పనితనం, గ్యారీ బి.హెచ్. ఎడిటింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

త్వరలోనే థియేటర్లలో విడుదల

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రాయవలస సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే రాయవలస సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More