Brahmamudi August 20 Episode: బ్రహ్మముడి- నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవన్న రేఖ- లక్కీ, రేఖ డీఎన్ఏ రిపోర్ట్ చూసిన భూషణ్

Brahmamudi Serial August 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ ఎపిసోడ్‌‌లో లక్కీ నీ కొడుకు అని ఒప్పుకో అని రేఖతో రాజు అంటాడు. నీ సాక్ష్యం మాయం చేశాను. నువ్వు నన్ను ఏం పీకలేవు అని రాజు మొహంపై రేఖ వెంట్రుక విసిరేస్తుంది. రాజు చెంపపై ఇందు ముద్దు పెడుతుంది. రేఖ, లక్కీల డీఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి.

Published on: Aug 20, 2026, 08:52:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీని నీ కొడుకు అని ఒప్పుకునేందుకు రేపటితో పూర్తవుతుంది. నువ్వు చెప్పకుంటే నేనే చెప్పేస్తాను అని రేఖతో రాజు అంటాడు. సరే చెప్పుకో అని రేఖ అంటుంది. దాంతో రాజు షాక్ అవుతాడు.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ ఎపిసోడ్

నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు

నన్ను రెచ్చగొడుతున్నావ్ నిజంగానే చెబుతానని రాజు అంటాడు. నువ్వు చెప్పిన ఎవరు నమ్మరుగా అని రేఖ అంటే.. నా దగ్గర సాక్ష్యం ఉందిగా అని రాజు అంటాడు. ఆ సాక్ష్యం నేను మాయం చేశానుగా. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉంటే నేను ఏం చేయననుకున్నావా. నేను నిజాన్ని పాతిపెట్టే ప్లాన్‌లో ఉన్నాను. పాతిపెట్టాను కూడా. ఆంటోనీని తీసుకొచ్చి నిజం చెప్పించలేవని. ఏం చేస్తావ్ అని రేఖ అంటుంది.

తప్పు చేస్తున్నావ్. ఇప్పటికే లక్కీ నరకం చూస్తున్నాడు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకో అని రాజు అంటే.. పుట్టినప్పుడే వాడిని వద్దనుకున్నా ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అని రేఖ అంటుంది. నేను ఒప్పిస్తానని రాజు అంటే.. ఏయ్ నువ్వు నన్ను.. అని హెయిర్‌పై వెంట్రుక తీసి దాన్ని ఊదేసి వెంట్రుక కూడా పీకలేవు అని రాజుకు స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ ఇస్తుంది రేఖ.

ఆ వెంట్రుక రాజుపై పడుతుంది. ఆ వెంట్రుకను రాజు తీసుకుంటాడు. మరోవైపు కిచెన్‌లో రాజు మనసులో స్థానం సంపాదించడం కోసం కాఫీపై లవ్ సింబల్ వేసి తయారు చేస్తుంది ఇందు. స్వాతి వచ్చి అడిగితే.. బావతో పెళ్లి అయిందిగా ఇప్పుడెందుకు మళ్లీ ఇంప్రెస్ చేయడం అని అంటుంది. కొన్నిసార్లు ప్రేమను ఇలా చూపించాలని, రొటీన్‌గా అనిపించకూడదని ఇందు అంటుంది.

లవ్ సింబల్‌తో ప్రేమ తెలుస్తుంది

ఇలా లవ్ సింబల్ వేసిస్తే కాఫీ టేస్ట్‌తోపాటు మన ప్రేమ కూడా తెలుస్తుందని ఇందు చెబుతుంది. లవ్ షేప్, ప్రేమ ఎవరు కనిపెట్టారేమో, దాంతోనే అంతా సమస్య అని స్వాతి అంటే.. ఇదంతా మదన్ గురించి అంటున్నావా. నీ ప్రేమ సక్సెస్ అవుతుందని ఇందు అంటుంది. ఇందు వెళ్తుంది. నేను కూడా ఇలాగే మదన్‌ను ఇంప్రెస్ చేయాలని స్వాతి అనుకుంటుంది.

నువ్వు ఈ ఇంటి వారసుడవని నీకు తెలిసేలోపు నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. నువ్వు నా సొంతం బావ. ఈ హార్ట్ సింబల్ చూసి నువ్వు నా మనసులో ఉన్నావని అర్థం చేసుకుంటావని మనసులో అనుకుంటుంది స్వాతి. బెడ్‌పై పడుకున్న రాజుకు ఇందు ముద్దు పెడుతుంది. దాంతో అటు తిరిగి రాజు పడుకుంటాడు. కానీ, రాజు చెంపపై ఇందు లిప్‌స్టిక్ మరక పడుతుంది.

రాజును లేపి కాఫీ ఇస్తుంది. ఆ లవ్ సింబల్‌ను రాజు ఊదేస్తాడు. రాజు అంటూ కోపంగా అరుస్తుంది ఇందు. నీకోసం ఇప్పటివరకు చేసిన కష్టం వృథా అయిపోయింది, నీకు కడుపు నింపుకునే ఆత్రం ఏది చూడటంలో లేదు. చలనం లేని రాయివని ఇందు కోపంగా వెళ్లిపోతుంది. రాజు కిందకు వస్తాడు. రాజు చెంపపై ముద్దు మరకలు చూసి ఐశ్వర్య ఛీ అనుకుంటే.. అపర్ణ, సుభాష్ నవ్వుతారు.

