Takshaka: విశ్వంభర డైరెక్టర్ సోదరుడు కృష్ణ దర్శకత్వంలో తక్షక- పోస్టర్ లాంచ్ చేసిన వీవీ వినాయక్- హీరోగా నిర్మాత కుమారుడు!

Director VV Vinayak Launch Takshaka Movie Poster: విశ్వంభర డైరెక్టర్ వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకుడిగా మారిన సినిమా తక్షక. ఈ సినిమాతో నిర్మాత లతా రాజు కుమారుడు కుశాల్ రాజు హీరోగా పరిచయం కానున్నాడు. తాజాగా తక్షక పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ లాంచ్ చేశారు.

Published on: May 23, 2026, 05:39:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Director VV Vinayak Launch Takshaka Movie Poster: మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా "తక్షక". ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విశ్వంభర డైరెక్టర్ సోదరుడు కృష్ణ దర్శకత్వంలో తక్షక- పోస్టర్ లాంచ్ చేసిన వీవీ వినాయక్- హీరోగా నిర్మాత కుమారుడు!
విశ్వంభర డైరెక్టర్ సోదరుడు కృష్ణ దర్శకత్వంలో తక్షక- పోస్టర్ లాంచ్ చేసిన వీవీ వినాయక్- హీరోగా నిర్మాత కుమారుడు!

తక్షక గ్రాండ్ రిలీజ్

సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న "తక్షక" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రానుంది. తాజాగా తక్షక చిత్ర పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "మల్లిడి సత్యనారాయణరెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు" అని అన్నారు.

నిర్మాత కుమారుడు హీరోగా

"కృష్ణ మల్లిడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత డా. లతా రాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. లతా రాజు గారి అబ్బాయి కుశాల్ రాజు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు.

"తమ అబ్బాయి హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి నిర్మాతగా లతా గారు కొత్త అయినా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా విజయం సాధించి కుశాల్ రాజు హీరోగా పేరు తెచ్చుకోవాలి. అలాగే మా కృష్ణ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి" అని కోరారు డైరెక్టర్ వీవీ వినాయక్.

వేళ ఏళ్లుగా జరిగిన అద్భుతాలతో

ప్రొడ్యూసర్ డా. లతా రాజు మాట్లాడుతూ.. "మా తక్షక సినిమా పోస్టర్ లాంఛ్ చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన పేరులోనే విజయం ఉంది. సరికొత్త సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలున్న చిత్రమిది. మహాభారత కాలం నుంచి నేటి వరకు వేల ఏళ్లుగా జరిగిన అద్భుతమైన సన్నివేశాలు మా సినిమాలో ఉంటాయి" అని పేర్కొన్నారు.

"ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ, రీసెర్చ్ చేస్తూ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు మా డైరెక్టర్ కృష్ణ మల్లిడి. అలాగే మా చిత్రానికి ఫిల్లర్‌లా నిలబడిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబీకి కృతజ్ఞతలు చెబుతున్నా. నాకు మోరల్ సపోర్ట్‌గా మా అన్నయ్య డా.నరేంద్రనాథ్ రాజుకు థ్యాంక్స్" అని నిర్మాత లతా రాజు చెప్పారు.

ప్రతి విషయం నేర్చుకుంటూ

"మా అబ్బాయి కుశాల్ రాజు గురించి చెప్పాలంటే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతి విషయం నేర్చుకుంటూ నటించాడు. మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా" అని కోరారు తక్షక నిర్మాత లతా రాజు.

"మా తక్షక మూవీ ఓపెనింగ్ వినాయక్ గారి చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ కూడా ఆయనే చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అయి డైరెక్టర్‌గా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ చేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం. సినిమా సక్సెస్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం" అని తెలిపార డైరెక్టర్ కృష్ణ మల్లిడి.

డైరెక్టర్ విజన్‌కు హ్యాట్సాఫ్

"మా మూవీ ప్రతి ఈవెంట్‌లో సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్. వినాయక్ గారు మా మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఈ చిత్రం కోసం నేను, మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశాం. మా డైరెక్టర్ విజన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మీరంతా మా సినిమాను ఇష్టపడతారని కోరుకుంటున్నా" అని అన్నారు హీరో కుశాల్ రాజు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More