Brahmamudi August 18 Episode: బ్రహ్మముడి- ఇందుపైకి ఐశ్వర్యను ఉసిగొలిపిన రేఖ- అక్కాచెల్లెళ్ల యుద్ధం- రాజు సాక్ష్యం మాయం

Brahmamudi Serial August 18th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 18వ ఎపిసోడ్‌‌లో ఈ ఆస్తిలో నీకు కూడా వాటా ఉందని ఇందుపైకి ఐశ్వర్యను ఉసిగొలుపుతుంది రేఖ. నీ వల్లే రాజు మారిపోయాడని ఇందుతో చలపతి అంటాడు. సుభాష్‌ను చెకప్‌కి తీసుకెళ్తే ఆయన కాలు కండరాలు చాలా బలహీనంగా ఉన్నాయని డాక్టర్ అంటాడు.

Published on: Aug 18, 2026, 08:26:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వరాజ్ కంపెనీని రాజు తన భుజాలపై మోస్తున్నాడని, అందుకు నెలజీతం ఐదు లక్షలు అని బస్తీ వాళ్లకు చాలా గొప్పగా చెబుతాడు చలపతి. అది చూసి బస్వీళ్లు షాకైపోతారు. ఇన్నాళ్లు అవమానించారు కదరా ఇప్పుడు ఏమంటర్రా. తన కష్టార్జీతం నా చేతిలో పెట్టాడురా అని చలపతి అంటాడు.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 18వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 18వ ఎపిసోడ్

మీసం మెలేసిన చలపతి

రేయ్ హర్ష నీకు 25 వేలు వస్తేనే మీ నాన్న గొప్పలు పోయాడు. నీకన్నా నా కొడుకుకు 22 రెట్లు ఎక్కువరా. ఇదిరా నా కొడుకు రాజు అంటే అని మీసం మెలేస్తాడు చలపతి. తన తండ్రి గురించి మొదటిసారి గొప్పగా చెప్పడంతో రాజు కన్నీళ్లతో ఎమోషనల్ అవుతాడు. నాన్న సంతోషిస్తాడని తెలుసు కానీ ఇంత గొప్పగా ఫీల్ అవుతాడని తెలియదని రాజు అంటాడు.

మరోవైపు ఐశ్వర్యను కలిసిన రేఖ అప్పులు చేయడం ఎక్కువైందిగా. ఇప్పుడు అంతా నా చేతిల్లో లేదు. అంతా ఇందునే చూసుకుంటోంది అని అంటుంది. అది నెత్తిన ఎక్కి కూర్చుంటుందని చెప్పానుగా అని ఐషు అంటుంది. అదంతా శేషు, భ్రమరాంబ వింటుంటారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇందు నా మాట కూడా వినట్లేదు. అందుకే నువ్వు చేయాలని రేఖ అంటుంది.

నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా వారసురాలివేగా. నీకు కూడా ఆస్తిలో హక్కు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందును నీ వాటా అడుగు అని రేఖ చెబుతుంది. ఐషు ఆలోచిస్తుంటే ఇంకా డోస్ పెంచాలని రేఖ అనుకుంటుంది. ఎప్పుడు చూడు నువ్వు తన అక్కవి అంటుందిగా. మరి ఇప్పుడు ఏమైంది. రాజుకు నెల జీతంగా ఐదు లక్షలు ఇచ్చింది అని రేఖ చెబుతుంది.

నీ అక్కనే ఉసిగొలిపాను

అసలు వాడికి తిండి పెట్టడమే ఎక్కువంటే లక్షలు లక్షలు జీతం ఇవ్వడమేంటి. వాళ్లు రాని నేను ఏం చేయాలో నాకు తెలుసు అని ఐశ్వర్య కోపంగా వెళ్లిపోతుంది. ఇందు నేను నిన్ను ఎదిరిస్తే రాజు అడ్డుపడుతున్నాడుగా అందుకు నీ మీదకు నీ అక్కను ఉసిగొలిపాను. ఇప్పుడు నువ్వు, రాజు ఏం చేస్తారో చూస్తాను అని రేఖ తన వేసిన స్కెచ్ గురించి అనుకుంటుంది.

మరోవైపు చలపతి ఇంట్లో అంతా సంతోషంగా తింటుంటారు. ఇందును నువ్వు చాలా గొప్పదానివని మెచ్చుకుంటారు చలపతి, లక్ష్మి. నువ్వు మాకు మాటిచ్చినట్లు వాడిని బాగా చూసుకుంటున్నావ్. వాడి ప్రాణాలకు ఏం కాకుండా చూసుకోవడమే కాదు వాడిని పూర్తిగా మార్చావని చలపతి అంటాడు. 20 ఏళ్లుగా వాడిని మార్చాలని చూశాం. కానీ మేం చేయని పనిని కొన్ని రోజుల్లోనే నువ్వు చేసి చూపించావ్. వాడిని కడిగిన ముత్యంలా చేశావ్ అని చలపతి ఎమోషనల్ అవుతాడు.

