Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దీప చేతులు కలిపిన ఫొటోతో మాలిని దెబ్బ- మాలినికే షాక్ ఇచ్చిన జ్యోత్స్న
Karthika Deepam 2 Serial September 25th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 25వ ఎపిసోడ్‌లో దీపకు ఊహించని విధంగా సీఈఓ జాబ్ ఇస్తుంది మాలిని. తర్వాత తనతో దీప చేతులు కలిపిన ఫొటో చూపించి మాలిని గట్టి దెబ్బకొడుతుంది. కానీ, బయట సూరజ్ విషయంలో మాలినికే పెద్ద షాక్ ఇస్తుంది జ్యోత్స్న.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దీప ఆఫీస్‌కు వచ్చి పది కోట్ల అగ్రిమెంట్ గురించి చెప్పినట్లు మాలిని చెబుతుంది. ఇదంతా శివ నారాయణ చెప్పడంతోనే చేశారని, లేదా కాంచనకు, శ్రీధర్‌కు తెలిసే ఉంటుందని, ఆస్తిపై కేసులు వేయడం శ్రీధర్‌కు అలవాటేగా అంటుంది మాలిని.

సీఈఓగా జాబ్ ఇస్తున్నా
కొడుకుని అడ్డు పెట్టుకుని ఆస్తులు లాక్కోడానికి మీ అంత దిగజారలేదులే అని శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు. కార్తీక్, దీప వచ్చి నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. నా నిర్ణయం ఏంటో ఈ సూట్‌కేస్ చూస్తే అర్థమైందిగా. దీప నా రెండు వేళ్లలో ఒక్కటి పట్టుకో. నువ్వు అనుకుంది నేను అనుకుంది ఒక్కటో కాదో చూద్దామని మాలిని అంటుంది. దీప వచ్చి వేలు పట్టుకుంటుంది.
నీకు సీఈఓగా జాబ్ ఇస్తున్నా అంటుంది మాలిని. ఈ కవర్‌లో జాయిన్ లెటర్ ఉంది. నీకు మీ ఆయనకు. కార్తీక్ అడ్వైజర్‌గా కొనసాగుతాడు. రేపటి నుంచి వచ్చేయండి. కారు పంపిస్తాను. మీ తాత సీఈఓను ఇలాంటి ఇంట్లో ఉంచుతాడేమో నేను ఉంచను. తిరగడానికి కారు ఉండటానికి మీ ఇల్లే.. సారీ అది మీ ఇల్లు కాదుగా. అదే ఆ ఇల్లు ఇస్తాను అని మాలిని గట్టి ఫిటింగ్ పెడుతుంది.
అవసరం లేదని కార్తీక్ అంటాడు. ఎదురొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకునే మనిషివిరా మీరు. నా మనుషులురా మీరు. నాకు ఎంత సహాయం చేశారు. కంగ్రాట్స్ అని ఇద్దరికి చెబుతుంది మాలిని. ఏంటీ బాబాయ్ అలా ఉన్నావ్. నీ ముందు వీళ్లు ఇలా ఉంటారుగానీ మేము రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటాం అని ఓ చూపి ఫొటోస్తుంది మాలిని.
దీప నాతో చేతులు కలిపింది
అందులో మాలినితో దీప చేతులు కలిపిన ఫొటో ఉంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మేమంతా ఒక్కటే బాబాయ్. ఆ క్షమాపణలు ఏవో చెప్పేస్తే అని మాలిని అంటుంటే దశరథ అని శివ నారాయణ గట్టిగా అరుస్తాడు. దాంతో మాలినిని వెళ్లమంటాడు కార్తీక్. మాలిని వెళ్తుంది. కార్తీక్, దీపను అసహ్యంగా చూస్తారు శివ నారాయణ.
మాలినితో ఈసారి ఎవరిని బేరం పెట్టావని జ్యోత్స్న అడుగుతుంది. నా కొడుకుతో మాట్లాడుతున్నావేంటని మాలిని అంటుంది. సీక్రెట్. మా ఇద్దరి మధ్య ఉన్న విషయాలు నీతో ఎందుకు చెబుతామని జ్యోత్స్న అంటుంది. ఆస్తులు పోయిన పొగరు తగ్గలేదే అని మాలిని అంటుంది. సూరజ్ వెళ్దామని కారులో కూర్చోంటాడు. కార్తీక్, దీప ఇచ్చిన ఆఫర్ గురించి చెబుతుంది మాలిని.
ఇద్దరు నా ఆఫీస్‌లో ఎప్పటిలాగే కంటిన్యూ అవుతాడు. మీ తాత కూడా క్షమాపణ చెబితే అని మాలిని అంటే.. బయటకు పో అని ఉంటాడే అని జ్యోత్స్న అంటుంది. నీ పొగరు కూడా దించుతానే. నా కొడుకు అగ్ని తుఫాను లాంటోడు. మీరు సరెండర్ అవ్వడమే తప్పా ఇంకోటి చేసేది లేదు అని మాలిని అంటుంది. ఇలాంటివి శౌర్యకు చెప్పు అత్త. సూరజ్ నీ కొడుకు కాదు ఏనాడో నీ చేతుల్లోనుంచి జారిపోయాడు అని పెద్ద షాక్ ఇస్తుంది జ్యోత్స్న.
