Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినితో జ్యోత్స్న ఛాలెంజ్-తల్లి ముందే చేయి పట్టుకుని తీసుకెళ్లిన సూరజ్
Karthika Deepam 2 Serial October 17th Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 17వ ఎపిసోడ్లో మాయం చేసి రోడ్డు మీద కళ్లకు గంతలు కట్టి వదిలేశారని మాలినితో జ్యోత్స్న చెబుతుంది. నీ కొడుకును దూరం చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. జ్యోత్స్నని ఇంటికి తీసుకెళ్లిన సూరజ్‌కి కార్తీక్‌కు మాటల యుద్ధం సాగుతుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో మాలిని దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న ఒంటిమీద ఒక్క గీత పెట్టకుండా ఇంత సేఫ్‌గా ఎలా పంపించావ్ అత్తా అని అడుగుతుంది. దానికి మాలిని షాక్ అవుతుంది. నేనంటే నీకు అంత ప్రేమ అని జ్యో అంటుంది.

నడిరోడ్డులో కళ్లకు గంతలు కట్టి వదిలేశారు
ఏం మాట్లాడుతున్నావని మాలిని అంటుంది. ఎవరో వచ్చి నన్ను తీసుకుపోయారు. ఎక్కడో దాచారు. రాత్రి తీసుకొచ్చి నడిరోడ్డులో కళ్లకు గంతలు కట్టి వదిలేశారు. కంటికి కనిపించకపోయినా జరిగిందంతా చేయించింది నువ్వే అని నాకు తెలియదనుకున్నావా. భయపడ్డావా.. నీ కొడుక్కి. నేను కనిపించకపోతే నీ కొడుకు మర్చిపోతాడనుకున్నావ్. కానీ నాకోసం ఇంతలా తిరుగుతున్నాడనుకోలేదు. దొరికిపోయావ్ అత్త అని జ్యో అంటుంది.
నన్ను లేకుండా చేయాల్సిన అవసరం నీకు తప్పా ఎవరు లేదు. ఇక్కడ నీ కొడుకు నిన్ను అనుమానించడం భరించలేకపోయావ్. వెతకడం తట్టుకోలేకపోయావ్. నాకు ఏదైనా దానికి కారణం నువ్వే అని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. నీ భర్త పక్కన నీ ఫొటో నీ కొడుకే పెడతాడు అత్త అని జ్యోత్స్న అంటుంది. నింద వేయడం నీ రక్తంలోనే ఉంది. ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నావని మాలిని అడుగుతుంది.
కొన్నింటికి ఆధారాలు ఉండవు. నువ్వు నన్ను భయంతోనే వదిలేశావ్. ఒకవేళ నన్ను ఏమైనా చేస్తే.. నీ ఫొటోకు దండేసేది ఎవరో కాదు నీ కొడుకే అని జ్యోత్స్న అంటుంది. వాడు చేయి ఎత్తితే నేను ఆపాను. నేను చేయి ఎత్తితే ఎవరు ఆపలేరు అని మాలిని అంటుంది. నీ కొడుకు చేయి ఎత్తింది ప్రేమతో. నా ఇంటి ముందు కాపలా ఎందుకు. నైట్ అంతా కారులో పడుకున్నాడట. అందుకే భయపడి వదిలేశావ్ అని జ్యోత్స్న అంటుంది.
నీ చేతులకు బురద అంటిస్తాను
వెళ్లి చెప్పే.. ఏం చేస్తాడో చూడు అని మాలిని అంటుంది. నీ చేతికి మట్టి అట్టకుండా చేస్తావ్ అత్త. నేను వెళ్లి చెబితే నీ కొడుకు నా తల్లి చేతులకు మట్టిలేదు కదా అంటాడు. నేను ఏం చేస్తానో తెలుసా. నీ చేతులకు బురద అంటిస్తాను. నువ్వు చేసింది నీ కొడుకుకు నీ చేతులో చెబుతాయి. నేను మొండిదాన్ని. నన్నేం చేయలేవు. నేనేం నీ కొడుకు చెప్పను. అర్థమయ్యేలా చేస్తాను అని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది.
