Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సత్తిబాబుతో తాత సై- శివ నారాయణ టిఫిన్ బండి- సూరజ్‌కి పీఏగా జ్యోత్స్న

Karthika Deepam 2 Serial October 1st Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 1వ ఎపిసోడ్‌‌‌లో శివ నారాయణ సత్తిబాబు టిఫిన్ బండి దగ్గర ఇడ్లీ తింటాడు. అది అస్సలు బాగుండదు. దాంతో గొడవపడి సత్తిబాబుతో ఛాలెంజ్ చేస్తాడు తాత. తన కెఫేలో జాబ్ పోగొట్టించింది తానేనని జ్యోత్స్నకు మాలిని చెబుతుంది.

Published on: Oct 1, 2026, 07:45:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో రోడ్డు మీద ఓ ఇడ్లీ బండి దగ్గరికి శివ నారాయణ వెళ్తాడు. నా దగ్గర ఉన్న డబ్బులకు ఇడ్లీ వస్తుందని ప్లేట్ ఇడ్లీ చెబుతాడు శివ నారాయణ. ఇడ్లీ తింటు ఉంటాడు శివ నారాయణ. అది కార్తీక్ చూస్తాడు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్

సత్తిబాబుతో శివ నారాయణ ఛాలెంజ్

ఇంట్లో తినడు కానీ బయట తింటున్నాడు. పోనిలే ఇక్కడైన ప్రశంతంగా తినని అని కార్తీక్ అనుకుంటాడు. అయితే, ఇడ్లీ చట్నీ మాత్రం కారంగా ఉంటుంది. ఇడ్లీ చల్లగా ఉందని అస్సలు క్వాలిటీ లేదని, నీకు అసలు బిజినెస్ చేయొచ్చా అని ఇడ్లీ బండివాడు సత్తిబాబుతో గొడవ పడతాడు శివ నారాయణ. నాలుగేళ్లుగా ఇదే క్వాలిటీ మెయింటేన్ చేస్తున్నా అని సత్తిబాబు అంటాడు.

దాంతో అతనికి శివ నారాయణ క్లాస్ పీకుతాడు. వేడి వేడి ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో తెలుసా అని శివ నారాయణ అంటే.. నా దగ్గర టిఫిన్ ఇలాగే ఉంటుంది. తింటే తినండి లేకుంటే పోండీ. కాస్తీ ముందుకు వెళ్తే జ్యోత్స్న రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ వేడి వేడి ఇడ్లీ దొరుకుతుంది. వేడి ఉన్నప్పుడే కస్టమర్స్ రావాలి. కస్టమర్స్ వచ్చినప్పుడల్లా వేడి చేస్తే అంతా గ్యాస్‌కే అయిపోతుందని. తింటే తిను లేకపోతే పో అని సత్తిబాబు అంటాడు.

ఇంతలో కార్తీక్ వచ్చి అతనెవరో తెలుసా అని చెప్పబోతుంటే శివ నారాయణ వారిస్తాడు. ఏంటీ బిల్డప్పా.. అతనికి నువ్వు వచ్చి బిల్డప్ ఇస్తున్నావా. చేతనైతే నా ఇడ్లీ బండి ఒక్క నెలరోజులు నడిపి టిఫిన్ అమ్ము. నువ్వు సంపాదించే ప్రతి 100లో 20 రూపాయలు నావి. పందానికి రెడీనా అని సవాల్ విసురుతాడు. శివ నారాయణ ఛాలెంజ్ తీసుకుంటాడు.

ఇంట్లో చెప్పిన తాత

టిఫిన్ బండి నడుపుతానంటాడు. సరే ముందు తిన్నదానికి డబ్బులు ఇవ్వమంటే.. జేబు చినిగిపోయి ఉంటాయి. డబ్బు ఎవరో కొట్టేసినట్లు ఉన్నారని శివ నారాయణ అంటాడు. తిన్నదానికి డబ్బులు లేవుగానీ టిఫన్ బండి నడుపుతాడట అని సత్తిబాబు అంటాడు. కార్తీక్ డబ్బులిచ్చి ఎవరిని తక్కువ అంచనా వేయకని చెబుతాడు. శివ నారాయణ వెళ్లిపోతాడు.

