Karthika Deepam 2: సినిమాలో విలన్‌గా కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల- జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్, నిత్య మీనన్‌తో!

Karthika Deepam 2 Serial Actor Nirupam Paritala Multi Talents: తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. ఈ సీరియల్ ఘన విజయానికి కారణాల్లో ఒకరు హీరో నిరుపమ్ పరిటాల. బుల్లితెరపై హీరోగా రాణించిన నిరుపమ్ పరిటాల విలన్‌గా సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

Published on: Sep 20, 2026, 09:23:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Actor Nirupam Paritala Multi Talents: తెలుగు బుల్లితెరపై సంచలన విజయంతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. ఇది నవ వసంతం అంటూ కార్తీక దీపం సీజన్ 2గా ప్రారంభమైన ఈ సీరియల్ ఊహించని ట్విస్టులు, ఎమోషన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

సినిమాలో విలన్‌గా కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల- జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్, నిత్య మీనన్‌తో!
సినిమాలో విలన్‌గా కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల- జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్, నిత్య మీనన్‌తో!

ట్విస్టులు, నటనతో హైలెట్

ప్రస్తుతం అయితే సూరజ్, మాలిని దెబ్బతో శివ నారాయణ కుటుంబం రోడ్డు మీదకు వచ్చేస్తుంది. హీరో కార్తీక్ పెద్ద డ్రామా చేసి మొత్తానికి తాత కుటుంబాన్ని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. కార్తీక దీపం 2 సక్సెస్ అవడానికి సీరియల్‌లో వచ్చే ట్విస్టులతోపాటు అద్భుతమైన నటనతో మెప్పించే నటీనటులు.

ఇక హీరోగా నిరుపమ్ పరిటాల కార్తీక్ పాత్రకు పర్‌ఫెక్ట్ యాప్ట్ అని ఎన్నోసార్లు అనిపించుకున్నాడు. ఇదివరకు కార్తీక దీపం సీరియల్‌లో కూడా డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా ఇతర బుల్లితెర సీరియల్స్‌లో కూడా హీరోగా చేస్తూ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

విలన్‌గా హీరో నిరుపమ్

ఇలా బుల్లితెరపై స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల సినిమాలో మాత్రం విలన్‌గా కనిపించాడు. అయితే, మొదట విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్, నిత్య మీనన్ వంటి స్టార్లతో నటించాడు.

ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ కొడుకుగా బుల్లితెరపైకి అడుగుపెట్టిన నిరుపమ్ పరిటాల 2006లో ఈటీవీలోని చంద్రముఖి సీరియల్‌తో డెబ్యూట్ చేశాడు. ఆ తర్వాత జెమినీ టీవీలో బ్రహ్మముడి, మావి చిగురు, కలియుగ రామాయణం, జీ తెలుగులో కన్యాదానం, కలవారి కోడళ్లు, మూగమనసులు, గృహప్రవేశం, హిట్లర్ గారి పెళ్లాం, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ చేశాడు నిరుపమ్.

16 సీరియల్స్, 6 టీవీ షోలు

ఇలా మొత్తంగా 16 సీరియల్స్, ఆరు టీవీ షోలలో తెలుగు రాష్ట్రాల బుల్లితెర ఆడియెన్స్ మనసు గెలుచుకున్నాడు. ఇక 2009లో అల్లరి నరేష్ హీరోగా చేసిన ఫిట్టింగ్ మాస్టర్ సినిమాలో విలన్‌గా చేశాడు నిరుపమ్. అల్లరి నరేష్ చెల్లెలిని ప్రేమించి, పెళ్లి చేసుకుని, మోసం చేసే ప్రియుడిగా నిరుపమ్ పరిటాల చేశాడు.

ఆ తర్వాత 2014లో జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రణీత సుభాష్ హీరో హీరోయిన్లుగా చేసిన రభస సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించాడు ఈ కార్తీక దీపం 2 హీరో. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్‌గా నటించాడు. నిరుపమ్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లికోసం తారక్ తీసుకెళ్లే సీన్‌తోనే రభస స్టార్ట్ అవుతుంది.

మాటల రచయితగా-ఓటీటీ ఎంట్రీ

ఇలా నటుడిగానే కాకుండా 2017లో వచ్చిన నెక్ట్స్ నువ్వే సినిమాకు మాటలు కూడా రాసి రచయిత అనిపించుకున్నాడు నిరుపమ్ పరిటాల. ఇందులో ఆది సాయి కుమార్ హీరోగా, వైభవి శాందిల్య, రష్మీ గౌతమ్ హీరోయిన్లుగా చేశారు. ఇక వెండితెరపైనే కాకుండా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు నిరుపమ్ పరిటాల.

2023లో వచ్చిన కుమారి శ్రీమతి ఓటీటీ సిరీస్‌లో నిత్యా మీనన్ సరసన నిరుపమ్ పరిటాల నటించాడు. ఇందులో నిత్యా మీనన్‌ను ప్రేమించే యువకుడిగా, తన నిర్ణయాలను, ఆలోచనలు సపోర్ట్ చేసే వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కుమారి శ్రీమతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

నిర్మాతగా రాణిస్తున్న నిరుపమ్

ఇదే కాకుండా ఇటీవల బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీలో స్పెషల్ ఆఫీసర్ రోల్ పోషించాడు నిరుపమ్ పరిటాల. ఇలా నటుడిగా, రచయితగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు నిరుపమ్.

స్టార్ మాలో పాపులర్ సీరియల్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పొదరిల్లుకు నిరుపమ్ పరిటాలే నిర్మాత. ఈ సీరియల్ కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు వంటి సీరియల్స్‌తో పోటీ పడుతూ మరి రేటింగ్ తెచ్చుకోవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More