మీరు మరి అంత పొగిడేయకండి లావైపోతాను. డైటింగ్ చేయలేక చస్తున్నా అని ఇందు అంటుంది. ఇన్నాళ్లు వాడు ఏమైపోతాడో అని భయం ఉండేది. ఇప్పుడు నువ్వు ఉన్నావనే నమ్మకం ఉంది. వాడిని జాగ్రత్తగా చూసుకో అని చలపతి అంటాడు. ఇంతలో రాజు వచ్చి డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరికింది వెళ్దాం పదా అని ఇందుకు చెబుతాడు.

కండరాలు బలహీనం అయ్యాయి

తాతయ్య, నానమ్మను డైరెక్ట్ హాస్పిటల్‌కు రమ్మన్నాను అని రాజు చెబుతాడు. రాజు, ఇందు వెళ్తారు. హాస్పిటల్‌లో సుభాష్‌ను డాక్టర్ చెక్ చేస్తాడు. ఇంతలో నర్స్ వచ్చి రిపోర్ట్స్ ఇస్తుంది. రాజు వాళ్లతో డాక్టర్ మాట్లాడుతాడు. రిపోర్ట్స్ చూశానని, కొంచెం కండిషన్ క్రిటికల్‌గా ఉందని, కాకపోతే చాలా రోజులు వీల్ చైర్‌లో ఉండటం వల్ల బ్లడ్ సర్కిలేషన్ బాగా తగ్గిపోయిందని, కాలు కండరాలు బలహీనం అయ్యాయని డాక్టర్ చెబుతాడు.

కానీ, ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన బ్రెయిన్ నరాలు బాగా స్పందిస్తున్నాయి. కొన్ని చోట్ల నొప్పి తెలుస్తుందని అన్నారు. ఆపరేషన్ చేస్తే నడిచే అవకాశం ఉందని డాక్టర్ గుడ్ న్యూస్ చెబుతాడు. ఇంకొన్ని బ్లడ్ టెస్టులు చేయాలి. అలాగే, వారం పాటు ఆయనకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వాలి. అప్పుడే ఆపరేషన్‌కు వీలుంటుందని డాక్టర్ చెబుతాడు.

ఫైనల్‌గా టెస్టులు చేసి ఆపరేషన్‌కు వెళ్తాం. ఆపరేషన్ చేసిన తర్వాత నడవడానికి టైమ్ పడుతుంది. వారం నుంచి 3 నెలల వరకు టైమ్ పట్టొచ్చు. పిజియో థెరపీ చేయించాయిలి. అప్పుడు ఆయన కాళ్ల మీద ఆయన నిలబడతాడు అని డాక్టర్ అంటాడు. దాంతో ఇందు వాళ్లు సంతోషిస్తారు. ఇంటికెళ్లిన ఇందు వాళ్లతో అయిపోయాయ మీ తిరుగుళ్లు అని ఐశ్వర్య అంటుంది.

అక్కా చెల్లెళ్ల యుద్ధం మొదలు

తాతయ్య ఆపరేషన్ కోసం వెళ్లామని చెబుతుంది ఇందు. డాక్టర్స్ ఏమన్నారని శేషు అడుగుతాడు. డాక్టర్ చెప్పింది చెబుతుంది ఇందు. శేషు సంతోషంగా ఉందంటాడు. నువ్వు బలంగా కోరుకున్నావుగా తాతయ్య కచ్చితంగా నడుస్తాడు అని శేషు అంటాడు. ఇందు నాకు అర్జంట్‌గా ఐదు లక్షలు ఇవ్వు అంటుంది ఐశ్వర్య. ఇప్పుడు మొదలైంది అక్కా చెల్లెళ్ల యుద్ధం అని రేఖ మనసులో అనుకుంటుంది.

ఐదు లక్షలు ఎందుకు అని ఇందు అడిగితే.. కారణం నీకెందుకు. మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఐశ్వర్య అంటుంది. నా దగ్గర డబ్బులేవని ఇందు అంటే.. రాజుకు ఇవ్వడానికి మాత్రం డబ్బులొస్తాయా అని ఐశ్వర్య అంటుంది. కంపెనీలో పని చేస్తున్నందుకా లేకా నీకు అద్దె మొగుడుగా నటిస్తున్నందుకా అని ఐశ్వర్య నిలదీస్తుంది.

నిజంగానే వాళ్లు భార్యాభర్తలు అని శేషు అంటాడు. రాజుకున్న విలువ కూడా నాకు లేదా అని గొడవ చేస్తుంది ఐశ్వర్య. తర్వాత సుభాష్‌కు ఆపరేషన్ అయ్యేలా రేఖ చేస్తుందా అని అపర్ణ బాధపడితే.. ఇకనుంచి రేఖ పిన్ని పప్పులు ఉడకవని రాజు అంటాడు. రేఖకు రాజు ఎదురవుతాడు. లక్కీ నీ కొడుకు అని చెప్పడానికి రేపే ఆఖరి రోజు అని రాజు అంటాడు.

నీ సాక్ష్యం మాయం చేశానుగా

నువ్వు చెప్పిన ఎవరు నమ్మరుగా అని రేఖ అంటుంది. సాక్ష్యం చూపిస్తానుగా అని రాజు అంటే.. ఆ సాక్ష్యం నేను మాయం చేశానుగా అని రేఖ రాజుకు పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More