Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినిని ఏమార్చిన సూరజ్- కార్తీక్, దీప జీతం రూపాయి- సూరజ్‌పై తల్లి నిఘా
Karthika Deepam 2 Serial September 26th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 26వ ఎపిసోడ్‌లో సూరజ్ పర్స్‌లో జ్యోత్స్న ఫొటో వెతుకుతుంది మాలిని. అది చూసిన సూరజ్ వచ్చి తన మనసు ఖాళీగా ఉందంటాడు. సూరజ్‌పై విజయ్‌తో నిఘా పెట్టిస్తుంది మాలిని. కార్తీక్, దీపకు చెరో 50 పైసల జీతం ఫిక్స్ చేస్తుంది మాలిని.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న చెప్పడంతో సూరజ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పర్స్ కోసం చూస్తుంది. ఆ పర్స్‌లో జ్యోత్స్న ఫొటో ఉంటే నిజంగానే సూరజ్ చేయిజారిపోయినట్లే అని మాలిని అనుకుంటుంది. సూరజ్ పర్స్ తీసి చూస్తుంది.

నీ మీద కూడా అనుమానపడొచ్చా
జ్యోత్స్న నీతో ఏం చెప్పిందమ్మా అంటూ వచ్చి సూరజ్ షాక్ ఇస్తుంది. జ్యోత్స్నతో మాట్లాడాకా చాలా డల్‌గా ఉన్నావ్. ఇప్పుడు నా పర్స్ చూస్తున్నావ్. నా మీద నమ్మకం లేదా. ఇదివరకు కార్తీక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశావ్ అని సూరజ్ అంటాడు. తల్లిగా నీ మనసు ఏంటో నేను చూడకూడదా. అందుకే చూస్తున్నా అని పర్స్ అంతా వెతుకుతుంది మాలిని.
నా మనసు ఖాళీగానే ఉందమ్మా. నువ్ దొరుకుతుంది అనుకుంది ఏది నీ కొడుకు జీవితంలో ఉండకపోవచ్చు అని సూరజ్ అంటాడు. ఛ.. జ్యోత్స్న మాటలు నమ్మి అనవసరంగా వీడిని అనుమానించాను అని మాలిని మనసులో అనుకుంటుంది. నువ్వు ఏది ఉన్న నన్నే అడగొచ్చు అని సూరజ్ అంటాడు. నమ్మకమైన ప్రేమల మధ్య చిన్న చిన్న అనుమానాలు వస్తుంటాయి. అప్పుడే నిజాలు తెలుస్తాయి అని మాలిని అంటుంది.
అంటే.. నేను నీ మీద అనుమానపడొచ్చా.. నేను నిజాలు తెలుసుకోవచ్చా అని సూరజ్ షాక్ ఇస్తాడు. ఏంటా నిజం అని మాలిని అంటుంది. నువ్వు నాతో చెప్పలేనిది అని సూరజ్ అంటాడు. నాది భయం కూడా కావచ్చు. నా కొడుకు నేను కోరుకున్నట్లే ఎప్పటికీ ఉండాలి అని వెళ్లిపోతుంది మాలిని. పర్స్ పక్కన గోడకు జ్యోత్స్న ఫొటో పెట్టి ఉంటుంది.
సూరజ్‌పై మాలిని నిఘా
అలా మాలినిని సూరజ్ ఏమారుస్తాడు. జ్యోత్స్న చెప్పింది నిజం అవ్వకూడదు. నేను జాగ్రత్తగా ఉండాలని బాడీగార్డ్ విజయ్‌ను పిలిస్తుంది మాలిని. సూరజ్ ఇంటికెళ్లినప్పటి నుంచి వచ్చేవరకు ఏం చేస్తున్నాడో ఫాలో అవ్వు. ఈ విషయం వాడికి నేను చెప్పినట్లు ఏమాత్రం తెలియకూడదు అని విజయ్‌తో అంటుంది మాలిని. విజయ్ సరేనంటాడు.
కార్తీక్, దీపను పది కోట్ల ఆఫర్, ఆఫీస్‌కు వెళ్లడానికి కారణం ఏంటీ. దీనివల్ల ఇంకా నిందలు పడతారు. ఇప్పుడు మీరెళ్లి అక్కడ ఊడిగాలు చేయాల్సిన అవసరం లేదు. మాలిని అత్తకు కాల్ చేసి మేము రామని చెప్పండి. 10 కోట్లు కూడా వద్దనండి. దీప సీఈఓగా రిజైన్ చేస్తున్నట్లు లెటర్ పంపు అని జ్యోత్స్న అంటుంది. పంపదు. మేము నిర్ణయం తీసుకున్నప్పుడే అన్ని ఆలోచించాం అని కార్తీక్ అంటాడు.
మమ్మల్ని ఏనాడు తప్పుబట్టలేదు. నువ్వు నాతో అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు కూడా తప్పుబట్టారు. కానీ, మంచే జరిగిందిగా. ఇప్పుడు కూడా మంచే జరిగింది. మన ముగ్గురి జీవితాలు ఒక సర్కిల్‌లో తిరుగుతున్నాయి. కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలిగా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఎంత వద్దని చెప్పిన కార్తీక్, దీప వినరు.
నాకు అడ్డురాకండి
తన తల్లి బాధను తీర్చాలని, కన్నీళ్లు తుడవాలని అనుకుంటున్నామని దీప చెబుతుంది. ఈ ఫ్యామిలీ కోసం ఏం చేయాలో అది చేయండి. నేను అడ్డురాను. అలాగే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మీరు కూడా అడ్డురాకండి అని జ్యోత్స్న అంటుంది. నేను అన్ని తిరిగి తీసుకురాడానికే ప్రయత్నం చేస్తున్నాను. తీసుకువస్తాను. కోల్పోయిన నమ్మకంతో సహా అని కార్తీక్ అంటాడు.
