Brahmamudi September 18 Episode: బ్రహ్మముడి- సిరికి అక్క మొగుడుగా ఇందు, రాజు- భ్రమరాంబపై అపర్ణ ఆగ్రహం- రేఖ కొత్త కుట్ర
Brahmamudi Serial September 18th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 18వ ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌లో స్వాతి, మదన్ పెళ్లి జరుగుతుంది. డోర్ లాక్ చేసుకుని రాజు కోసం సిరి ఏడుస్తుంది. వెంకీ కాల్ చేసి చెప్పడంతో రాజు, ఇందు ఇంటికెళ్తారు. దుగ్గిరాల ఇంటికి సిరిని తీసుకెళ్తారు. రేఖ కొత్త కుట్ర చేస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌లో మదన్, స్వాతి పెళ్లి చేసుకుంటామంటారు. కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్‌గా పెళ్లి చేస్తామని రేఖ అంటుంది. ఇప్పుడు కూడా మా పెళ్లిని డబ్బుతో కొలుస్తున్నావ్. మా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోలేదని స్వాతి మెడలో మదన్ తాళి కడతాడు.

ఆశీర్వదించిన శేషు
రేఖ, భ్రమరాంబ, భూషణ్ షాక్ అవుతారు. కోపంతో రగిలిపోతుంటారు. ఎస్సై దండలు ఇస్తే మదన్, స్వాతి మార్చుకుంటారు. మదన్, స్వాతి సంతకం పెడతారు. ఈ పెళ్లికి సాక్షులుగా రాజు, ఇందు సంతకం పెడతారు. మీవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండని ఎస్సై అంటాడు. వాళ్లకు ఆశీర్వదించే మంచి మనసు లేదని మదన్ అంటాడు.
దాంతో రేఖ, భూషణ్, భ్రమరాంబ కోపంతో వెళ్లిపోతారు. శేషు మాత్రం అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్లిపోతాడు. రాజు, ఇందుల ఆశీర్వాదం తీసుకుంటారు మదన్ స్వాతి. మదన్‌ను రాజు హగ్ చేసుకుంటాడు. మరోవైపు గదిలో గడియపెట్టుకుని ఏడుస్తుంటుంది సిరి. నా మొగుడు కావాలి, చపాతి అంకుల్ తిడుతున్నాడు, నాకు ఇక్కడ భయంగా ఉందని ఏడుస్తుంటుంది సిరి.
లక్ష్మి, వెంకీ ఎంత నచ్చజెప్పిన వినదు. డోర్ తీయదు. రాజుకు కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పమని వెంకీకి చెబుతుంది లక్ష్మి. కారులో వెళ్తున్న రాజు ఇందు సంతోషంగా ఉందని విజిల్ వేస్తాడు. హీరోలాగా ఇద్దరికి పెళ్లి చేశావని ఇందు అంటే.. క్రెడిట్ అంతా ఇందుకు ఇస్తాడు రాజు. ఇప్పుడు ఇంట్లో భ్రమరాంబ వాళ్లు కారాలు మిర్యాలు నూరుతుంటారు. దానికి నన్ను బలి చేద్దామనేగా నాకు క్రెడిట్ ఇస్తున్నావని ఇందు అంటుంది.
నీ ఆలోచనలు నీకన్న అందంగా ఉంటాయి
అమ్మ బాబోయ్ నా మనసులో ఉంది కరెక్టుగా ఎలా చెప్పేసిందని రాజు షాక్ అవుతాడు. నీ ఆలోచనలు నీకన్నా అందంగా ఉంటాయని రాజు అంటాడు. ఇందు అందాన్ని పొగుడుతాడు రాజు. ఇంతలో రాజుకు వెంకీ కాల్ చేసి సిరి గురించి జరిగింది చెబుతాడు. దానికి రాజు మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ పనిచేయట్లేదంటాడు. ఇలా ఆలోచిస్తే లాభం లేదు. ముందు ఇంటికి పదా అని ఇందు అంటుంది.
తర్వాత రాజు వెళ్లి నేను వచ్చానని తలుపు కొడతాడు. దాంతో సిరి డోర్ తీసి రాజును హగ్ చేసుకుని నేను ఇక్కడ ఉండను. చపాతి అంకుల్ తిట్టాడని చెబుతుంది సిరి. తప్పలేదురా అరిచాను అని చలపతి అంటాడు. నన్ను తిట్టినట్లే నువ్వు కూడా చపాతి అంకుల్‌ని తిట్టు అని సిరి అంటుంది. సిరికి చాక్లెట్ ఇచ్చి ఊకోబెడతాడు రాజు.
