Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- జ్యోని ఏడిపించిన రౌడీని కొట్టిన సూరజ్- మాలిని కొత్త ప్లాన్-తాత పంచాయతి

Karthika Deepam 2 Serial September 28th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 28వ ఎపిసోడ్‌‌‌లో కార్తీక్, దీపలను ఆఫీస్ నుంచి వెళ్లగొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్ వేస్తుంది. కాఫీ షాపులో జ్యోత్స్నను ఏడిపించిన రౌడీని సూరజ్ కొడతాడు. జ్యోత్స్న జాబ్ చేస్తుందన్న విషయం దక్షిణామూర్తి తెలుసుకుంటాడు.

Published on: Sep 28, 2026, 07:35:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దీపలకు కలిపి మాలిని ఒక్క రూపాయి శాలరీగా ఇస్తుంది. ఫ్రీగా చేసేందుకు కార్తీక్, దీప రెడీ అవుతారు. జాబ్ మానేసి వెళ్లాలంటే 3 నెలల ముందు చెప్పాలని మాలిని అంటుంది. అన్ని లెక్కలు సరి చేస్తామని కార్తీక్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 28 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 28 ఎపిసోడ్

మాలిని కొత్త ప్లాన్

మాతో ఛాలెంజ్ చేశావ్. ఇప్పుడు ఆఫీస్‌లో అడుగుపెట్టావ్. ఏదో సాధించానని అనుకోకు అని మాలిని అంటుంది. మాలిని, సూరజ్ పక్కకు వస్తారు. డబ్బులిస్తే సరిపోయేది కదమ్మా అని సూరజ్ అంటాడు. అలా చేస్తే మన ముందే ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తారు. అప్పుడు మన శత్రువుని మనమే తయారు చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు వాళ్లు వెళ్లేలా చేస్తాను. నేను ఏం చేస్తానో చూడు అని మాలిని అంటుంది.

మరోవైపు రెస్టారెంట్‌లో జ్యోత్స్నకు ఒకడు కావాలనే డ్యాష్ ఇస్తాడు. సారీ చెబుతాడు. జ్యోత్స్న ఏమనదు. అప్పుడే సూరజ్ వస్తాడు. కాఫీ తాగకుండా ఇచ్చిన డబ్బులు ఇస్తుంది. ఆ కాఫీ వేరేవాళ్లకు సర్వ్ చేశానంటుంది జ్యో. సూరజ్ వద్దంటాడు. అవసరం లేదు. మీకు ఇదివరకే 100 రూపాయలు బాకీ ఉన్నానని డబ్బులిస్తుంది. ఇంతలో ఆ రౌడీ ఆర్డర్ తీసుకునేందుకు ఎవరైనా ఉన్నారా అని అరుస్తాడు.

రౌడీని కొట్టిన సూరజ్

దాంతో జ్యోత్స్న వెళ్లి ఆర్డర్ అడుగుతుంది. నువ్వే కావలంటాడు రౌడీ. ఇది రోడ్డు కాదు అని జ్యో అంటే.. రోడ్డు మీదకు వస్తావా అని అతను అంటాడు. తర్వాత మెను ఇవ్వమంటాడు. జ్యోత్స్న మెను ఇస్తే ఆ రౌడీ చేయి పట్టుకుని ఇబ్బందిపెడతాడు. అది చూసిన సూరజ్ వెళ్లి రౌడీని కొట్టి.. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావురా.. నా మరదలు. చేయి నోరు కంట్రోల్‌లో లేకపోతే ఊరుకోను అని సూరజ్ వార్నింగ్ ఇస్తాడు.

కానీ, అదంతా జ్యోత్స్న కలకంటుంది. సూరజ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. జ్యోత్స్న బలవంతంగా విడిపించుకుంటుంది. ఏదో జాబ్ చేసుకోడానికి వచ్చాను. నన్నెందుకు సర్ ఇబ్బందిపెడతారు అని వెళ్లిపోతుంది. సూరజ్ వెళ్లి మాట్లాడుతాడు. వాడు అలా మిస్ బిహేవ్ చేస్తే కొట్టకుండా ఊరుకుంటావేంటీ. మహా అయితే జాబ్ పోతుంది అంతేగా అని సూరజ్ అంటాడు.

జాబ్ పోతుందని ఆగలేదు. అమ్మాయిని ఏడిపించడానికి చాలామంది ఇలాగే రెడీగా ఉంటారు. అందరిని కొట్టుకుంటూ వెళ్లలేముగా. అలా అని ఏం చేసిన చూస్తూ ఊరుకోలేం. సహనానికి హద్దు ఉంటుంది అని ఇన్‌డైరెక్ట్‌గా సూరజ్‌నే అంటుంది జ్యోత్స్న. ఇన్ని అవమానాలు పడటం అవసరమా అని సూరజ్ అంటే.. అడగడానికి నువ్వెవరు. దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అవ్వకూడదో నాకు తెలుసు. నీ అంతగా నన్ను ఎవరు బాధపెట్టలేరు అని జ్యో అంటుంది.

తాళికట్టకుండా వెళ్లిన నిన్ను ఏం చేయాలి

చేయి పట్టుకున్నందుకే వాడిని లాగికొట్టమంటున్నావ్ మరి తాళి కట్టకుండా వెళ్లిన నిన్ను ఏం చేయాలి. నువ్వు నా వైపు ఉండి ఆలోచించి ఉంటే నువ్వు ఎంత తప్పు చేశావో తెలిసేది. నీ ఆలోచనలన్నీ మీ అమ్మ నిర్ణయిస్తుంది. అది దాటి నువ్వు రాలేవు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే మాలిని నిఘా పెట్టిన విజయ్ ఇద్దరిని వీడియో తీస్తాడు.

