Missing Meghana Teaser: మిస్సింగ్ మేఘన టీజర్ రిలీజ్ చేసిన ఎస్‌కేఎన్.. ఆయన అదృష్టం మాకు రావాలన్న హీరో రామ్ కార్తీక్
Missing Meghana Teaser Released By Producer SKN: రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, అంకిత్ కొయ్య, వైదిక సెంజలియా మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మిస్సింగ్ మేఘన టీజర్‌ను నిర్మాత ఎస్‌కేఎన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మిస్సింగ్ మేఘన టీజర్ లాంచ్ వివరాలపై లుక్కేద్దాం.
Missing Meghana Teaser Released By Producer SKN: తెలుగులో వస్తోన్న న్యూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మిస్సింగ్ మేఘన టీజర్ రిలీజ్
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల పాటను స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు విడుదల చేశారు.
ఇప్పుడు చేతుల మిస్సింగ్ మేఘన టీజర్‌ను నిర్మాత ఎస్‌కేఎన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్సింగ్ మేఘన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, డైరెక్టర్ వాచస్పతి, మూవీ ప్రొడ్యూసర్ నరేష్, హీరో రామ్ కార్తీక్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కొత్త కథలు వస్తేనే ఆదరిస్తారు
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. "టీజర్ చూశాను. సినిమా లైన్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది.. ప్రస్తుతం కొత్త కథలు వస్తేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. టీజర్ చూసిన తర్వాత సినిమా కొత్తగా ఉందనిపిస్తుంది. మీ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది" అని అన్నారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. "టీజర్ లాంచ్ చేసిన ఎస్కేఎన్ గారికి చాలా చాలా థాంక్స్. చిన్న సినిమాలకు ప్రమోషన్స్ చేయాలంటే అందరూ ముందుకు రారు. అలాంటిది అడగగానే ఒప్పుకొని మా టీజర్ లాంచ్ చేసినందుకు మా టీమ్ తరుపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని అన్నారు.
జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి
"ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన వీవీ వినాయక్ గారికి, పిల్లా.. పిల్లా సాంగ్ రిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి మరొకసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు మిస్సింగ్ మేఘన డైరెక్టర్ వాచస్పతి.
నిర్మాత నరేష్ మాట్లాడుతూ.. "జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ అయిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్‌గా మారిపోయాడు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే .. ఆ సినిమా హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్లిపోతారు. అలాంటి ఆయన చేతుల మీదగా మా టీజర్ రిలీజ్ చేశామంటే మేము అంతే నమ్మకంగా సినిమా చేసాము. మా సినిమా యూత్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆదరిస్తుంది అని బలంగా నమ్ముతున్నాను" అని తెలిపారు.
ఆయన అదృష్టం మాకు రావాలి
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. "ఎస్‌కేఎన్ గారిది లక్కీ హ్యాండ్ . ఆయన లక్ మాకు కూడా రావాలి అని కోరుకుంటున్నాము. మా సినిమా, మా టీజర్ నచ్చి ఆయన రిలీజ్ చేసినందుకు చాలా థాంక్స్. ఇప్పటివరకు మేము రిలీజ్ చేసిన కంటెంట్‌కు మంచి బజ్ రావడం చాలా హ్యాపీ గా ఉంది" అని పేర్కొన్నాడు.
సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. "హిట్స్ మీద హిట్స్ కొడుతూ కొత్త వారికి చాన్స్‌లు ఇస్తూ దూసుకుపోతున్న డైనమిక్ , కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మా టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది" అని అన్నారు.
సాంగ్ బాగా వైరల్ అవుతోంది
"సురేష్ బాబు గారు రిలీజ్ చేసిన పిల్లా.. పిల్లా సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో బాగా వైరల్ అవుతుంది. మా పాటను రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్. అలాగే మా టీజర్ అంతే ఇంట్రెస్టింగ్ ఉంది. సినిమా పక్కాగా అందరికీ నచ్చుతుంది అని ప్రామిస్ చేస్తున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్ఆర్ ధృవన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