తాత ఇలా కమిట్ అయ్యాడేంటీ. నడపలేడని కాదు కానీ తన స్థాయి తక్కువ చేసుకుని ఇడ్లీ బండి నడుపాతనని అనడమేంటని కార్తీక్ ఆలోచిస్తాడు. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న జ్యోత్స్న దగ్గరికి మాలిని వెళ్తుంది. నీ జాబ్ పోగొట్టింది నేనే. నీకు ఏ జాబ్ ఉండదు. ఉండనివ్వనుగా అని మాలిని అంటుంది. హాయిగా ఇంట్లో కూర్చో నీ బావ, దీప పోషిస్తారు. వాళ్ల జీతమెంతో తెలుసా. రూపాయి, వంద పైసలు అని జ్యోకి చెబుతుంది మాలిని.

మీరో ఐదుగురు, వాళ్లో ఐదుగురు మొత్తం 10మంది. నెలంతా తిన్న 20 పైసలు మిగులుతాయి. నేను మనుషులను వస్తువుల్లా వాడతాను. నా నీడలో ఉన్నారంటే వారితే అవసరం ఉందని మాలిని అంటుంది. నీ నీడలో లేనివాళ్లను కూడా నువ్వు బాగుండనివ్వవు. నువ్వు ప్రేమించినట్లు నటిస్తూ ద్వేషిస్తావ్. మా నుంచి అన్నీ లాగేసుకున్న నీకు సరిపోలేదు. మా ఊపిరి తీసుకోవాలని కూడా చూస్తున్నావ్ అని జ్యోత్స్న అంటుంది.

నీ నెత్తిమీదే నిలబడతా అత్తా

అదృష్టం నీ బాడీగార్డ్ కాదు. ఎప్పుడు నీది కాదు. నా టైమ్ వచ్చినప్పుడు నువ్వు నిలబడేందుకే భయపడతావ్. నన్ను ఏడిపిస్తే నీకు సంతోషమేస్తుందేమో నాకు కసి పెరుగుతుంది. నన్ను ఎక్కడ నిలబడకుండా చేస్తానంటున్నావుగా. అలా చేస్తే ఏదో ఒకరోజు నీ నెత్తిమీదే నిలబడతాను. అప్పుడు తట్టుకోలేవు. నేను ఒత్తి వెలిగించిన బాంబ్ లాంటిదాన్ని పట్టుకోవాలనుకుంటే నీకే నష్టం అని జ్యో గట్టిగానే ఇస్తుంది.

నువ్వు నన్ను చూసింది చాలా తక్కువ అని మాలిని అంటే.. నాది కూడా సేమ్ డైలాగ్. నేను అన్నీ మర్చిపోయి కుటుంబం కోసం బతకాలనుకుంటున్నాను. నన్ను ఇలాగే బతకనివ్వు. నా దారికి అడ్డురావొద్దు అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. నిన్ను ఆ కోట నుంచి దూరం చేయడానికే ఇదంతా అని మాలిని అంటుంది. మరోవైపు ఇంట్లో టిఫిన్ బండి పెట్టాలనుకుంటున్నా. నువ్వు నాకు సాయంగా ఉండాలని పారిజాతంను అడుగుతాడు శివ నారాయణ.

దాంతో పారిజాతం అరుస్తుంది. అంతా వస్తారు. అందులో తప్పేముందని అంటాడు తాత. శివ నారాయణ ఇప్పుడు పేదవాడు. గతిలేక కూతురు ఇంట్లో తలదాచుకున్న ఓ దరిద్రుడు. నా జీవితం మొదలైంది అక్కడే అని శివ నారాయణ అంటాడు. కార్తీక్ సపోర్ట్ చేస్తాడు. ఇది నా ఫ్యామిలీ. నీ సపోర్ట్ అవసరం లేదని తాత అంటాడు.

మళ్లీ పని మనిషిని చేశావు కదరా ముసలోడా

సరే నాన్న నీతో నేనుంటానని దశరథ్ అంటాడు. సుమిత్ర కూడా ఉంటానంటే వద్దమ్మ నాకు పారిజాతం ఉందిగా అంటాడు శివ నారాయణ. నీ ప్రేమ తగిలెయ్య మళ్లీ నన్ను పని మనిషిని చేశావు కదరా ముసలోడా అని పారిజాతం మనసులో అనుకుంటుంది. సత్తిబాబు ఛాలెంజ్ గురించి తాత చెబుతాడు. అప్పుడే వచ్చిన జ్యోత్స్న కూడా వింటుంది.