బరిలో నీతో పోటీకి దిగేశాను. ఎదురుగా వస్తా ఢీ కొట్టి చూడు. నాకు నువ్వంటే భయంలేదని చెప్పడానికి వచ్చాను. నీ కొడుకును నీకు దూరం చేస్తానని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నేను సూరజ్ ప్రేమించిన అమ్మాయిని. పనివాళ్ల మీద చేయి ఎత్తకూడదా నేను పనిదాన్ని కాదు అత్త నీ పని పట్టేదాన్ని అత్త. వాడి నీడను కూడా నీకు దూరం చేస్తాను అని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది.
ఇంతలో సూరజ్ రావడంతో మాలిని ఆగుతుంది. మీ ఇంటికి వెళ్దాం పదా అని సూరజ్ అంటే.. జ్యోత్స్న రానని అంటుంది. మాలిని ముందే జ్యోత్స్న చేయి పట్టుకుని తీసుకెళ్తాడు సూరజ్. అది చూసిన మాలిని ఏం చేయలేక ఆలోచిస్తుంది. మాలినిని చూస్తూ జ్యోత్స్న వెళ్తుంది. కార్తీక్ ఇంటికి జ్యోత్స్నను లాక్కుని వస్తాడు సూరజ్. అంతా బయటకు వస్తారు.
మీ మీద గౌరవం పోగొట్టుకున్నారు
సుమిత్ర వాళ్లంతా సంతోషిస్తారు. గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయింది ఈ అమ్మాయి. ఈమెకోసం మా మీద నిందలు వేసింది, పోలీసులను తీసుకొచ్చింది. మా అమ్మను అనుమానంగా చూసేలా చేసింది. జ్యోత్స్న కనిపించకుండా పోడానికి నేను కారణం కాదని సూరజ్ అంటాడు. మీరు కారణం కాదని అనుకోడానికి వీళ్లేదని కార్తీక్ అంటే. మిస్టర్ కార్తీక్ అంటాడు సూరజ్.
దీప వారిస్తుంది. మీ మీద గౌరవం ఉండేది. మీరే పోగొట్టుకున్నారని సూరజ్ అంటాడు. నీ గౌరవం కోసం ఎవరు చూడట్లేదని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకి ఏం కాకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చేది. ఆఫీస్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి వీడియో కాల్ చేయించేవాడివి కాదని కార్తీక్ అంటాడు. ఏం జరిగిందో చెప్పమని జ్యోతో సూరజ్ అంటాడు. దేనికి రియాక్ట్ అవ్వాలో నువ్వు చెప్పకని జ్యో అంటుంది.
నేను కనిపించకుండా ఉంటే నాకోసం ఎందుకు ఇక్కడ ఉన్నారని జ్యో అంటే.. నీకు ఉద్యోగం ఇచ్చింది నేనే కదా అని బాధ్యత అని దక్షిణామూర్తి అంటాడు. మా మీద దక్షిణామూర్తి తాత కుటుంబం వేసేవన్ని నిందలే అని జ్యో అంది. కడుపులో ఉన్నావ్ జరిగింది చూడలేదు కదా అంది. అందుకే దేవతలాంటి మా అమ్మను అనుమానించాను. నిందలు వేసేవాళ్లు ఎవరో ఇప్పుడు అర్థమైంది. మీరే అని సూరజ్ కోపంగా అరుస్తాడు.
మీరే దాచిపెట్టారు
మీరు వేసే నిందలతో మా అమ్మ పోతే నాకు ఎవరు సమాధానం చెబుతారు. జ్యోత్స్న ఎక్కడికి పోలేదు. మీరే దాచిపెట్టారు. జ్యోత్స్నను నాలుగు రోజలు చుట్టాల ఇంట్లో దాచేసి మా మీదకు దండయాత్రకు వచ్చారు. మమ్మల్ని అరెస్ట్ చేయించాలని చూశారు. ఈరోజు రెండు కుటుంబాలు బాధపడుతున్నాయంటే దానికి కారణం నువ్వే తాత అని శివ నారాయణను అంటాడు సూరజ్.
