Rayavalasa Karthik: కొడుకు హీరో, తల్లి దర్శకురాలు- త్రిశూలంతో కార్తీక్ జయంతి పవర్‌ఫుల్ లుక్- రాయవలస రిలీజ్ డేట్ ఖరారు!

Karthik Jayanthi Rayavalasa Release Date Poster: కొత్త కుర్రాడు కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాయవలస' రిలీజ్ డేట్ ఖరారైంది. హీరో తల్లి రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన రాయవలస రిలీజ్ డేట్ చెబుతూ విడుదల చేసిన పోస్టర్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.

Published on: Sep 26, 2026, 18:19:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthik Jayanthi Rayavalasa Release Date Poster: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వస్తున్న యువ నటుల చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో ఊరమాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సినిమా 'రాయవలస'.

కొడుకు హీరో, తల్లి దర్శకురాలు- త్రిశూలంతో కార్తీక్ జయంతి పవర్‌ఫుల్ లుక్- రాయవలస రిలీజ్ డేట్ ఖరారు!
కొడుకు హీరో, తల్లి దర్శకురాలు- త్రిశూలంతో కార్తీక్ జయంతి పవర్‌ఫుల్ లుక్- రాయవలస రిలీజ్ డేట్ ఖరారు!

నవంబర్ 20న థియేటర్లలోకి!

కార్తిక్ జయంతిని హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించిన ఈ రాయవలస సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన రాయవలస టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

అమ్మవారి ముందు త్రిశూలంతో పవర్‌ఫుల్ అవతార్

విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో వదిలిన రాయవలస ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అమ్మవారి విగ్రహం ముందు నిలబడి చేతిలో త్రిశూలం పట్టుకున్న కార్తిక్ జయంతి లుక్ రౌద్ర రసాన్ని పండిస్తూ సినీ ప్రియులను కట్టిపడేస్తోంది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా

తొలి సినిమానే అయినప్పటికీ కార్తిక్ జయంతి చూపించిన హావభావాలు, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

హీరో తల్లి రాధిక డైరెక్షన్

హీరో కార్తీక్ తల్లి రాధిక జయంతి రాయవలస చిత్రానికి దర్శకత్వం వహించగా, రాఖీ ఎ అందించిన కథ, సంభాషణలు మాస్ ప్రేక్షకులను నేరుగా రీచ్ అయ్యేలా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీష నూలు హీరోయిన్‌గా నటిస్తోంది.

సీనియర్ నటుల బలగం.. అలరించే సంగీతం

అలాగే, రాయవలస సినిమాలో భారీ తారగణం నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఇతర కీలక పాత్రలలో మెరవనున్నారు.

రాయవలస సినిమా పాటలు పాడిన సింగర్స్

అర్జున్ బాలా అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం రాయవలస చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్ణ చారి, తరుణ్ సైదులతో కలిసి హీరో కార్తిక్ జయంతి స్వయంగా పాటలు రాయడం విశేషం. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి లాంటి ప్రముఖ గాయనీగాయకులు ఈ పాటలను ఆలపించారు.

మూవీ యూనిట్ ధీమా

"భావోద్వేగం, పవర్‌ఫుల్ యాక్షన్, అద్భుతమైన సంగీతం కలగలిపిన పరిపూర్ణమైన ఎంటర్‌టైనర్‌గా రాయవలస అలరిస్తుంది" అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

కెమెరా పనితనం, ఎడిటింగ్ వర్క్స్

వీఆర్కే నాయుడు కెమెరా పనితనం, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్, మల్లేశ్ షాలియోన్ ఫైట్స్ రాయవలస సినిమా స్థాయిని మరింత పెంచనున్నాయి. కాగా, నవంబర్ 20న ఈ రాయవలస చిత్రం థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More