Virat Kohli: మ్యాచ్‌లకు వెళ్లేముందు విరాట్ కోహ్లీ వినే పాట ఇదే! సాంగ్ వెనుక దాగున్న సెంటిమెంట్ చెప్పిన స్టార్ క్రికెటర్!
Virat Kohli Listened Song Before Matches: కింగ్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టే ముందు వినే ఆ ప్రత్యేకమైన పాట ఏంటో తెలుసా? తండ్రిని కోల్పోయిన నాటి చేదు జ్ఞాపకాలను, తన పోరాట పటిమను గుర్తుచేసే ఆ క్రేజీ సాంగ్ వెనుక ఉన్న అరుదైన భావోద్వేగాలను విరాట్ చెప్పారు. ఆ ప్రత్యేక కథనం ఇక్కడ చూద్దాం.
Virat Kohli Listened Song Before Matches: కొన్ని పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వవు. మన జీవిత ప్రయాణాన్ని, పాత జ్ఞాపకాలను కళ్లముందు కడుతుంటాయి. టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ జీవితంలోనూ అలాంటి ఒక ప్రత్యేకమైన పాట ఉంది.

పాట వెనుక దాగున్న సెంటిమెంట్
మైదానంలో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీని సైతం భావోద్వేగానికి గురిచేసే ఓ పాట ఉంది. ఆ పాట వెనుక ఒక సెంటిమెంట్ కూడా దాగి ఉంది. ప్రముఖ లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'వన్8' (One8) గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌లో కోహ్లీ తన మనసుకు నచ్చిన, తన జీవితానికి అత్యంత దగ్గరగా ఉన్న ఆ పాట గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘విన్నింగ్ స్పీచ్’.. కోహ్లీ గుండెకు హత్తుకున్న పాట
ప్రముఖ పంజాబీ మ్యూజిషియన్ కరణ్ ఔజ్లా రాసిన ఒక పాట తనను ఎంతగానో ప్రభావితం చేసిందని కోహ్లీ వెల్లడించారు. న్యూస్ ఏజెన్సీ పీటీఐ (PTI) షేర్ చేసిన ఒక వీడియోలో విరాట్ కోహ్లీ పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరణ్ పాడిన ‘విన్నింగ్ స్పీచ్’ (Winning Speech) అనే పాటతో తన జీవితానికి ఎంతో పోలిక ఉందని కోహ్లీ చెప్పారు.
గుండెల్లోంచి రాస్తావు
"నువ్వు పాటలను గుండెల్లోంచి రాస్తావు. వాటన్నింటిలో నాకు బాగా కనెక్ట్ అయిన పాట 'విన్నింగ్ స్పీచ్'. ఎందుకంటే అది నీ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. నా ప్రయాణం కూడా దాదాపు అలాగే సాగింది. నేను చాలా చిన్న వయసులోనే మా నాన్నను కోల్పోయాను, బహుశా అందుకే ఆ పాట నాకు చాలా ప్రత్యేకం. మైదానంలోకి మ్యాచ్‌లు ఆడటానికి వెళ్లే ముందు నేను తరచూ ఈ పాటను వింటూ ఉంటాను" అని విరాట్ కోహ్లీ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
2006లో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ తన తండ్రి ప్రేమ్ కోహ్లీని కోల్పోయారు. ఆ కఠిన పరిస్థితుల్లోనూ జట్టు కోసం ఆడి నిలిచిన కోహ్లీ పోరాటానికి, ఈ పాటలోని సాహిత్యం అద్దం పడుతుందని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మెల్బోర్న్ మ్యాజిక్
మైదానంలో ఎంతటి కష్టతరమైన పరిస్థితి ఎదురైనా వెనకడుగు వేయని తన నైజం గురించి కూడా కోహ్లీ ఈ వేదికపై మాట్లాడారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌పై సాధించిన అద్భుత విజయాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
మ్యాచ్ చేజారిపోయిందని అందరూ భావించే అత్యంత ఒత్తిడితో కూడిన క్షణాలంటే తనకు ఎంతో ఇష్టమని కోహ్లీ స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే సవాళ్లను ఎదుర్కోవడం తనకు అలవాటని, చివరి బంతి వరకు ఓటమిని అస్సలు ఒప్పుకోనని చెప్పారు.
1 శాతం ఛాన్స్ ఉన్నా వదిలిపెట్టను..
"ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నాయని తర్వాత నాకు తెలిసింది. కానీ, మ్యాచ్ ఆడుతున్నప్పుడు నా మనసులో అలాంటి ఆలోచనలు ఏవీ లేవు. గెలవడానికి 1 శాతం అవకాశం ఉన్నా చాలు, అది మనకు లభించిన పెద్ద అవకాశంగా భావించాలి. మ్యాచ్ అధికారికంగా ముగిసేవరకు పోరాటం ఆపకూడదు" అని విరాట్ కోహ్లీ తన విన్నింగ్ మైండ్‌సెట్ గురించి వివరించారు.
ఢిల్లీలో కరణ్ ఔజ్లా మ్యూజికల్ హంగామా
ఈ ప్రసంగం సోషల్ మీడియాలో క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, ప్రముఖ సింగర్ కరణ్ ఔజ్లా తన మ్యూజిక్ టూర్‌ను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత ఘనంగా ముగించారు.
దాదాపు 70 వేల మందికి పైగా అభిమానులు హాజరైన ఈ కాన్సర్ట్‌లో ఆయన తన పాపులర్ హిట్స్ ‘తౌబా తౌబా’, ‘గ్యాంగ్‌స్టర్’, ‘బచ్‌కే బచ్‌కే’, ‘బాయ్‌ఫ్రెండ్’ వంటి పాటలతో హోరెత్తించారు.
ఈ ఈవెంట్‌లో కరణ్ జిప్ లైన్ ద్వారా స్టేడియం వ్యాప్తంగా ప్రయాణిస్తూ పాడిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. చివరగా భారీ బాణసంచా కాల్పులతో ఈ వేడుక ముగిసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


