Veta 2026: చిరంజీవి సూపర్ హిట్ టైటిల్‌తో ఈటీవీ విన్ సినిమా- పూజతో వేట లాంచ్- గెస్టులుగా నాగబాబు, డైరెక్టర్స్!

Veta 2026 Movie Launch Puja Ceremony: సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం వేట. ఘనంగా ప్రారంభమైన వేట పూజా కార్యక్రమానికి నాగబాబుతోపాటు డైరెక్టర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Aug 31, 2026, 17:25:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Veta 2026 Movie Launch Puja Ceremony: ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ ఓటీటీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

చిరంజీవి సూపర్ హిట్ టైటిల్‌తో ఈటీవీ విన్ సినిమా- పూజతో వేట లాంచ్- గెస్టులుగా నాగబాబు, డైరెక్టర్స్!
చిరంజీవి సూపర్ హిట్ టైటిల్‌తో ఈటీవీ విన్ సినిమా- పూజతో వేట లాంచ్- గెస్టులుగా నాగబాబు, డైరెక్టర్స్!

నాగబాబుతో పాటు డైరెక్టర్స్

ఈ వేట సినిమా పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, డైరెక్టర్స్ కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు.

కమిటీ కుర్రోళ్లుతో పరిచయమయ్యా

ఈ ఈవెంట్‌లో హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.

కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. "డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్‌లో వివరించారు. కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను" అని ఆకాంక్షించారు.

ఈటీవీ విన్‌తో మూడో ప్రాజెక్ట్

దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ .. "‘వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి, ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్" అని చెప్పారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. "ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్" అని అన్నారు.

కమిటీ కుర్రోళ్లు చిత్రంలాంటి కథ

"మాకోసం వచ్చిన నాగబాబు గారు, సాయి రాజేష్ గారు, మెహర్ రమేష్ గారు, వీఎన్ ఆదిత్య గారు, ఎస్‌కేఎన్ గారికి థాంక్స్. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది" అని ప్రొడ్యూసర్ పణి అడపాక పేర్కొన్నారు.

"‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ సినిమా నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్" అని హీరోయిన్ సాత్విక చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More