Ram Charan: చెన్నై ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ సంచలనం.. సీఎం విజయ్‌పై చేసిన వ్యాఖ్యలతో మార్మోగిపోతున్న సోషల్ మీడియా!

Ram Charan: చెన్నైలో జరిగిన 'పెద్ది' సినిమా ప్రెస్ మీట్‌లో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Published on: May 30, 2026, 19:45:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ మూవీ ప్రమోషన్ టూర్ లో టీమ్ మొత్తం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పెద్ది టీమ్ చెన్నైలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో తమిళంలో చరణ్ స్పీచ్ అదరగొట్టాడు. ముఖ్యంగా సీఎం విజయ్ గురించి మాట్లాడి తమిళ యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.

చెన్నై ప్రెస్ మీట్లో సీఎం విజయ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు (x/peddi)
చెన్నై ప్రెస్ మీట్లో సీఎం విజయ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు (x/peddi)

రామ్ చరణ్ కామెంట్లు

పెద్ది మూవీ టీమ్ శనివారం (మే 30) చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌కు రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాడు. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ మీడియా సమావేశంలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

స్టార్ డమ్ వదిలేసి

కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు, స్టార్ డమ్ ను వదిలేసి ప్రజలకు సేవ చేయడం కోసం జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి రావడం సామాన్యమైన విషయం కాదని రామ్ చరణ్ అన్నాడు.

"తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కు అభినందనలు. తన సినీ కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్న సమయంలో, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో సినిమాలను వదిలిపెట్టారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ప్రజాసేవ కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా గర్వపడుతున్నా" అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

యూత్ లో క్రేజ్

రామ్ చరణ్ ప్రెస్ మీట్లో దళపతి విజయ్ పేరెత్తగానే అక్కడి హాల్ మార్మోగింది. విజయ్ గురించి చరణ్ చెప్పిన మాటలతో తమిళ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తమ అభిమాన హీరో రాజకీయ విజయాన్ని టాలీవుడ్ స్టార్ హీరో ఈ స్థాయిలో గౌరవించడంపై దళపతి విజయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నారు.

'పెద్ది' సినిమా విశేషాలు

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇందులో జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇది ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: చెన్నై ప్రెస్ మీట్‌లో దళపతి విజయ్‌ గురించి రామ్ చరణ్ ఏం చెప్పారు?

సమాధానం: విజయ్ తన సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడానికి సినిమాలను వదిలిపెట్టడం గొప్ప విషయమని రామ్ చరణ్ ప్రశంసించాడు.

ప్రశ్న: 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన హీరోయిన్ ఎవరు?

సమధానం: ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా రామ్ చరణ్ సరసన నటించింది.

ప్రశ్న: 'పెద్ది' చిత్రానికి దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?

సమాధానం: ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు. ఈ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More