చేపలు, చేపలు పట్టేవాడి కథ చెప్పి ప్రతిదానికి రెండువైపులా నష్టం ఉంటుందని సూరజ్ అంటాడు. ఎక్కడా కాఫీ దొరకనట్లు ఇక్కడికి రావడం ఏంటని జ్యో అడుగుతుంది. ఇంతలో దక్షిణామూర్తి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్. జ్యోత్స్న ఇక్కడ జాబ్ చేస్తుందని సూరజ్ చెబుతాడు.

నీకు ఈ కర్మ ఏంటని దక్షిణామూర్తి అడుగుతాడు. నీతో వాదించలేను. మీరే రోడ్డున పడేశారు. మీరే మళ్లీ సానుభూతి చూపిస్తున్నారు. నేను నాకోసం నా కుటుంబం కోసం ఇక్కడ పనిచేస్తున్నాను అని జ్యో వెళ్లిపోతుంది. ఇదంతా చేయిస్తుంది వేరే ఉన్నారు. వాళ్లతోనే తేల్చుకుంటాను అని దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. రోడ్డుపై ఏమరుపాటుగా శివ నారాయణ వెళ్తాడు.

శివ నారాయణను అవమానించిన దక్షిణామూర్తి

దక్షిణామూర్తి కారుకు అడ్డంగా వెళ్తాడు. కొద్దిలో యాక్సిడెంట్ తప్పుతుంది. సారీ చెబుతాడు శివ నారాయణ. రేయ్ శివ నారాయణ ఆగరా.. ఆడపిల్ల సంపాదనపై బతకడానికి సిగ్గులేదారా అని దక్షిణామూర్తి అంటాడు. నేను బతకడం ఏంటని శివ నారాయణ అంటాడు. నా మనవరాలిని ఓ కాఫీ షాపులో ఉద్యోగానికి పెట్టావుకదరా అని దక్షిణామూర్తి అంటాడు.

దాంతో శివ నారాయణ షాక్ అవుతాడు. నిజంగా నాకు ఈ విషయం తెలియదంటాడు. దక్షిణామూర్తి నమ్మడు. జ్యోత్స్నను అడ్డుపెట్టుకుని నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నావ్. క్షమాపణ చెప్పి ఉంటే ఇలా రోడ్డున పడేవాడివి కాదని, నా కూతురు కూతురు సంపాదించి తెస్తే సిగ్గులేకుండా తింటున్నావ్ అని దక్షిణామూర్తి అంటాడు.

ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని బతకాల్సిన అవసరం లేదు. నాకు ఒక్క సారీ చెప్పు చాలు. ది గ్రేట్ శివ నారాయణ మనవరాలు కాఫీ షాపులో పనిచేస్తే నీ తల దించుకోదా.. ముందు దాన్ని జాబ్ మానిపించు. నీదో బతుకు నీదో పౌరుషం. వదిలేస్తే నా కూతురుతో కూడా హోటల్‌లో సప్లయర్‌గా చేయిస్తావ్ అనేసి వెళ్లిపోతాడు దక్షిణామూర్తి. కట్ చేస్తే కాంచన ఇంట్లో జ్యోత్స్నతో పంచాయితీ పెడతాడు శివ నారాయణ.

నా అంత్యక్రియలు చేసింది

తాతకు నిజం తెలిసినట్లుందని జ్యో అనుకుంటుంది. నేను కెఫెలో వెయిట్రస్‌గా జాయిన్ అయ్యానని జ్యో చెబుతుంది. ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని దశరథ్, దక్షిణామూర్తి అవమానించింది కాంచన చెబుతారు. నేను ఎప్పుడో చనిపోయాను. నేను నడుస్తున్న శవాన్ని మాత్రమే. అంత్యక్రియలు ఒక్కటే జరగలేదు. అది కూడా జ్యోత్స్న పూర్తి చేసిందని తాత అంటాడు.

దక్షిణామూర్తి నీతో ఏం చెప్పాడు నేను ఏమైనా దొంగతనం చేశానని చెప్పాడా. నేను కాఫీ షాపులో పనిచేస్తున్నాను. నా జీతం 20 వేలు. దాంట్లో తప్పేముంది. ఒకప్పుడు ఇదే 20 వేలు నా వన్ డే పాకెట్ మనీ. ఇప్పుడు నెలజీతం. కష్టాల్లో ఉన్న నా కుటుంబం కోసం నేను చేస్తున్నాను అని జ్యో అంటుంది. నేను నువ్వు చెప్పిందే చేశాను. సూరజ్ ఆలోచనల నుంచి బయటకు రావడానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నా కుటుంబానికి అండగా ఉండేందుకు అని జ్యోత్స్న అంటుంది.

ఇలాంటి దిక్కుమాలిన సలహా కార్తీకే ఇచ్చి ఉంటాడని పారిజాతం అంటుంది. జ్యోత్స్న చెబుతుందిగా అని తిడతాడు కార్తీక్. ఇక ఆ కెఫెలో జాబ్ మానేయమని శివ నారాయణ అంటాడు. ఎందుకు మానేయాలి. ఇదివరకు జ్యోత్స్నను పీఏగా పెట్టలేదా అని కార్తీక్ అంటాడు.

వెయ్యిరెట్లు గొప్ప అని చెప్పు

నేను నిజాయితీగా కష్టపడుతున్నాను. ఇంకోసారి దక్షిణామూర్తి తాత వచ్చి అవమానిస్తే మోసాలు చేసి రోడ్లమీద తిరిగే నీ మనవడి కంటే నా మనవరాలు వెయ్యి రెట్లు గొప్పదని చెప్పు తాత అని జ్యో అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More