యూట్యూబ్ పిచ్చి.. బంగారం కోసం పాత గోల్డ్మైన్లోకి దిగిన యువకుడు.. చివరకు
యూట్యూబ్ వీడియో చూసి ఒక యువకుడు గోల్డ్ మైన్‌లోకి దిగాడు. కానీ లోపలకు వెళ్తున్న కొద్దీ చీకటి ఎక్కువై ఏం కనిపించలేదు. అంతేకాదు ఊపిరి కూడా సరిగా ఆడలేదు.
యూట్యూబ్ వీడియోలలో కనిపించే ప్రతిదీ నిజం కాదని, సామాజిక మాధ్యమాలలో చూసే కల్పిత దృశ్యాలను చూసి సాహసాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించే మరో సంఘటన సత్యసాయి జిల్లా రామగిరిలో చోటుచేసుకుంది. యూట్యూబ్ వీడియో చూసి ఆకర్షితుడైన ఒక యువకుడు, బంగారాన్ని అన్వేషించే క్రమంలో పాడుబడిన గనిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ప్రభాకర్ రెడ్డి, పల్లిపాలేనికి చెందిన అతని మిత్రుడు కిష్టయ్యలు ఇటీవల యూట్యూబ్‌లో రామగిరి బంగారు గనులకు సంబంధించిన ఒక వీడియో చూశారు. గనుల్లో ఇప్పటికీ బంగారం లభిస్తుందనే భ్రమతో, ఎలాగైనా సరే ఆ నిధిని సాధించాలనే పిచ్చి ఆలోచనతో ఇద్దరూ రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో రామగిరిలోని పాడుబడిన పాత బంగారు గని వద్దకు చేరుకున్నారు.
పక్కా ప్రణాళికతో వచ్చామనుకున్న ప్రభాకర్ రెడ్డి, ఒక తాడు సహాయంతో గని లోపలికి దిగాడు. ఒకవేళ లోపల నీరు ఉంటే ఈదేందుకు వీలుగా ఒక ట్యూబ్‌ను, వెలుతురు కోసం టార్చ్ లైట్‌ను కూడా తనతో తీసుకెళ్లాడు. అయితే గని లోపలికి వెళ్లేకొద్దీ చీకటి కమ్మేసింది. అంతేకాకుండా గాలి ఆడక తీవ్రమైన ఇబ్బంది మొదలైంది. ఊపిరి అందక, తిరిగి పైకి రాలేక ప్రభాకర్ రెడ్డి లోపలే చిక్కుకుపోయాడు.
బయట కాపలాగా ఉన్న మిత్రుడు కిష్టయ్య, లోపల ఉన్న ప్రభాకర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రామగిరి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే స్పందించి, ధర్మవరం నుంచి ఫైర్, రెస్క్యూ టీమ్‌ను రప్పించారు. సహాయక బృందాలు అత్యంత సమర్థవంతంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్రమించి ప్రభాకర్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీశాయి.
సురక్షితంగా బయటపడిన అనంతరం ప్రభాకర్ రెడ్డి తన అనుభవాన్ని పంచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. 'అది నాకు నిజంగా పునర్జన్మే.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాను. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలను చూసి ఎవరూ ఇలాంటి ప్రాణాంతకమైన సాహసాలు చేయవద్దు.' అని వేడుకున్నాడు.
సామాజిక మాధ్యమాల్లో వ్యూస్, లైక్స్ కోసం కొందరు చేసే కల్పిత వీడియోలను నమ్మి యువత తమ విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాడుబడిన గనులు, గుహలు, నిర్జన ప్రాంతాలలోకి వెళ్లడం చట్టరీత్యా నేరమే కాక, ప్రాణాలకే ముప్పు అని స్పష్టం చేశారు.
ఈ ఘటన అనంతరం ప్రభాకర్ తన అనుభవాన్ని చెప్పుకున్నాడు. మృత్యువు ముఖం చూసి.. బయటకు వచ్చినట్టుగా అనిపించదని భయంతో చెప్పాడు. యూట్యూబ్ వీడియోలు చూసి అలాంటి ప్రమాదకరమైన రిస్కులు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