మేము ఏదోలా రోజూ కలుస్తూనే ఉంటాం
తన మనసులో నేనున్నా. ఏదో ఒకరోజు నీకు పెద్ద షాక్ ఇస్తాడు. మేము రోజు ఏదోలా కలుసుకుంటూనే ఉంటున్నాం. అది నీతో చెబుతున్నాడా. అసలు నీ కొడుకు మనసేంటో తెలుసా. అసలు నీ కొడుకు పర్స్‌లో ఏముందో తెలుసా అని జ్యో అడిగితే.. ఏముంది నా ఫొటో ఉంటుందని మాలిని అంటుంది. దాంతో జ్యోత్స్న తెగ నవ్వుతుంది.
ఈ విషయంలో మాత్రం అమాయకురాలివే. నీ ఫొటో పెట్టుకుని తిరగడానికి తిలోదకాలు ఇచ్చేశాడు. తాళి కట్టలేదు. కానీ మనసు ఇచ్చాడు. ఇంకా వాడి మనసులో నేనున్నా. కావాలంటే పర్స్ చూడు నా ఫొటో ఉంటుంది. ఆఖరిగా ఒక్క విషయం నా ఫ్యామిలీని ఏం చేయలేవు. తాత నుంచి సారీ చెప్పడమనే భ్రమలో బతకకు. నీ కొడుకును బాగా చూసుకో అని జ్యోత్స్న ఇచ్చిపడేస్తుంది.
మాలినికే షాక్ ఇచ్చిన జ్యోత్స్న
మాలిని కోపంగా వెళ్తుంది. నీకు ఇంకా నిద్రపట్టదు అని జ్యో అంటుంది. మాలిని ఇంట్లో మాట్లాడిన మాటలే బయట జ్యో ద్వారా రివర్స్ అవుతాయి. కార్తీక్, దీపను శ్రీధర్ ఏం చేస్తున్నారని తిడతాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. ఏం చేస్తాడో చేయనివ్వండి అని కాంచన అంటుంది. అవును, నాకు కూడా క్లారిటీ వచ్చిందని సర్, మేడమ్ అని వెటకారంగా మాట్లాడుతాడు శివ నారాయణ. ఆట ఎలా ఆడాలో వాడికి బాగా తెలుసు. మన ఆట ముగించాడు. వాడి ఆట స్టార్ట్ చేశాడు అని శివ నారాయణ అంటాడు.
మాలినితో కలిసిపోయాడని అర్థమైందని పారిజాతం అంటే.. కార్తీక్ అరుస్తాడు. కార్తీక్ పైకి సుమిత్ర అరుస్తుంది. ఇక ఇక్కడ ఉండటం వద్దని వెళ్దామని అంటుంది. మీ అందరికి దండం పెడతాను అర్థం చేసుకోండి. మేము అగ్రిమెంట్ గురించి చెప్పి 10 కోట్లు డిమాండ్ చేసింది నిజమే. మాకు ఆఫర్ ఇవ్వడానికి ఎలాగైనా చెప్పొచ్చు. కానీ, మాలినియే స్వయంగా వచ్చి ఇంట్లో చెప్పడానికి కారణం మమ్మల్ని మీ ముందు బ్యాడ్ చేయడానికి అని కార్తీక్ అంటాడు.
చిన్న డ్రామా చేసింది. మాలిని మేము జిగిరి దోస్తులు అన్నట్లు ఉంది. మమ్మల్ని విడగొట్టడానికి కాకపోతే పాత ఫొటోలు ఎందుకు చూపిస్తుంది. అది కూడా అర్థం కావట్లేదా అని కార్తీక్ అంటాడు. ఆపురా. బాగానే కవర్ చేస్తున్నావు కానీ నమ్మేంతగా నటించలేకపోతున్నావ్. ఇవన్నీ పక్కన పెడితే ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటీ. వెళ్లేముందు మాకు చెప్పాలిగా. దొంగచాటుగా నీ పెళ్లాంతో వెళ్లి అంతా చక్కబెట్టేశావ్. పాపం మాలిని వచ్చి నీ గుట్టురట్టు చేసిందని శివ నారాయణ అంటాడు.
మేము స్వార్థపరులమే
మేము ఎంత స్వార్థపరులమో ఇవాళ తెలియాలి. మాకు బతికే అవకాశం, సామర్థ్యం ఉన్నా మీ ఇంటికి వచ్చి మీకోసం వచ్చి మీ సమస్యలు మా సమస్యలు అనుకుంటే స్వార్థపరులం. యాక్సిడెంట్ అయ్యాక కూడా మీకోసం కడుపులో బిడ్డను లెక్కచేయకుండా మీకోసం రోడ్డు మీద పడిగి తిరిగేంత స్వార్థపరులం. తాత తిండిలేక ఉంటే భోజనం పంపించేంత స్వార్థపరులం అని కార్తీక్ అంటాడు.
మీలాగే మేము కూడా సూరజ్ చేతిలో మోసపోయామని తెలుసు. అయినా కానీ నిందలన్నీ మాపై వేస్తుంటే మౌనంగా భరించేంత స్వార్థపరులం. ఈరోజు మేము చేసింది ఎవరికి అర్థం కాకపోవచ్చు. కానీ, ఓ రోజు అర్థం చేసుకుంటారు. అప్పుడు కూడా స్వార్థపరులుగానే మిగిలిపోతాం. దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్లకండి అని దండం పెడుతాడు కార్తీక్. ఎమోషనల్‌గా అల్లాడించేస్తాడు.
బావతో నేను మాట్లాడాలి
కానీ, దశరథ మాత్రం మనం వాడి ఇంట్లో ఉంటున్నాం. వాడిని ప్రశ్నించడానికి మనకేం అర్హత ఉంది అని అంటాడు. నాకు ఉంది. ఆ అగ్రిమెంట్ రాయడానికి కారణం నేను. దానిగురించి నేను బావతో మాట్లాడుతాను అని జ్యో అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


