Aishwarya Rajesh: ఆ ఒక్క చేపల పులుసుకు 18 లక్షల బిల్ వేసింది.. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Aishwarya Rajesh Fish Curry Bill 18 Lakh: సంక్రాంతికి వస్తున్నాంతో తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేష్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే, తను తిన్న చేపల పులుసుకు రూ. 18 లక్షల బిల్ ఎలా పడిందో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ చెప్పిన విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Published on: Aug 18, 2026, 12:08:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Aishwarya Rajesh About Fish Curry Bill 18 Lakh: దివంగత నటుడు రాజేష్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. రాంబంటుతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి, మిస్‌మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి సినిమాలతో అలరించింది.

ఆ ఒక్క చేపల పులుసుకు 18 లక్షల బిల్ వేసింది.. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
ఆ ఒక్క చేపల పులుసుకు 18 లక్షల బిల్ వేసింది.. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో క్రేజ్

అయితే, ఆ సినిమాలు ఏవి ఐశ్వర్య రాజేష్‌ను హీరోయిన్‌గా బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాయి. కానీ, 2025లో వచ్చిన వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్య రాజేష్.

వరుస తెలుగు సినిమాలతో బిజీ

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది. ఇప్పటికే ఓ సుకుమారి సినిమాతో అలరించిన ఐశ్వర్య ఓటీటీ సిరీస్ ఇసకపట్నంతో ఆకట్టుకుంటుంది.

ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం సుమంత్ హీరోగా తెరకెక్కిన మహేంద్రగిరి వారాహి సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించింది. అయితే, ఐశ్వర్య రాజేష్ తిన్న ఓ చేపల పులుసుకు ఏకంగా రూ. 18 లక్షల బిల్ అయినట్లుగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఓ సుకుమారి, ఇసకపట్నం ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

మీ అమ్మకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటీ?

ఐశ్వర్య రాజేష్ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న తర్వాత "నాట్ ఏ రాపిడ్ ఫైర్" అనే పేరుతో కొన్ని ప్రశ్నలను అడిగారు యాంకర్. అంటే టకా టక్ సమాధానాలు కాకుండా డీటేల్డ్‌గానే ఆన్సర్స్ చేయమని ఆ టాస్క్ ఉద్దేశం. "మీరు బాగా సంపాందిస్తున్న తర్వాత మీ అమ్మగారికి మీరిచ్చిన మోస్ట్ వాల్యూబుల్ గిఫ్ట్ ఏంటీ?" అని ఐశ్వర్య రాజేష్‌ను యాంకర్ అడిగారు.

గాజులు కొనిస్తానమ్మా అన్నా

దానికి ఐశ్వర్య రాజేష్ "నేను చాలా గిఫ్ట్స్ ఇచ్చానండి. కానీ, రీసెంట్లీ.. మొన్న ఏదో మంచి చేపల పులుసు పెట్టింది. అమ్మా.. గాజులు కొనిస్తానమ్మా అన్నాను. నీకు ఇష్టమైన గాజులు సెలెక్ట్ చేసుకోమ్మా అని చెప్పాను. దాంతో కొట్టుకెళ్లింది.. ఓ కొట్టుకెళ్లి ఈ గాజులు నాకు కావాలంది.. ఓకే అమ్మా తీసేసుకో అని చెప్పాను" అని తెలిపింది.

మాటిస్తే తప్పేదే లేదు

"ఎంత గాజులు అని అడిగితే.. రూ. 18 లక్షలు అన్నాడు" అని ఐశ్వర్య రాజేష్ చెప్పడంతో యాంకర్ ఒక్కసారిగా నవ్వేశారు. ఒకలా చూస్తూ.. "ఒక్క చేపల పలుసుకి.. ఇంత పెద్ద బిల్ వేశావా.. స్నేకీ.. స్నేకీ అంటే మా అమ్మ పేరు నాగమణి. అదే నేను ఇచ్చిన మోస్ట్ వాల్యూబుల్ గిఫ్ట్. అంటే మాటిచ్చాం కదా ఇంకా. మాటిస్తే తప్పేదే లేదు" అని ఐశ్వర్య రాజేష్ సరదాగా పంచుకుంది.

నలుగురి పిల్లల బాధ్యత పడింది

అలా తన తిన్న చేపల పులుసుకు రూ. 18 లక్షల బిల్ పడిందని సరాదాగా చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. అంతకంటే ముందు తన తల్లి గురించి చాలా గొప్పగా మాట్లాడింది ఐశ్వర్య రాజేష్. తన తండ్రి రాజేష్ 36, 38 ఏళ్ల వయసులో చనిపోయినప్పుడు నలుగురు పిల్లల భాద్యత తల్లిపై పడిందని, తమకోసం చాలా కష్టపడిందని ఐశ్వర్య రాజేష్ తెలిపింది.

ఎల్ఐసీ ఏజెంట్ టు రియల్ ఎస్టేట్

వాళ్ల మావయ్య చెప్పడంతో ఎల్ఐసీ ఏజెంట్ పరీక్ష రాసి ఏజెంట్‌గా పని చేశారని, రియల్ ఎస్టేట్ చేసి కమిషన్ తీసుకునే వారిని, ల్యాండ్స్ అమ్మేందుకు రోజుకు గంట నుంచి 3 గంటల ప్రయాణం చేసేవారని తండ్రి చనిపోయినప్పటి పరిస్థితులను ఐశ్వర్య రాజేష్ పంచుకుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More