Mrunal Thakur Raaka: 9 నెలలుగా ఒక్క సినిమా లేదు, 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తించుకోవాలి: అల్లు అర్జున్ రాకాపై మృణాల్ ఠాకూర్
Mrunal Thakur About Allu Arjun Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రాకా'లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. గత తొమ్మిది నెలలుగా ఏ ఒక్క సినిమాకు సైన్ చేయలేదని మృణాల్ ఠాకూర్ చెప్పింది.
Mrunal Thakur About Allu Arjun Raaka Movie: 'సీతారామం', 'హాయ్ నాన్న' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ప్రాజెక్టుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

రాకాలో మృణాల్ ఠాకూర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా'లో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోందంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ హీరోయిన్‌గా చేస్తుండగా.. మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోందనే వార్త సినిమాపై అంచనాలను పెంచేసింది.
9 నెలలుగా నో సినిమాలు.. మృణాల్ ఓపెన్ టాక్!
'రాకా' చిత్రంలో నటిస్తున్నారా అనే ప్రచారంపై మృణాల్ ఠాకూర్ ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ వార్తలను నేరుగా ఖండించని మృణాల్ ఠాకూర్ తన తాజా నిర్ణయాలు, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
"గత తొమ్మిది నెలలుగా నేను ఏ కొత్త ప్రాజెక్టుకూ సంతకం చేయలేదు. కేవలం కథలో బలం ఉండి, నటనకు ప్రాధాన్యం లభించే పాత్రల కోసమే వేచి చూస్తున్నాను. నా కొత్త సినిమాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనైనా నా సొంత సోషల్ మీడియా ఖాతాల ద్వారానే బయటకు వస్తుంది. అప్పుడే దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడతాను" అని మృణాల్ ఠాకూర్ పేర్కొంది.
120 రోజులు సెట్స్‌పై కేటాయించాలి
తనకు అవకాశాలు రాక ఖాళీగా ఉండటం లేదని, కేవలం మంచి కథల ఎంపిక కోసమే విరామం తీసుకున్నానని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది. ఒక సినిమా కోసం దాదాపు 120 రోజులు సెట్స్‌పై కేటాయించాల్సి ఉంటుందని, అందుకే తనకు క్రియేటివ్‌గా సంతృప్తినిచ్చే కథలనే ఎంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇరవై, ముప్పై ఏళ్ల తర్వాత కూడా జనాలు గుర్తుంచుకునేలాంటి నటనను అందించడమే తన లక్ష్యమని మృణాల్ తెలిపింది.
గిన్నిస్ రికార్డ్ సాధించిన 'రాకా'.. 'అవతార్'ను మించిన విజువల్స్!
'పుష్ప 2: ది రూల్' భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాకాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏకంగా 37 మంది కళాకారులతో ఒకేసారి రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది.
రాకా సినిమా ఆలస్యం కావడంపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. "సినిమా నిర్మాణానికి కొంచెం సమయం పడుతోందని తెలుసు. అభిమానులు, సినీ ప్రేమికులు కాస్త ఓపిక పట్టాలని కోరుతున్నాను. మీ ముందుకు అత్యుత్తమ చిత్రాన్ని తీసుకురావడానికే శ్రమిస్తున్నాం. మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను" అని వివరించారు.
అవతార్ లో కూడా చూసి ఉండరు
మరోవైపు దర్శకుడు సిబి చక్రవర్తి ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. "అట్లీ నాకు 'రాకా' విజువల్స్ చూపించారు. నిజం చెప్పాలంటే హాలీవుడ్ సెన్సేషన్ 'అవతార్' చిత్రంలో కూడా ఇలాంటి దృశ్యాలు ఉండవనిపించింది. విజువల్స్ అత్యంత అద్భుతంగా వచ్చాయి" అని ఆయన ప్రశంసించారు.
ఓటీటీలో అలరిస్తున్న 'పూజా మేరీ జాన్'
మరోవైపు మృణాల్ ఠాకూర్ ఇటీవల నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'పూజా మేరీ జాన్' ప్రస్తుతం జీ5 (ZEE5) ప్లాట్‌ఫారమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నవజోత్ గులాటీ, విపాషా అరవింద్ సంయుక్తంగా తెరకెక్కించిన ఓటీటీ చిత్రంలో హుమా ఖురేషి, విజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక వ్యక్తి మరణం చుట్టూ తిరిగే నేర పరిశోధన, లాయర్ పాత్ర చుట్టూ సాగే ఈ డ్రామా డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


