Adhey Neevu Adhe Nenu VV Vinayak: రొమాంటిక్ థ్రిల్లర్‌గా అదే నీవు అదే నేను- మనసా మనసా సాంగ్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్

VV Vinayak Launch Manasa Manasa Song: త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అదే నీవు అదే నేను. ఈ సినిమా నుంచి మనసా మనసా సాంగ్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Jul 13, 2026, 19:06:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

VV Vinayak Launch Manasa Manasa Song: "కమిటీ కుర్రోళ్లు" సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" బ్యూటీ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా "అదే నీవు అదే నేను". శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ థ్రిల్లర్‌గా అదే నీవు అదే నేను- మనసా మనసా సాంగ్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్
రొమాంటిక్ థ్రిల్లర్‌గా అదే నీవు అదే నేను- మనసా మనసా సాంగ్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్

మనసా మనసా సాంగ్ రిలీజ్

రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న అదే నీవు అదే నేను సినిమాకు యంగ్ డైరెక్టర్ కొండల్ దర్శకత్వం వహిస్తున్నారు. "అదే నీవు అదే నేను" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'మనసా మనసా' సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ లాంఛ్ చేశారు.

ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలోని పాటలను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలోని పాటలు నచ్చి ఆదిత్య మ్యూజిక్ ఆడియో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది. తమ మూవీలోని సాంగ్ లాంఛ్ చేసి తమకు సపోర్ట్ చేస్తున్న వినాయక్‌కి ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల, డైరెక్టర్ కొండల్ కృతజ్ఞతలు తెలిపారు.

వినాయక్ కామెంట్స్

ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. "కొండల్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తూ అదే నీవు అదే నేను సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. గోవింద్ గారికి నిర్మాతగా తొలి చిత్రమిది. ప్రొడ్యూసర్‌గా గోవింద్ గారు ఈ సినిమా విజయాన్ని అందుకుని, మరిన్ని మూవీస్ చేయాలి. మనసా మనసా సాంగ్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా" అని కోరారు.

"అదే నీవు అదే నేను" చిత్రంలోని 'మనసా మనసా' పాటను డైరెక్టర్ కొండల్ బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఈ పాట రొమాంటిక్‌గా సాగినా, సెన్సిబుల్‌గా పొయెటిక్‌గా రూపొందించడం విశేషం. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క రిపీటెడ్‌గా వినేలా మంచి ట్యూన్‌తో కంపోజ్ చేశారు.

కలర్‌ఫుల్ విజువల్స్

టాప్ సింగర్ జావెద్ అలీ తన సహజమైన శైలిలో అద్భుతంగా పాడారు. కొరియోగ్రాఫర్ వేద క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్స్ త్రినాథ్ వర్మ, తన్వీ నేగి మధ్య అందమైన కెమిస్ట్రీ, డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి కలర్‌ఫుల్ విజువల్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

'మనసా మనసా' పాట ఎలా ఉందో చూస్తే - ఎన్నెన్నె ఎన్నెన్నె వర్ణాలు ఉన్నా, నువు లేని వెలితేదో మిగిలున్నదే, ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే అంటూ సాగింది.

మనసా మనసా సాంగ్ లిరిక్స్

అలాగే, మారిందే వరసా, నీకైన తెలుసా ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే, బంగారు సొగసా, నీ లేత స్పర్శ, ఎన్నెన్నో మాటల్ని చెబుతున్నదే, తుళ్లిపడకే మనసా మనసా మనసా మనసా కలలా కలిశానులే, ఉన్నట్టుండి వెతికే మలుపే దొరికే మరలా ప్రణయాలు మొదలయ్యెనే, ఉండిపోవే చెలియా చెలియా, చెలియా, చెలియా నీ తీరమే నేను లే, నీకు నాకు ముందే రాసి ఉంచారేమో, నిను వీడి పోలేనులే...అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More