నీకు సపోర్ట్‌గా ఉందామనుకున్నా తాత కానీ మాలిని జాబ్ తీసేయించింది. సూరజ్ తీయించాడనుకుని తిట్టాను. ఇది సూరజ్‌కి చెప్పాలి అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. సూరజ్‌కి జ్యోత్స్న మెసేజ్ చేస్తుంది. నన్ను జాబ్‌లో నుంచి తీసేయించింది మీ అమ్మ అని మెసేజ్ చేస్తుంది. అది చూసి షాక్ అవుతాడు సూరజ్. అప్పుడే మాలిని వచ్చి భోజనం చేద్దామంటుంది.

అమ్మా నువ్వు నాకు ఒక మాట ఎప్పుడు చెప్పేదానివి కదా. మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోకూడదు. మనం కూడా ఎవరి జోలికి వెళ్లకూడదు అని. ఇప్పటికీ నువ్వు ఆ మాటకే కట్టుబడి ఉన్నావా అని సూరజ్ అడుగుతాడు. ఇంతలో దక్షిణామూర్తి ఎందుకు అడుగుతున్నావని అంటాడు. ఎవరి బతుకు వాళ్లు బతుకుంటే మనకు అవకాశం ఉందిగా అని ఇబ్బంది పెట్టడం కరెక్టా అని సూరజ్ అంటాడు.

నాపై అనుమానం వచ్చింది

నీకు నిజం తెలిసిందని అర్థమైంది. నువ్వు నేరుగా అడగవు. నేను చెప్పను అని మాలిని అనుకుంటుంది. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టిందని దక్షిణామూర్తి అంటే.. అమ్మా అని సూరజ్ అంటాడు. అదే దీనిపై అమ్మ అభిప్రాయం చెప్పాలని సూరజ్ అడుగుతాడు. కొన్నిసార్లు మనచేతలు అర్థంకానప్పుడు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి నమ్మావంటే వాళ్ల చేతులను కూడా నమ్మాలి. నీ నమ్మకం పోయిందా అని తిరిగి అడుగుతుంది మాలిని.

నాకు ఎవరిపై నమ్మకం పోలేదు. నా నమ్మకం ఎప్పుడు అబద్ధం కాదు. సముద్రానికి కూడా సరిహద్దు ఉంటుంది. దాన్ని దాటి అలలు రావు. మనసుకు కూడా సరిహద్దులు వేయించుకోవాలి. ఆ పరిధి దాటి వెళ్లకూడదు. పీఏ ఇంటర్వ్యూస్ నేనే చూసుకుంటాను అని సూరజ్ అంటాడు. నా మీద సూరజ్‌కి అనుమానం మొదలైనట్టుంది. ఏది పూర్తిగా వాడి మీద వదిలేయకూడదని మాలిని అనుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం పీఏ ఇంటర్వ్యూలు చేస్తాడు సూరజ్. అందులో జ్యోత్స్న ఫైల్ ఉంటుంది. జ్యోత్స్న ఇక్కడికి వచ్చిందా అని సూరజ్ అనుకుంటాడు. జ్యోత్స్నను నేను ఇంటర్వ్యూ చేస్తానని పక్కన అతన్ని పంపిస్తాడు సూరజ్. జ్యో వస్తుంది. కెఫేలో నీ జాబ్ పోగొట్టింది నేను కాదని తెలిసి బాధపడ్డావా అని సూరజ్ అడుగుతాడు.

సూరజ్‌కు పీఏగా జ్యోత్స్న

లేదు, నువ్వు మీ అమ్మ ఒక్కటేగా. ఇంకెందుకు బాధ అని జ్యోత్స్న అంటుంది. ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారా అని జ్యో అంటుంది. ఈ జాబ్ ఓకే అనుకునే వచ్చావా అని సూరజ్ అంటాడు. ఈ రోజుల్లో చదువుకున్న చదువుకు చేసే పనికి సంబంధం లేదని జ్యో అంటుంది. సూరజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాడు. చూస్తుంటే సూరజ్‌కు పీఏగా జ్యోత్స్న జాబ్ చేస్తుందని తెలుస్తోంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More