ఇలా భరితెగిస్తే ఎలా

స్వాతి వచ్చి నువ్వు చాలా రొమాంటిక్ అంటుంది. శేషు వచ్చి అల్లుడు.. మొహం కడక్కుని వస్తేమవు అంటాడు. ఇందు కాఫీ ఇచ్చింది. అలాగే వచ్చానని రాజు అంటాడు. కాఫీ మాత్రమే ఇచ్చిందా. ఇంకేం ఇవ్వలేదా అని సిగ్గుగా అడుగుతాడు శేషు. ఇంకేముంటుంది ఏం లేదని రాజు అంటాడు. సంసారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలి కానీ ఇలా బయటపెడితే ఎలా. అడిగేవాళ్లు లేరని ఇలా భరితెగిస్తావా అని భ్రమరాంబ అంటుంది.

నీ మొహం చూడలేకపోతున్నా అని ఐశ్వర్య అంటుంది. దాంతో కోపంగా ఐశ్వర్య మీదకు వెళ్తాడు రాజు. శేషు ఆపి ఫొటో తీసి రాజుకు చూపిస్తాడు. అది చూసి రాజు ఉలిక్కిపడతాడు. ఏంటిదని, ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతాడు రాజు. ఇలా ఎప్పుడు బయటకు రాకని శేషు అంటాడు. ఇందు నవ్వుతుంది. ఇందు దగ్గరికి వెళ్లి నా బుగ్గ మీద ఏంటిదని కోప్పడుతాడు. అందరి ముందు భలే ఇరికించావని రాజు అంటాడు.

నా బుగ్గ మీద ఎందుకు ముద్దుపెట్టావని రాజు అంటే.. ఎవరిని సెట్ చేసుకున్నావ్. ఎవరా అమ్మాయని ఇందు రివర్స్‌లో ప్లేట్ తిప్పేస్తుంది ఇందు. దోషివి నువ్వే, నిర్దోషివని నిరూపించుకోవాల్సింది నువ్వే. ఎవరా అమ్మాయి. మీ మగాళ్ల బుద్ధి అంతేగా. నా మొగుడిని వల్లో వేసుకుంది ఎవతి అది. మీరు ఎక్కడెక్కడా కలుసుకున్నారో. నీకు కచ్చితంగా సెకండ్ సెటప్ ఉంది అని ఇందు అంటుంది.

ఇది డ్రీమోపతి

రాజు ఎటు తేల్చుకోలేకపోతాడు. కొన్ని కలలో జరిగినవి రియల్‌గా కనిపిస్తాయి. ఇది డ్రీమోపతి అని ఏదోటి కవర్ చేసి ఇందు వెళ్తుంది. నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ ఉందా అని రాజు అనుకుంటాడు. మీరు ఇలా సరదాగా ఉంటారా చెబుతాను అని ఐశ్వర్య కోపంగా వెళ్లిపోతుంది. ఇంతలో రాజుకు కొరియర్ వచ్చిందని పోస్ట్‌మాన్ అపర్ణకు ఇచ్చి వెళ్లిపోతాడు.

రాజును పిలిచి కొరియర్ వచ్చిందని అపర్ణ ఇస్తుంది. ఆ కొరియర్ చూసి రాజు సంతోషిస్తాడు. అప్పుడే వచ్చిన ఇందు అడుగుతుంది. రాత్రి పిన్ని లక్కీ విషయంలో నేను ఏం పీకలేనని వెంట్రుక పీకి నా మొహాన కొట్టింది. ఇప్పుడు నేను ఏం చేశానో తనకు చూపిస్తా. జరిగేదంతా పైనుంచి చూడు అని రాజు అంటాడు. పక్కనే భూషణ్ టిఫిన్ చేస్తుంటాడు.

డీఎన్ఏ రిపోర్ట్స్ చూసేసిన భూషణ్

భూషణ్ దగ్గర రేఖ, లక్కీ డీఎన్ఏ రిపోర్ట్స్ పెట్టి రేఖ దగ్గరికి వెళ్తాడు రాజు. నువ్వు పీకిచ్చిన వెంట్రుకతోనే డీఎన్ఏ టెస్ట్ చేయించానని, లక్కీతో మ్యాచ్ అయిందని, రిపోర్ట్స్ అక్కడ పెట్టానని రాజు అంటాడు. రేఖ వెళ్లేలోపే డీఎన్ఏ రిపోర్ట్స్ చూస్తాడు భూషణ్. అదంతా ఇందు, రాజు చూస్తారు. రేఖ షాక్ అవుతుంది. అలా రేఖను తన వెంట్రుకతోనే దెబ్బకు దెబ్బ తీస్తాడు రాజు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More