నా బాధ అంతా ఒక్కటే మీరు మరింత నిందలు పడతారని చెప్పి ఆల్ ద బెస్ట్ అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి చాలా మారిపోయింది. ఎప్పుడెలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదని దీప అంటుంది. కట్ చేస్తే వెయిటర్‌గా జ్యోత్స్న హోటల్‌లో జాయిన్ అవుతుంది. తను మిస్ ఇండియా కిరీటం పెట్టుకుంది గుర్తు చేసుకుంటుంది.
కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకుంటుంది జ్యోత్స్న. కానీ, కస్టమర్ మాత్రం చాలా బాగున్నావ్. నెంబర్ ఇస్తావా, ఏ ఏరియాలో ఉంటావని అడుగుతాడు. చాలా మంది ఉన్నారు సర్ చెప్పండని జ్యో అంటే.. మేము ఆలోచించుకుని చెబుతామని కస్టమర్ అంటాడు. వేరే టేబుల్ దగ్గరికి వెళ్లగానే అక్కడ సూరజ్ ఉంటాడు. ఇద్దరు చూసుకుని షాక్ అవుతారు.
సీఈఓగా దీప సంతకం
ఆర్డర్ చెప్పండని జ్యో అంటుంది. నువ్వు ఇక్కడ జాయిన్ అవడం ఏంటి. ఇలాంటి జాబ్ చూసుకోవడం ఏంటీ అని సూరజ్ అడుగుతాడు. సూరజ్, జ్యో మాట్లాడుకునేది విజయ్ వీడియో తీస్తాడు. అలా సూరజ్‌పై తల్లి మాలిని నిఘా పెడుతుంది. నన్ను ఎవరు గుర్తుపట్టని చోటు కోసం వెతికాను. కానీ, నా బ్యాడ్ లక్ అని జ్యో అంటుంది. ఇంతలో మేనేజర్ ఉండి ఏంటా డిస్కషన్ అనడంతో ఆర్డర్ తీసుకుంటున్నట్లు చెబుతుంది జ్యోత్స్న .
సూరజ్ ఫిల్టర్ కాఫీ అడుగుతాడు. సంతోషం. ఇంకా ఫోన్ తీసి ఏం తాగాలో మీ అమ్మను అడిగి ఆర్డర్ ఇస్తారనుకున్నా అని జ్యోత్స్న సెటైర్ వేస్తుంది. మాలిని కాల్ చేస్తే రెండు నిమిషాలు అమ్మా వచ్చేస్తున్నా అంటాడు సూరజ్. 50 రూపాయలు పెట్టి కాఫీ తాగకుండానే వెళ్లిపోతాడు సూరజ్. వాళ్ల అమ్మ కాల్ చేసినట్లుందని జ్యో అనుకుంటుంది.
రెస్టారెంట్‌లో దీప సీఈఓగా సంతకం చేస్తుంది. దీపను ఎలా పిలవాలో మాట్లాడుకుంటారు. కార్తీక్ అడ్వైజర్‌గా ఉంటాడు. దీపకు సర్‌ప్రైజ్ ఉందని నీకు శాలరీ ఫిక్స్ చేశాం అని చూపిస్తారు. అది కార్తీక్‌కు చూపిస్తుంది దీప. శాలరీ రూపాయి చూసి షాక్ అవుతాడు కార్తీక్. బాగా ఆలోచించి రూపాయి శాలరీ ఇవ్వాలని బోర్డ్ నిర్ణయించింది. అది కూడా ఇద్దరికి కలిపి రూపాయి. నీకు 50 పైసలు దీపకు 50 పైసలు అని మాలిని అంటుంది.
కార్తీక్, దీపకు నెలజీతం రూపాయి
సాధారణంగా చెక్ ఇస్తాం. కావాలంటే క్యాష్‌గా కూడా తీసుకోవచ్చు అని మాలిని అంటుంది. లోపల మండుతోందిగా అని దీప అంటుంది. మేము డబ్బుల కోసం వచ్చామనుకుంటున్నాంగా. పది కోట్లు కావాలంది సీఈఓగా వద్దనుకుంటే.. కావాలనుకుంటే అవసరం లేదని దీప అంటుంది. ఈ రూపాయి కూడా వినాయకుడి ముందు హుండీలో వేస్తామని కార్తీక్ అంటాడు.
ఫ్రీగా వర్క్ చేస్తారా అని సూరజ్ అంటాడు. అవును. మమ్మల్ని డబ్బుతో ఎవరు కొనలేరు అని సూరజ్ మాటలే చెబుతాడు కార్తీక్. నా కొడుకు ఆఫీస్‌కు వచ్చినట్లే మీరు వచ్చారా అని మాలిని అంటుంది. మీ తల్లికొడుకులు దేశముదుర్లు. మీకు ప్రేమ పంచుదామని సరికొత్తగా ముడి వేయడానికి వచ్చామని కార్తీక్ అంటాడు.
3 నెలలు ముందే చెప్పాలి
అంతలేదురా మీరు మానేయాలంటే 3 నెలల ముందు చెప్పాలి. నాకు తెలిసి అంతకాలం మీరుండరు అని మాలిని అంటుంది. ఆల్ ద బెస్ట్ పిన్ని అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