ఏంటీ నాన్న ఇది అంటే.. చుట్టు పక్కలవాళ్లు అన్నారని కాదు. ఆ పాపకు ఏమైనా అయితే మనం కూడా ఏం చేయలేంగా. వాళ్ల బాధ కూడా కరెక్టే కదా. అందుకే కాస్తా భయం ఉండాలని అలా అన్నాను అని చలపతి అంటాడు. ఇప్పుడు మెల్లిగా మాట్లాడుతున్నాడు కానీ నువ్వు లేకుంటే గట్టిగా అరుస్తున్నాడు. కాళ్లు విరగ్గొడతాడంటా అని రాజుకే తన తండ్రి గురించి కంప్లైంట్ ఇస్తుంది.
రేఖకు మనమే ఛాన్స్ ఇచ్చినట్లు
ఇక్కడ సిరి ఉండటం కరెక్ట్ కాదు. మనింటికి తీసుకెళ్దామని ఇందు అంటుంది. చలపతి వద్దంటాడు. మంచి అవకాశం కోసం చూస్తున్న రేఖ వాళ్లకు మనమే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని రాజు అంటాడు. ఇక్కడే ఉండనిరా. నేను ఏం అనను. కోప్పడను. సిరికి నేను చెప్పుకుంటాను అని చలపతి అంటాడు. కానీ, సిరి వినేలా లేదు. రాజుతో ఉంటే సిరిని గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉంది అని ఇందు నచ్చజెబుతుంది.
ఇదివరకు రాజును తీసుకెళ్లినప్పుడు కూడా మీరు ఇష్టపడలేదు అని ఇందు అనడంతో చలపతి నమ్మకంతో సరేనంటాడు. అందరి గురించి నేను చూసుకుంటానని ఒప్పిస్తుంది ఇందు. సిరితో ఇందు మాట్లాడుతుంటే.. ఎవరు నువ్వు అని అడుగుతుంది సిరి. అక్క అని చెబుతుంది ఇందు. అయ్ భలే భలే.. అక్కా.. మొగుడు.. అక్క మొగుడు అని కేరింతలు కొడుతుంది సిరి.
అందరికి బై చెప్పిన సిరి.. వెంకీని ఆడుకోడానికి అక్కడి రమ్మంటుంది. చపాతి అంకుల్ మీరు రాకండి వస్తే కాళ్లు విరగ్గొడతానంటుంది. ఇందు తీసుకెళ్తుంది. తల్లిదండ్రులకు రాజు దండం పెట్టి వెళ్తాడు. మరోవైపు ఇందు తన వెనుక గోతులు తీసిందని, మదన్, స్వాతి పెళ్లి చేశారని ఇంట్లో చెబుతారు భ్రమరాంబ, రేఖ.
భ్రమరాంబపై అపర్ణ ఆగ్రహం
ఇందు స్వార్థపరురాలు. ఈ ఆస్తికోసమే ఇదంతా చేసిందని భ్రమరాంబ అంటే.. నోర్మూయ్ అని తిడుతుంది అపర్ణ. అది ఏ తప్పు చేయదు. పోయిన పరువు తీసుకొచ్చింది. మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అని అపర్ణ వెనుకేసుకొస్తుంది. ఆంటీ అని రేఖ అంటే.. ఆ ఏంటీ.. ఏంటీ అని బెదిరిస్తుంది అపర్ణ.
ఇంతలో రాజు వాళ్లు వచ్చిన కారు సౌండ్ వినిపిస్తుంది. వాళ్లు వచ్చారు. వాళ్లను ఏమైనా అంటే ఊరుకోను అని అపర్ణ అంటుంది. రాజు, ఇందులతో సిరిని చూసి రేఖ షాక్ అవుతుంది. సిరిని ఇంట్లోకి తీసుకొస్తారు. రేఖ చప్పట్లు కొడుతుంది. నా కొడుకును శాశ్వతంగా దూరం చేసి నీ మొదటి భార్యను ఇంటికి తీసుకొస్తావా అని రేఖ అంటుంది.
అదంతా విని అపర్ణ షాక్ అవుతుంది. సిరి ఇంటికి రావడం ఇష్టంలేదని అపర్ణ వాదిస్తుంది. కానీ, ఇందు వినదు. ఎవరు ఏం చెప్పిన సిరి మాత్రం ఇంట్లోనే ఉంటుందని ఇందు తేల్చిచెబుతుంది. ఇందు తన మాట కాదన్నందుకు అపర్ణ బాధపడుతుంది. ఇకనుంచి ప్రతిచిన్నదానికి అపర్ణ ఆంటీని రెచ్చగొట్టాలని, దాంతోనే రాజును గెంటేలా చేస్తానని రేఖ కుట్ర చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


