Brahmamudi August 25 Episode: బ్రహ్మముడి- తాగించిన లక్కీనే చితకబాదిన ఐశ్వర్య- ఎస్సై ట్రైనింగ్‌కు నందు- ఇందు, రాజు వ్రతం
Brahmamudi Serial August 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 25వ ఎపిసోడ్‌లో అడ్డదారిలో కాకుండా నిజాయతీగా డిగ్రీ పాస్ కావాలని ఫ్రెండ్‌ను అడుగుతుంది ఐశ్వర్య. కానీ, తను ఐషు వల్ల కాదంటుంది. నందు ఎస్సై ట్రైనింగ్‌కు సెలెక్ట్ అవుతుంది. భ్రమరాంబకు భయంతో పొలమారుతుంది. వెంకీని చూసేందుకు వెళ్తుంది నందు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య ఎలాగైనా డిగ్రీ పూర్తి చేస్తుందని, పాస్ అయితే కచ్చితంగా కంపెనీ పెట్టిస్తానని, ఒక్కసారి కష్టపడి సంపాదించడం మొదలైతే వాళ్లు ఎలాంటి వాళ్లైన మారిపోతారు అని ఇందు అంటుంది.

నిజాయితీగా పాస్ కావాలి
నువ్వు చాలా గ్రేట్ ఇందు. నాకు కూడా డౌట్ రాకుండా ఫ్లోలో భలే మాట్లాడావ్. హ్యాట్సాఫ్. నువ్వు చేయాల్సింది చేస్తున్నావ్. చూద్దం ఏం జరుగుతుందో అని రాజు అంటాడు. మరోవైపు రాత్రి ఐశ్వర్య టెన్షన్ పడుతూ తన ఫ్రెండ్‌కి కాల్ చేస్తుంది. తన సబ్జెక్ట్స్ అన్ని సింగిల్ అటెంప్ట్స్‌లో పాస్ అవ్వాలని, పాస్ మార్క్స్ వచ్చిన చాలు, ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది.
సరే డబ్బులు అరెంజ్ చేసుకో నేను చూసుకుంటానని, సబ్జెక్ట్‌కి ఇంత అని చెబితే పాస్ చేయిస్తారని ఫ్రెండ్ అంటుంది. నేను అలా అడ్డదారిలో కాదు నిజాయితీగా కష్టపడి చదివి పాస్ కావాలి. అందుకు నోట్స్, కీ పాయింట్స్, క్వశ్చన్ పేపర్స్ ఉంటే చెప్పు అని ఐశ్వర్య అడుగుతుంది. తాగి మాట్లాడుతున్నావా. అది నీవల్ల కాదు. నేను ఐపీఎస్ కావాలనుకుంటే అవుతానా. నువ్వు కూడా డిగ్రీ పాస్ కాలేవని ఐశ్వర్య ఫ్రెండ్ కాల్ కట్ చేస్తుంది.
నన్ను ఎవరు నమ్మట్లేదేంటని ఐశ్వర్య అనుకుంటే నేను నమ్ముతాను అని లక్కీ అంటాడు. నువ్వు నమ్మితే లాభమేంటని ఐశ్వర్య అడుగుతుంది. నువ్వు డిగ్రీ పాస్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తానని, నేను ఆరో తరగతి పాస్ అయ్యాను, నువ్వు డిగ్రీ ఫెయిల్ అయ్యావ్. నీకంటే నేను బెటర్ అంటాడు. ఏ టైమ్‌లో ఏ సబ్జెక్ట్ చదవాలి అని నేను ఒక టైమ్ టేబుల్ రెడీ చేసి ఇస్తాను. దాన్ని ఫాలో అయి చదివితే చాలు పాస్ అవుతావని లక్కీ అంటాడు.
తాగించిన లక్కీని కొట్టిన ఐశ్వర్య
ఐశ్వర్యను కూర్చొబెట్టి మందు తీసుకొచ్చి కలిపి ఇస్తాడు. ఐశ్వర్య, లక్కీ ఇద్దరు తాగుతారు. ఎలాగైనా డిగ్రీ పాస్ కావాలి. ఇప్పుడే ఇందుతో మాట్లాడాలి. నా కోపాన్ని తీర్చుకోవాలని ఐశ్వర్య తాగి వాగుతుంది. ఇదేదో గొడవ చేసేలా ఉందనుకున్న లక్కీ తనలోనే ఇందును చూసి తన ఫ్రస్టేషన్ తీసుకోమని అంటాడు. లక్కీని ఇందులా ఊహించుకుని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది.
నా గురించి ఏమనుకుంటున్నావే, నేను పాస్ కాలేననుకుంటున్నావా అని లక్కీని చితకబాదుతుంది. తాగించిన లక్కీనే ఎడాపెడా వాయిస్తుంది ఐశ్వర్య. దాంతో లక్కీ పారిపోతాడు. మరుసటి రోజు ఉదయం నందుకు కొరియర్ వచ్చిందని అపర్ణకి ఇస్తాడు డెలివరి బాయ్. నందును పిలిచి అపర్ణ కొరియర్ ఇస్తుంది. అది చూసి నందు సంతోషిస్తుంది.
