Mrunal Thakur Katrina Kriti: జనాలకు పిచ్చి పట్టినట్టుంది- కత్రీనా కైఫ్, కృతి సనన్ ట్రోలింగ్‌పై మృణాల్ ఠాకూర్ కామెంట్స్
Mrunal Thakur About Katrina Kaif Kriti Sanon Trolling: కత్రీనా కైఫ్, కృతి సనన్‌లపై జరుగుతున్న బాడీ షేమింగ్, బికినీ వివాదం, ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలను, దుస్తులను జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదని, వారు అందించిన సేవలను విస్మరించకూడదన్నారు.
Mrunal Thakur About Katrina Kaif Kriti Sanon Trolling: చిత్రపరిశ్రమలో హీరోయిన్ల దుస్తులు, శారీరక రూపురేఖలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం, నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగడం ఈమధ్య కాలంలో బాగా ఎక్కువైంది. ఇటీవల నటీమణులు కత్రినా కైఫ్, కృతి సనన్‌లు ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ఆన్‌లైన్ దాడిపై బాలీవుడ్ భామ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

"వాళ్లు ఏం చేయాలో చెప్పడానికి మీరెవరు?"
ఇతరుల వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని, సినిమా రంగానికి వారు అందించిన సేవలను, సాధించిన విజయాలను మర్చిపోకూడదని హితవు పలికారు మృణాల్ ఠాకూర్. తన కొత్త ఓటీటీ సినిమా పూజా మేరీ జాన్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఈ అంశంపై స్పందించారు.
"అది వారి జీవితం, వారి ఇష్టం. ప్రతీ ఒక్కరికీ తమ జీవితంలో వచ్చే ప్రతి దశను ఆస్వాదించే హక్కు ఉంటుంది. వీరిని విమర్శించే హక్కు మనకు ఎక్కడిది? అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంతో పాటు బ్రిటన్ వంటి విదేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తూ, సినీ రంగానికి ఎంతో దోహదపడిన ఈ ఐకానిక్ మహిళల కష్టాన్ని మనం మరచిపోతున్నామా? ప్రతీ చిన్న విషయానికి ఇతరులపై కామెంట్లు చేయడం మానుకోవాలి. జనాలకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది" అని మృణాల్ ఠాకూర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కత్రీనా, కృతిలపై ట్రోలింగ్ ఎందుకు జరిగింది?
కేవలం మహిళలనే కాకుండా ఈ రోజుల్లో పురుషులను కూడా ఇలాగే జడ్జ్ చేస్తున్నారని మృణాళ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. కాగా, అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో కత్రీనా కైఫ్ పాల్గొన్న సమయంలో ఆమె బరువు పెరగడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో బాడీ షేమింగ్ జరిగింది.
కుమారుడు విహాన్‌కు జన్మనిచ్చిన తర్వాత కత్రీనా కైఫ్ శరీరంలో వచ్చిన సహజమైన మార్పులపై కొందరు నెటిజన్లు విచక్షణారహితంగా కామెంట్లు చేశారు. దీనిపై లండన్‌లో జరిగిన తన బ్రాండ్ ఈవెంట్‌లో స్పందించిన కత్రీనా.. సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు విమర్శలు తనను మానసికంగా కృంగదీయలేవని స్పష్టం చేశారు.
బికినీ వేసుకోవడమేంటీ?
మరోవైపు, రక్షాబంధన్ సందర్భంగా ఒక జ్యూవెలరీ బ్రాండ్ ప్రకటనలో కృతి సనన్ వేసుకున్న దుస్తులపై వివాదం చెలరేగింది. ఆ దుస్తులు బికినీలా ఉన్నాయని నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రకటనను సదరు సంస్థ తొలగించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని కృతి సనన్ కూడా సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
పూజా మేరీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇదిలా ఉంటే, మృణాల్ ఠాకూర్ నటించిన పూజా మేరీ జాన్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 2న 'జీ5' (ZEE5)లో పూజా మేరీ జాన్ ఓటీటీ రిలీజ్ అయింది. నవజ్యోత్ గులాటీ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని దినేష్ విజన్ మేడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.
ఇందులో మరో హీరోయిన్ హుమా ఖురేషీ కీలక పాత్రలో నటించారు. తన స్నేహితుడు అనికేత్ చేసిన లవ్ ప్రపోజల్‌ని నిరాకరించినందుకు, అతను ఆత్మహత్య చేసుకుంటూ పూజానే తన మరణానికి కారణమని ఈమెయిల్ పంపడం చుట్టూ ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఒకవైపు వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూనే, పరిశ్రమలోని తోటి నటీమణులకు మద్దతుగా నిలిచిన మృణాల్ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