సూరజ్ ఇక వెళ్లు అని జ్యోత్స్న అంటుంది. నువ్వు నిజం చెప్పకుంటే తప్పు మాది అనుకుంటాడు నీ బాబు. ఇప్పటివరకు పెద్ద గొడవ చేశారని ఆవేశంగా మాట్లాడుతాడు సూరజ్. గొడవ చేస్తారు. వచ్చి అడుగుతారు. మీ గతం అలాంటిది అని జ్యో అంటుంది. మేము మోసాలు చేశాం కానీ ప్రాణాలు తీయలేదు. అయినా మాది ప్రతీకారం. చేసిన తప్పుకు గుణపాఠం. మీ బుద్ధులు ఇలాంటివి కాబట్టే మీకు ఇలాంటి గతి పట్టిందని సూరజ్ అంటాడు.
నువ్వు నా కుటుంబం నుంచి నోరు జారితే నేను నీ కుటుంబం గురించి జారతాను. నువ్వు ఏమైపోయావో చెప్పు. కార్తీక్ చెప్పమంటే చెబుతావా అని సూరజ్ అంటాడు. మధ్యలో మా ఆయన ఎందుకు అని దీప అంటుంది. ఒకప్పుడు జ్యోత్స్న ప్రేమించింది మీ ఆయన్నే కదా వదినా. ఇప్పుడేదో మనిషి మారినంతా మాత్రానా పాత ప్రేమ ఎక్కడికి పోతుందని సూరజ్ అంటాడు. అంతా షాక్ అవుతారు.
100 శాతం కారణం మీ అమ్మే
జ్యోత్స్నను కార్తీక్ గారిని అడగమను అప్పుడు తెలుస్తుంది నిజమని సూరజ్ అంటాడు. అప్పుడు కూడా నేను నమ్మను. జ్యోత్స్న కనిపించకుండా పోడానికి 100 శాతం కారణం మీ అమ్మే. నువ్వు మీ అమ్మను గుడ్డిగా నమ్ముతున్నావ్. వాస్తవం తెలిసినరోజు నీ కళ్లు తెరుచుకుంటాయి. జ్యోత్స్న వచ్చిందిగా ఇక మీ తాతను తీసుకెళ్లు. నువ్వేక్కడ మీ అమ్మకు దూరమైపోతావని జ్యోత్స్నను మాయం చేసింది. నిజం తెలిస్తే నువ్వు ఏం చేస్తావో అని భయపడి వదిలేసిందని కార్తీక్ అంటాడు.
దాంతో మిస్టర్ కార్తీక్ అని సూరజ్ అరుస్తాడు. ఎస్ మిస్టర్ కార్తీక్‌నే మాట్లాడుతున్నా. తట్టుకోలేని నిజాలు నీ మొహం మీదే మాట్లాడుతున్నా. కళ్లు తెరుచుకున్నారోజు ఎవరు ఎలాంటివాళ్లో తెలుస్తుంది అని కార్తీక్ అంటాడు. దక్షిణామూర్తి పిలిస్తే బయలుదేరు తాత.. జ్యోత్స్నను చూసే వెళ్తా అన్నావుగా వచ్చేసింది ఇక వెళ్లు అని అంటాడు.
సూరజ్ వర్సెస్ కార్తీక్ మాటల యుద్ధం
సూరజ్ కూడా వెళ్దాం పదా తాత అంటాడు. దాంతో జాగ్రత్తమ్మా అని చెప్పి దక్షిణామూర్తి వాళ్లు వెళ్తారు. అలా సూరజ్ వర్సెస్ కార్తీక్ మాటల యుద్ధం ఆగిపోతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


