Bigg Boss Balu Meena: బిగ్ బాస్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా హోమ్ టూర్- ఇలాంటి ఇల్లే కట్టుకోవాలంటూ అల్లరి!

Gunde Ninda Gudi Gantalu Balu Meena In Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు, మీనాలు అడుగుపెట్టారు. సీరియల్‌లో వాళ్లు కట్టుకునే ఇల్లు అలాగే ఉండాలంటూ చేసే అల్లరికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ బిగ్ బాస్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Published on: Sep 7, 2026, 16:49:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Balu Meena In Bigg Boss 10 Telugu: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం రోజున బిగ్ బాస్ 10 తెలుగు షో గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిందే. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలోకి 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు.

బిగ్ బాస్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా హోమ్ టూర్- ఇలాంటి ఇల్లే కట్టుకోవాలంటూ అల్లరి!
బిగ్ బాస్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా హోమ్ టూర్- ఇలాంటి ఇల్లే కట్టుకోవాలంటూ అల్లరి!

బిగ్ బాస్ హౌజ్‌లో బాలు, మీనా

అయితే, బిగ్ బాస్ తెలుగు 10లోకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ (బాలు పాత్ర) కంటెస్టెంట్‌గా అడుగుపెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవేం నిజం కావని బాలు క్లారిటీ ఇచ్చాడు. కానీ, తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లోకి తన భార్య మీనా (అమూల్య గౌడ)తో కలిసి బాలు అడుగుపెట్టాడు.

బిగ్ బాస్ హౌజ్‌లోకి బాలును బలవంతంగా మీనానే లాక్కొస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో తమదైన సీరియల్ స్టైల్‌లో హౌమ్ టూర్ చేశారు భార్యాభర్తలు బాలు మీనా.

మేడపై గది కట్టుకోవాలనుకుంటున్నాం కదా

బాలుకు కళ్లు మూసి బాలును బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొస్తుంది మీనా. "మనం ఎప్పటి నుంచే మేడపై చిన్న గది కట్టుకోవాలని అనుకుంటున్నాం కదా. దాని మోడల్ హౌజ్ ఇది" అని మీనా అంటుంది. దానికి "నేను ఇలా బుక్ అయిపోతాను అని అనుకోలేదు" అని బాలు తన బిగ్ బాస్ నో ఎంట్రీని తలుచుకుంటాడు.

"అసలు ఇది ఎవరి ఇల్లో తెలుసా" అని బాలు అడిగితే.. ఎవరి ఇల్లు అయితే ఏంటని ఏం పట్టించుకోకుండా కిచెన్‌లోకి తీసుకెళ్తుంది మీనా. కిచెన్ చాలా బాగుందని మీనా చెబితే.. మన ఇంట్లో అయితే పొగ మొత్తం మనమీదే పడుతుందని బాలు కౌంటర్ ఇస్తాడు. యుద్ధనౌకలు ఎంత బాగున్నాయో అని మీనా అంటే.. యుద్ధ భూమి అని సింబాలిక్‌గా ముందే పెట్టేసినట్లు ఉన్నారని బాలు అంటాడు.

నేను వంద కార్లు నడపాలి

హాలు అంటే ఈ మాత్రం ఉండాలని మీనా మురిసిపోతుంది. అలా ఉండాలంటే నేను వంద కార్లు నడపాలని బాలు పంచ్ ఇస్తాడు. ఎటు చూసిన తన అందం కనిపించాలని అద్దం గురించి చెబుతుంది మీనా. ఇలాంటి బెడ్స్ రెండు మూడు కావాలని మీనా అంటే.. ఒక్క గదికి అన్ని బెడ్స్ కావాలా అని బాలు అంటాడు.

ఇది మన ఇల్లు కాదు.. వెళ్దాం పదా అని బాలు వెళ్తుంటే.. అటు ఇంకా ఉందంటూ కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్తుంది మీనా. దానిపై కూర్చుని సింహాసనంలా ఉందని మీనా అంటే.. నాకు సింహం బోనులా కనిపిస్తుందని బాలు అంటాడు. ఎవరక్కడా.. ఈ ముళ్లకంప బాలును బంధించండని అని మహారాణిలా చప్పట్లు కొట్టి ఆర్డర్ వేస్తుంది మీనా.

ఆయన బయటకు పోనివ్వడు

నువ్వు చెప్పింది చేసేందుకు ఎవరు లేరిక్కడ. పోవే పూలగంప అంటూ బయటకు వెళ్తాడు బాలు. తర్వాత ఒక్కో ప్లేసులో తిరుగుతారు. స్విమ్మింగ్ పూల్‌ను కూడా గదిలో పెట్టేసుకుందామని మీనా అంటుంది. ఆయన చూస్తే ఇద్దరిని బయటకు పోనివ్వడని బాలు అంటాడు. అబ్బా ఎవరు అని మీనా అడుగుతుంది.

అసలు ఇది ఎవరి మోడల్ హౌజ్ అనుకుంటున్నావ్ అని బిగ్ బాస్‌లో ఇదివరకు జరిగిన గొడవలను గుర్తు చేస్తాడు బాలు. ఇది బిగ్ బాస్ హౌజ్. నీకు కిచెన్‌లో వంట కనిపిస్తుంది నాకు మనుషుల మధ్య మంట కనిపిస్తుంది, నీకు సోఫా కనిపిస్తుంది నాకు గొడవలు కనిపిస్తున్నాయి, నీకు బెడ్ కనిపిస్తోంది నాకు తగువులు కనిపిస్తున్నాయి, ఇక్కడ నీకు ఆట కనిపిస్తుంది నాకు వేట కనిపిస్తుందని బాలు అంటాడు.

కుట్రలు, కుతంత్రాలు

ఈ బిగ్ బాస్ హౌజ్ అంటేనే స్ట్రాటజీలు, మైండ్ గేమ్‌లు, కుట్రలు కుతంత్రాలు, నామినేషన్లు, ఎలిమినేషన్లు అని బిగ్ బాస్ చరిత్ర చెబుతాడు బాలు. అదంతా విన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో బాలు, మీనా ఇద్దరు హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారు. అలా బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌ని విష్ణుకాంత్, అమూల్య గౌడ బాలు మీనాలుగా హోమ్ టూర్ చేసినట్లుగా ఆ వీడియో సాగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More