OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- రొమాంటిక్ థ్రిల్లర్ టు క్రైమ్!

OTT Telugu Release Movies: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్ని చాలా స్పెషల్‌గా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, హాట్‌స్టార్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.

Published on: Jun 2, 2026, 06:08:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Releases Telugu: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో హీస్ట్ క్రైమ్ యాక్షన్ నుంచి రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వరకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టు లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- రొమాంటిక్ థ్రిల్లర్ టు క్రైమ్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- రొమాంటిక్ థ్రిల్లర్ టు క్రైమ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28

ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

స్పైడర్ నోయిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 27

గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29

లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29

నవాబ్ కేఫ్ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మే 29

ఆహా ఓటీటీ

కాకమ్మ కథలు సీజన్ 3 (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- మే 28

సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 29

జియో హాట్‌స్టార్ ఓటీటీ

జెట్లీ (తెలుగు క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 25

బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 27

సెడ్యూసర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 28

కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 29

ఈటీవీ విన్ ఓటీటీ

మేరీ అవాజ్ సునో (తెలుగు డబ్బింగ్ మలయాళ మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా సినిమా)- మే 28

నిశబ్ధం (తెలుగు ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా మూవీ)- మే 31

మరికొన్ని ఓటీటీల్లో

డ్రింకర్ సాయి (తెలుగు రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జీ5 ఓటీటీ- మే 27

ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 29

ది రేస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 29

ఓటీటీలోకి తెలుగులో 17 సినిమాలు

ఇలా గత వారం (మే 25 నుంచి 31 వరకు) తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, గోదారి గట్టుపైన, నవాబ్ కేప్, డ్రింకర్ సాయి, నిశబ్ధం, జెట్లీ, కాకమ్మ కథలు సీజన్ 3, సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ వంటి 7 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More