OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ డ్రామా- రాక్షసుడిలాంటి మామ, కోడలి ట్రీట్‌మెంట్- ఇక్కడ చూసేయండి!
Sarikothaga OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ కుటుంబ సభ్యులను శాసించే రాక్షసుడిలాంటి పెద్దమనిషి కథతో తెరకెక్కిన సరికొత్తగా మూవీ వచ్చేసింది. సీనియర్ నటుడు సుభలేఖ సుధాకర్ నటించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకునే ఎమోషన్లతోపాటు కామెడీతో సాగుతుంది. మరి సరికొత్తగా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Sarikothaga OTT Release Today: నేటి డిజిటల్ యుగంలో క్రైమ్, విలన్ డ్రామాల హోరు ఎక్కువవుతున్న వేళ, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంతో కూడిన కథలకు ఆదరణ పెరుగుతోంది. సరిగ్గా ఇలాంటి భావోద్వేగాల సమ్మేళనంతో ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఇవాళ (ఆగస్ట్ 9) వచ్చేసింది.

కుటుంబ సభ్యులను పీడించే ఇంటి పెద్ద..
ఈ కథ అంతా 'రామరాజు' అనే ఒక కఠినమైన కుటుంబ పెద్ద చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి నిబంధనలు విధిస్తూ, కనీసం ఆప్యాయత చూపకుండా కుటుంబ సభ్యులను తన సొంత పనిమనుషుల్లా చూసే నియంతలాంటి స్వభావం అతనిది.
రాక్షసుడిలాంటి మామ
తన మామ రాక్షసుడులాంటోడని, రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో మరింత నరకంగా ఉంటుందని కోడలు భర్తతో విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది. అదే విషయం తల్లిదండ్రులకు కూడా చెబుతుంది. కానీ, వారు సర్దిచెబుతారు. అయితే, రిటైర్మెంట్ తర్వాత కూడా మామ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా, మాటలతో వేధించడం మరింత ఎక్కువవుతుంది.
తిరగబడిన భార్యాకోడళ్లు.. జీవితం నేర్పిన పాఠం
అతడి తీరుతో విసిగిపోయిన కోడలు మామకు ఓ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ఓ ఐడియా ఆలోచిస్తుంది. దాన్ని అత్తతోపాటు ఇంప్లిమెంట్ చేస్తుంది. అలా రామరాజు పెత్తనానికి చెక్ పెట్టేందుకు భార్యాకోడళ్లు ఇద్దరూ కలిసి ఒక నిశ్శబ్ద తిరుగుబాటును ప్రారంభిస్తారు.
అతడు చెప్పే ప్రతీ అనవసరమైన హుకూంను తిరస్కరించడం, అతని ఆధిక్యతను ప్రశ్నించడం మొదలుపెడతారు. తమను గౌరవించని వ్యక్తికి సేవలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. ఈ ఊహించని మార్పును జీర్ణించుకోలేని రామరాజు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, చివరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు.
అనారోగ్యం పాలైన రామరాజుకు అతని ఆప్తమిత్రుడు ఒక కళ్లు తెరిపించే నిజం చెప్తాడు. కుటుంబ సభ్యులు చూపుతున్న ఈ కఠినత్వం అతడిపై పగతో కాదని, అతనిలోని విషపూరితమైన అహంకారాన్ని చంపి మనిషిగా మార్చడానికేనని గ్రహించేలా చేస్తాడు. ఈ క్రమంలో రామరాజులో ఎలాంటి మార్పు వచ్చింది, కుటుంబ సభ్యులతో సంబంధాలను ఎలా పునరుద్ధరించుకున్నాడనేది నెమ్మదిగా హృదయానికి హత్తుకునేలా సాగుతుంది.
అగ్ర నటీనటులు.. సాంకేతిక బలం
వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామరాజు పాత్రలో సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఒదిగిపోయారు. ఆయనతో పాటు రాజశ్రీ నాయర్, భ్రమరాంబిక, అన్విత్, బేబీ సుకృతి కీలక పాత్రలు పోషించారు.
వర్మ డ్రీమ్ క్రియేషన్, సుచేత డ్రీమ్ వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బయ్యావరపు కథ అందించగా, సాయి మధుకర్ స్వరపరిచిన సంగీతం ఈ భావోద్వేగ ప్రయాణానికి ప్రాణం పోసింది. ఈ చిత్రం ప్రతీ కుటుంబం కలిసి చూడదగ్గ ఒక హృదయ విదారక దృశ్యకావ్యంగా నిలవనుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సరికొత్తగా ఓటీటీ స్ట్రీమింగ్
ఈటీవీ విన్ (ETV Win OTT)లో సరికొత్తగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ కథా సుధ సిరీస్‌లో భాగంగా ఇవాళ సరికొత్తగా ఓటీటీ రిలీజ్ అయింది. మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ కావాలనుకునేవారికి ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సరికొత్తగా మంచి ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


