Missing Meghana: అప్పుడు వీవీ వినాయక్, ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు.. మిస్సింగ్ మేఘన నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ రిలీజ్

Missing Meghana Pilla Pilla Pilla Song Launch: తెలుగులో వస్తున్ లేటెస్ట్ సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మిస్సింగ్ మేఘన. తాజాగా అగ్ర నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఏం మాట్లాడారో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 11, 2026, 21:24:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Missing Meghana Pilla Pilla Pilla Song Launch: ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న లేటెస్ట్ టాలీవుడ్ సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మిస్సింగ్ మేఘన. ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు.

అప్పుడు వీవీ వినాయక్, ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు.. మిస్సింగ్ మేఘన నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ రిలీజ్
అప్పుడు వీవీ వినాయక్, ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు.. మిస్సింగ్ మేఘన నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ రిలీజ్

మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ లాంచ్

వీరితోపాటు మిస్సింగ్ మేఘన సినిమాలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా జరగింది.

ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా

ఇప్పుడు మిస్సింగ్ మేఘన సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్‌ను స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన శామ్.కె. నాయుడు, సంగీతం అందించిన ఆర్.ఆర్. ధృవన్ పాల్గొన్నారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుందన్నారు

ఈ సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. మిస్సింగ్ మేఘన చిత్రంలోని ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుందన్నారు. అలాగే మిస్సింగ్ మేఘన మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు

డైరెక్టర్ వాచస్పతి మాట్లాడుతూ.. "ఇండియన్ ఫిలిం ఫీల్డ్‌లో సురేష్ ప్రొడక్షన్స్‌కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబు గారి చేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని చెప్పారు.

మనందరి ఫేవరెట్ సింగర్

"ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ గారికి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని పేర్కొన్నారు మిస్సింగ్ మేఘన దర్శకుడు వాచస్పతి.

గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబుతో

నిర్మాత నరేష్ మాట్లాడుతూ.. "మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్‌తో మాకు ఇది రెండో సినిమా" అని తెలిపారు.

ధృవన్ గారే రాసి.. సంగీతం అందించి..

"తంత్ర మ్యూజికల్‌గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం" అని ప్రొడ్యూసర్ నరేష్ కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More