Brahmamudi August 21 Episode: బ్రహ్మముడి- నీ గతం బ్లాస్ట్ అవుతుంది పిన్ని- ఇందులాగే రేఖను పరిగెత్తించిన రాజు-మదన్ గదిలో!

Brahmamudi Serial August 21st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ ఎపిసోడ్‌‌లో లక్కీ నీ కొడుకు అన్న డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని అవి అక్కడ ఇక్కడ పెట్టానంటూ ఇదివరకు ఇందును రేఖ ఆడుకున్నట్లే రేఖను రాజు పరిగెత్తిస్తాడు. ఇందును బతిమిలాడుకుంటుంది రేఖ. తన గదిలో ఉన్న డీఎన్ఏ రిపోర్ట్స్‌ను మదన్ చూస్తాడు.

Published on: Aug 21, 2026, 07:25:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీ, రేఖల డీఎన్ఏ రిపోర్ట్ వస్తుంది. ఇందును పైనుంచి చూడమని రాజు అంటాడు. పక్కనే భూషణ్ టిఫిన్ చేస్తుంటాడు. మరోవైపు ఇక నాకు ఎలాంటి భయాలు లేవని రేఖ సంతోషిస్తుంది. రేఖ దగ్గరికి రాజు వెళ్తాడు. కాసేపు నీ మొహంలో ఉన్న సంతోషం పోతుందిలే అంటాడు రాజు.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ ఎపిసోడ్

నీ గతం బ్లాస్ట్ అయిపోతుంది పిన్నీ

ఈరోజు నీ గతం బ్లాస్ట్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉన్నవాళ్లందరికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నిజంగానే లక్కీ నీ కొడుకు అందరికి తెలిసిపోతుంది. లక్కీ నీ కొడుకు అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదని తెగ బాధపడిపోయావుగా. అది సంపాదించాను. అది నువ్వే ఇచ్చావ్. నేనేం పీకలేనని నా మొహానా వెంట్రుక విసిరేసావుగా. ఆ వెంట్రుకతోనే డీఎన్ఏ టెస్ట్ చేయించాను. రిపోర్ట్ వచ్చిందని రాజు చెబుతాడు.

దాంతో రేఖ షాక్ అవుతుంది. మనుషులను మాయం చేయొచ్చుగానీ బ్లడ్ రిలేషన్‌ని మాయం చేయలేవని చెప్పానుగా. నీ అంతట చెబితే అయిపోయేదిగా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టావ్. డీఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడో పెట్టానే.. గుర్తొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర నీ భర్త టిఫిన్ చేస్తున్నాడు. అక్కడ పెట్టానని రాజు అంటాడు. ఇక నువ్వు వినట్లేదని డైరెక్ట్ బాబాయ్ దగ్గర పెట్టాను అని రాజు అంటాడు.

రేఖ షాక్‌లో అలాగే ఉండిపోతే.. ఏంటీ చూస్తున్నావ్. నీ కొంపలు అంటుకుపోతాయ్ అని రాజు అంటాడు. దాంతో రేఖ పరుగెత్తుకుంటూ కిందకు వస్తుంది. అది ఇందు ఓ చోట నుంచి, మరో చోట నుంచి సుభాష్, అపర్ణ చూస్తారు. కొరియర్‌లోని పేపర్ చూస్తాడు భూషణ్. షాక్ అవుతాడు. రేఖ అంటూ అరుస్తాడు. రేఖ ఈ రిపోర్ట్ ఏంటీ. ఈ రిపోర్ట్‌లో ఉంది నిజమేనా.. నేను నమ్మలేకపోతున్నా అని భూషణ్ అంటాడు.

నీకు ఐరన్ తక్కువగా ఉంది

నన్నెందుకు మోసం చేశావ్. ఈ బ్లడ్ రిపోర్ట్ చూశాక నమ్మలేకపోతున్నా అని భూషణ్ కంగారుగా అంటాడు. బ్లడ్ రిపోర్టా అని రేఖ అంటే.. చూడు. నీకు ఐరన్ తక్కువగా ఉంది. ఇలా అయితే కళ్లు తిరిగి పడిపోతావ్. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకో అని భూషణ్ చెబుతాడు. రాజును రేఖ కోపంగా చూస్తుంది. రాజు కిందకు వస్తాడు. సుభాష్ ఇంజక్షన్ కోసం ఇందును రేఖ ఎలా పరుగెత్తించిందో గుర్తు చేసుకుంటాడు.

