OTT Telugu: థియేటర్లలో కుదరని రిలీజ్- ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- కానీ అదే మైనస్!

Panchanama OTT Streaming: నగరంలో వరుస హత్యలు, క్లూస్ చిక్కని కేసు.. తెలుగు సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పంచనామా ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పంచనామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ఒక్క విషయం మాత్రం మైనస్‌గా మారింది. పంచనామా ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ చూద్దాం.

Published on: Aug 9, 2026, 15:30:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Panchanama OTT Release Directly: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఉత్కంఠ రేకెత్తించే మలుపులు, చివరి వరకు సస్పెన్స్ కంటిన్యూ అయ్యే కథలను చూసేందుకు ఓటీటీ వీక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు.

థియేటర్లలో కుదరని రిలీజ్- ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- కానీ అదే మైనస్!
థియేటర్లలో కుదరని రిలీజ్- ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- కానీ అదే మైనస్!

బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు

ఈ తరహా కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలను ఓటీటీ బాట పట్టిస్తున్నారు. సరిగ్గా ఇదే బాటలో తాజాగా ఒక లేటెస్ట్ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 'పంచనామా' (Panchanama OTT).

హంతకుడెవరు?

కథ విషయానికి వస్తే.. నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల తీరును చూసి నగరవాసులతో పాటు పోలీసులు కూడా భయాందోళనలకు గురవుతారు. హంతకుడి వేలిముద్రలు గానీ, చిన్న ఆధారాలు గానీ దొరకకపోవడంతో కేసు విచారణ తీవ్ర సంక్లిష్టంగా మారుతుంది.

స్పెషల్ ఆఫీసర్ ఛేదించిన మిస్టరీ ఏంటి?

ఈ క్రమంలోనే ఈ మిస్టరీని ఛేదించేందుకు ఒక ధైర్యవంతుడైన స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అసలు ఈ సిరీస్ మర్డర్స్ వెనుక ఉన్న హంతకుడు ఎవరు? అతడి అసలు లక్ష్యం లేదా మోటివ్ ఏంటి? ఏ ఆధారమూ లేని ఈ కేసును స్పెషల్ ఆఫీసర్ తన చాకచక్యంతో ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే 'పంచనామా' చిత్రం.

దర్శకనిర్మాతల ఆశాభావం

ప్రతి సన్నివేశంలోనూ ఊహించని మలుపులు, సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ ఎలిమెంట్లతో దర్శకుడు కథను నడిపించినట్లు మేకర్స్ చెబుతున్నారు. పంచనామా సినిమాలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ సీన్లు సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయి" అని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ నటులతో సాంకేతిక బృందం

ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ పంచనామా సినిమాకు సిగతాపు రమేష్ దర్శకత్వం వహించారు. హార్దిక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు గద్దె శివకృష్ణ, వెలగ రాము ఈ చిత్రాన్ని నిర్మించారు. జాన్ రమేష్, ప్రజ్ఞా రెడ్డి, కె. దినేష్, హేమ సుధ, అపూర్వ శ్రీనివాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి తమ నటనతో మెప్పించారట.

థియేటర్లలో రిలీజ్ కుదరకపోవడంతో

అయితే, గత నెల జూలైలో పంచనామా సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అది కుదరలేదని తెలుస్తోంది. థియేటర్లలో రిలీజ్ కుదరకపోవడంతో ఓటీటీలోకి నేరుగా పంచనామా సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

పంచనామా ఓటీటీ స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video OTT) పంచనామా ఓటీటీ రిలీజ్ అయింది. ఆగస్ట్ 7 నుంచి పంచనామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ (Rental) విధానంలో మాత్రమే ఈ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. సబ్‌స్క్రిప్షన్ కాకుండా అద్దె విధానంలో రుసుము చెల్లించి ఈ సినిమాను చూడటం అనేది మైనస్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More