ఇందు వచ్చి అడిగితే పోలీస్ ట్రైనింగ్‌కు సెలెక్ట్ అయ్యానని నందు చెబుతుంది. దాంతో అంతా సంతోషిస్తారు. ఇందు కలను నిజం చేశావని అపర్ణ అంటుంది. నందుకు స్వీట్ తినిపిస్తుంది ఇందు. అందరికి స్వీట్స్ పంచుతుంది ఇందు. స్వీట్ మాత్రమేనా. ఈ స్వీట్లు వంటలు కాకుండా స్పెషల్ ట్రీట్ ఏమైనా ఉందా అని డ్రింక్ గురించి అడుగుతాడు రాజు.
ఎస్సై పోలీస్ ట్రైనింగ్‌కు నందు
ఇందు వద్దంటుంది. రేఖ, భ్రమరాంబ వచ్చి అడిగితే.. నందు పోలీస్ ట్రైనింగ్‌కు సెలెక్ట్ అయిందని ఇందు చెబుతుంది. రేఖ, భ్రమరాంబ షాక్ అవుతారు. అంటే ఇంకొన్ని రోజుల్లో లాఠీ పట్టుకుని తప్పు చేసినవాళ్లందరి బెండు తీస్తుందన్నమాట అని శేషు అంటాడు. తనకు అన్యాయం చేసినవాళ్లది కూడా అని రాజు అంటే.. భ్రమరాంబకు పొలమారుతుంది.
అవస్థలు పడుతుంది. నీ బాధ, నీ భయం ఏంటో అర్థం చేసుకోగలను. నువ్వు లేకుండా నేను ఉండలేనని శేషు అంటాడు. తను ఏ లక్ష్యం కోసం అయితే నందు కష్టపడిందో, కడుపు మాడ్చుకుందో చివరికి అది సాధించిందని అపర్ణ అంటుంది. ఐశ్వర్యను లాగి రేఖ పెంపకాన్ని ప్రశ్నిస్తుంది అపర్ణ. నన్నెందుకు తక్కువ చేస్తావని ఐశ్వర్య అంటే.. నీకు అన్ని ఉన్న డిగ్రీ కూడా పాస్ కాలేదంటుంది అపర్ణ.
నానమ్మా.. ఐషు డిగ్రీ పాస్ అవుతానని ఛాలెంజ్ చేసింది కదా, ఇంకెందుకు తక్కువ చేసి మాట్లాడతావ్ అని ఇందు అంటుంది. ఐశ్వర్య పాస్ కాదని శేషు, రాజు రెచ్చగొడతారు. తను పాస్ అయి చూపిస్తానని ఐషు అంటే.. బుక్ చూడగానే నిద్ర వస్తుందిగా అక్క అని స్వాతి అంటుంది. కొన్నాళ్లు నిద్రకు లీవ్ పెడతానని ఐశ్వర్య అంటుంది.
నీ మనసంతా నందునేగారా
ట్రైనింగ్ ఎప్పుడు అని రాజు అడిగితే.. ఇవాళ సాయంత్రమే వెళ్లాలి. వరంగల్‌లో అని నందు చెబుతుంది. ఇందు కాస్తా ఎమోషనల్ అవుతుంది. నందు సర్దిచెబుతుంది. నందు, ఇందు హగ్ చేసుకుంటారు. మీ సంతోషాన్ని చూడలేకపోతున్నా. త్వరగా ఏదోటి చేయాలి. చేస్తాను అని రేఖ మనసులో అనుకుంటుంది. మరోవైపు వెంకీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఇరిటేట్ అవుతాడు.
నువ్వు ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేవురా. నీ మనసంతా ఆ అమ్మాయే ఉందిగారా. అలాంటప్పుడు ఇదేలా సాధ్యం అవుతుంది. ఇప్పటికైనా మీ ప్రేమ విషయం నాన్నకు చెప్పురా. అనవసరంగా నీ జీవితం పాడుచోసుకోకు అని తల్లి లక్ష్మీ అంటుంది. ఇంతలో డోర్ ఎవరో కొడితే వెంకీ వెళ్లి చూస్తాడు. నందును చూసి సంతోషించి తర్వాత వెంటనే మాడ్చిన మొహం పెట్టుకుంటాడు.
నేను ఎస్సై రిటన్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యాను. పోలీస్ ట్రైనింగ్‌కు ఇవాళ సాయంత్రమే వెళ్తున్నాను. ఇక నీకు నా వల్ల ఏ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పడానికి వచ్చానని నందు అంటుంది. నందు అడిగితేనే వెంకీ కంగ్రాట్స్ చెబుతాడు. ఎలా ఉండేవాడివి ఎలా మారిపోయావురా అని నందు అంటుంది. ఇంతలో చలపతి వస్తాడు.
చివరిసారిగా చూద్దామని
పోలీస్ ట్రైనింగ్‌కు వెళ్తున్నాను. చివరిసారిగా వెంకీని చూసి వెళ్దామని వచ్చానని నందు అంటుంది. దాంతో చలపతి షాక్ అవుతాడు. ఇంట్లో అందరితోపాటే రాజు, నువ్వు వరలక్ష్మీ వ్రతం చేయాలని ఇందుతో భ్రమరాంబ, ఐశ్వర్య అంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