ఇందును టార్చర్ చేస్తావా. టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని రాజు మనసులో అనుకుంటాడు. సోఫాలో రాజు కూర్చుంటాడు. రిలాక్స్ అయ్యావా పిన్ని. నీ ప్రియమైన మేనకోడలు ఐషు రూమ్‌లో రిపోర్ట్ పెట్టినట్లున్నా పిన్నీ అని రాజు అంటాడు. దాంతో రేఖ ఐశ్వర్య గదికి పరిగెత్తుతుంది. ఐశ్వర్య కూడా ఒక పేపర్ చూస్తుంటుంది.

అది చూసి రేఖ షాక్ అవుతుంది. ఐషు కోపంగా ఉంటుంది. ఇంత మోసం ఎవరైనా చేస్తారా. ఇందాకా నాకు ఏం కావాలో లెక్కలు వేసుకున్నా. నేను కట్టాల్సిన క్రెడిట్ కార్డ్స్ బిల్స్‌తో సహా రాసుకున్నా అని ఐశ్వర్య అంటుంది. దాంతో రేఖ వెళ్లిపోతుంది. నన్ను భయపెట్టడానికే డీఎన్ఏ రిపోర్ట్ అని బెదిరిస్తున్నావ్ అని రేఖ అంటుంది. మా రూమ్‌లో పెట్టాను. ఇందు గనుక ఆ రిపోర్ట్స్ చూస్తే నీ సంగతి అంతే అని రాజు అంటాడు.

ఇందును బతిమిలాడిన రేఖ

ఇందు రూమ్‌లోకి పెరిగెత్తుతుంది రేఖ. ఇందు గదిలో రిపోర్ట్స్ ఉండటంతో రేఖ షాక్ అవుతుంది. అవి నిజమని నమ్ముతున్నావా అని రేఖ అంటే.. రిపోర్ట్స్ నిజమే చెబుతాయిగా. ఇది అందరికి చెబుతాను అని ఇందు అంటుంది. ఎవరికి చెప్పొద్దు అని రేఖ సీరియస్ అవుతుంది. సారీ, ఈ విషయం ఎవరికి చెప్పకు. నా జీవితం నీ చేతుల్లో ఉందని ఇందు చేతులు పట్టుకుని వేడుకుంటుంది రేఖ.

ఏం మాట్లాడుతున్నారు ఆంటీ, ఇవి తాతయ్య రిపోర్ట్స్. అయినా నాకు చదువు రాదుగా. అర్థం కాక అటు ఇటు తిప్పుతున్నా అని ఇందు అంటుంది. ఛ.. ఈ కంగారులో ఇది కూడా మర్చిపోయాను అని రేఖ అనుకుంటుంది. రేఖ వెళ్లిపోతుంది. ఆయాసంగా ఇందులాగే సోఫాపై రేఖ పడుతుంది. నీళ్లు తాగమని రాజు బాటిల్ ఇస్తాడు. అలా రేఖను తెగ ఆటాడేసుకుంటాడు రాజు. ఇందును పరిగెత్తించినందుకు మాస్ రివేంజ్ తీసుకుంటాడు రాజు.

చదువు రాని ఇందు దగ్గర నేనెందుకు పెడతాను ఆంటీ. కానీ, ఎక్కడో పెట్టాను. టైమ్‌కే గుర్తు రావట్లేదు. గుర్తొచ్చింది నువ్వు చేసే తప్పులకు నీ వెంటే ఉండే భ్రమరాంబ దగ్గర అని రాజు అంటాడు. దాంతో బయటకి పరుగెత్తుతుంది రేఖ. అప్పుడే బయటి నుంచి భ్రమరాంబ చేతిలో రిపోర్టుతో వస్తుంది. రేఖను కోపంగా చూస్తుంది.

మదన్ గదిలో తల్లి డీఎన్ఏ రిపోర్ట్స్

అసలు ఇదేంటీ. నేనెంత నమ్మాను. నమ్మితే ఇలా మోసం చేస్తారా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్. తప్పు చేసినవాళ్లను శిక్షించాలిగా. ఈ విషయం అందరికి తెలియాల్సిందే అని భ్రమరాంబ అంటుంది. ఇది మీ మనసులోనే ఉంచుకుంటే సరిపోతుందిగా అని రేఖ అంటుంది. శేషు కూడా రేఖకే సపోర్ట్ చేస్తాడు.

భ్రమరాంబ దగ్గర ఉన్నది డీఎన్ఏ రిపోర్ట్స్ కాదని తెలుస్తుంది. రాజు దగ్గరికి రేఖ వెళ్తుంది. ప్రపంచానికి తెలిసిన కొడుకు, తెలియని కొడుకు ఒకే గదిలో ఉన్నారుగా. వాళ్ల రూమ్‌లోనే పెట్టాను అంటాడు రాజు. దాంతో రేఖ పరుగెత్తుతుంది. ఆ డీఎన్ఏ రిపోర్ట్స్‌ను చూసిన మదన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రేఖ వస్తుంది. లక్కీ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More