Allu Arjun: ఎవర్తిరా ఇది, నిజంగా నక్సలైట్‌ను తెచ్చారా అన్నాడు- అల్లు అర్జున్‌పై గుండె నిండా గుడి గంటలు చింతామణి మాటలు

Gunde Ninda Gudi Gantalu Actress Comments On Allu Arjun: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో విలన్ పాత్ర చింతామణిగా బాగా పాపులర్ అయిన నటి శ్రావణ సంధ్య. ఒకసారి తనను ఐకాన్ అల్లు అర్జున్ నక్సలైట్ అనుకున్నారని, ఎవర్తిరా ఇది అంటూ మాట్లాడారని ఓ ఇంటర్వ్యూలో శ్రావణ సంధ్య పంచుకుంది. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.

Published on: Sep 12, 2026, 05:35:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Chinthamani Comments On Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్‌లో చింతామణి అనే విలన్ పాత్రలో బాగా ఆకట్టుకుంటోన్న నటి శ్రావణ సంధ్య.

ఎవర్తిరా ఇది, నిజంగా నక్సలైట్‌ను తెచ్చారా అన్నాడు- అల్లు అర్జున్‌పై గుండె నిండా గుడి గంటలు చింతామణి మాటలు
ఎవర్తిరా ఇది, నిజంగా నక్సలైట్‌ను తెచ్చారా అన్నాడు- అల్లు అర్జున్‌పై గుండె నిండా గుడి గంటలు చింతామణి మాటలు

ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా

తెలుగు సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా మోడల్, డ్యాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రావణ సంధ్య. గమ్యం, గమనం, శ్రీరంగపురం, వేదం, గోలీమార్, శశిరేఖా పరిణయం, లెజెండ్, జాంబీరెడ్డి, కృష్ణం వందే జయద్గురం తదితర సినిమాల్లో నటించి అట్రాక్ట్ చేసింది నటి శ్రావణ సంధ్య.

అయితే, ఒకానొక సమయంలో అల్లు అర్జున్ తనపై చేసిన కామెంట్స్ గురించి గుండె నిండా గుడి గంటలు సీరియల్ చింతామణి అలియాస్ శ్రావణ సంధ్య ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పుడు శ్రావణ సంధ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎవరో కాదు అల్లు అర్జున్ గారే

"వేదం సినిమాకు మీకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఎవరో చెప్పారు.. నమ్మలేదు ఆ ఆర్టిస్టును పెట్టారా.. ఆర్టిస్టా.." అని యాంకర్ అడుగుతుంటే.. "ఎవరో కాదు.. అల్లు అర్జున్ గారే గమ్యం మూవీకి.. నేను వర్క్ చేశాకా ఆయన 7 అప్ యాడ్‌కు వెళ్లాం" అని శ్రావణ సంధ్య చెప్పుకొచ్చారు.

"హీరోగారిది అల్లు అర్జున్ గారిది 7 అప్ యాడ్‌కి.. ముంబై వాళ్ల యాడ్‌కు మేము మోడల్స్‌గా వెళ్లాం. ఏవండి నేను ఇండస్ట్రీలో మోడల్స్‌గా వర్క్ చేశా.. డ్యాన్సర్‌గా వర్క్ చేశా.. ఆర్టిస్ట్‌గా చేశా.. కానీ జూనియర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు చేయలేదు దేవుడి దయ వల్ల. చిన్న ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ప్యాడింగ్ ఆర్టిస్టు ప్లేస్‌కు వచ్చా" అని చింతామణి తెలిపింది.

ఇప్పుడంటే కాస్తా కలర్ వచ్చా..

"అలా నేను ఫస్ట్ ఎప్పుడైతే మోడల్‌గా చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 7 అప్ యాడ్ షూటింగ్‌కి వెళ్లాం. డస్కీ స్కిన్.. ఇప్పుడున్నా కాస్తా కలర్ వచ్చాను.. మా ఆయన పెట్టే పెట్టుడుకి.. సారీ.. భోజనం" అని తెగ నవ్వేసింది గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటి శ్రావణ సంధ్య. దానికి యాంకర్ కూడా నవ్వేశాడు.

తర్వాత శ్రావణ సంధ్య చెబుతూ.. "అప్పుడు చాలా డస్కీగా ఉండేది స్కిన్. ఆయన కామెడీ చేసేవారన్నమాట.. ఏంటీ ఈ కలర్ అని జస్ట్.. ఇంతకుముందు ఏమేం చేశావ్ అని సరదాగా మాట్లాడారు. సర్ నేను సో అండ్ సో మూవీలో నక్స‌లైట్‌గా చేశాను. నేను షూట్ క్యారెక్టర్స్ లేనప్పుడు మోడల్‌గా కూడా చేస్తుంటాను" అని అన్నారు.

అంత పెద్ద హీరో కాకపోయినా..

"కొంచెం మంచి మోడల్స్‌గా అంటే ఆరోజుల్లో రూ. 600, వెయ్యి రూపాయలు, 1500 అంటే ఎక్కువ. 2005, 2006 టైమ్‌లో. ఇలా అని చెబితే.. గమ్యం మూవీలో నక్సలైటా.. నువ్వా.. అవునండీ నేనే.. ఏమనుకోనంటే ఓ మాట అన్నారు.. పర్లేదు చెప్పండి అన్నాను. ఎవర్తిరా ఇది.. నిజంగా నక్సలైట్‌ను తీసుకొచ్చి పెట్టారనుకున్నాను. అది మీరేనా. అని నన్నే నా మొహంమీదే అన్నారు" అని అసలు విషయం తెలిపింది నటి శ్రావణ సంధ్య.

"అంటే, అప్పటికీ ఆయన అంత పెద్ద హీరో కాకపోయినా.. అల్లు అర్జున్ అంటే మంచి పేరుంది. చిరంజీవి ఫ్యామిలీ నుంచి అంటే మాకు చాలా ఇష్టము. అలాంటి ఆయన నోటి నుంచి ఆ మాటలు వినడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికొచ్చాకా.. నన్ను ఇలా పొగిడారు పొగిడారు అని పంచుకోవాలనిపించింది" అని గుండె నిండా గుడి గంటలు చింతామణి చెప్పుకొచ్చింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More