S Janaki Net Worth: 60 ఏళ్లు, 50 వేల పాటలు- సింగర్ జానకి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఎక్కడెక్కడా స్థిరాస్తులు ఉన్నాయంటే?

Singer S Janaki Net Worth: దక్షిణాది గానకోకిల ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో వేలాది మధుర గీతాలు ఆలపించిన ఆమె జీవితకాల సంపాదన, ఆస్తిపాస్తుల విలువపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Published on: Jul 13, 2026, 15:15:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Singer S Janaki Net Worth: దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. తన మధురమైన గొంతుతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన అమరగాయని, 'గానకోకిల' ఎస్. జానకి భౌతికంగా మనల్ని విడిచివెళ్లడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

60 ఏళ్లు, 50 వేల పాటలు- సింగర్ జానకి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఎక్కడెక్కడా స్థిరాస్తులు ఉన్నాయంటే?
60 ఏళ్లు, 50 వేల పాటలు- సింగర్ జానకి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఎక్కడెక్కడా స్థిరాస్తులు ఉన్నాయంటే?

17 భాషలు, 50 వేలకు పైగా పాటలు

ఆరు దశాబ్దాల పాటు సాగిన జానకమ్మ సంగీత ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. దాదాపు 60 ఏళ్లలో 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించిన జానకమ్మ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో ఎన్నో వేల క్లాసిక్ సాంగ్స్‌కు ప్రాణం పోశారు. ఆమె పాడిన పాటలు ఎప్పటికీ అమరమే, కానీ ఆమె మరణం తర్వాత సింగర్ జానకి జీవితకాల సంపాదన, ఆస్తిపాస్తుల గురించి నెటిజన్లలో విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఆరు దశాబ్దాల శ్రమ.. రూ. 537 కోట్ల నెట్ వర్త్!

ఎస్. జానకి తన ఆస్తుల వివరాలను ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, ప్రముఖ సినీ వెబ్‌సైట్ ఫిల్మీబీట్ కథనం ప్రకారం.. జానకమ్మ నికర ఆస్తి విలువ (Net Worth) సుమారు రూ. 537 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆమె భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరిగా నిలిచారు. ప్రతి రికార్డింగ్‌కు ఆ కాలంలోనే భారీ మొత్తాన్ని వసూలు చేసేవారు. సినిమాల్లో పాడటమే కాకుండా భారతదేశంతో పాటు విదేశాలలో నిర్వహించిన వందలాది లైవ్ మ్యూజికల్ కాన్సెర్టులు, స్టేజ్ షోల ద్వారా జానకమ్మకు భారీగా ఆదాయం సమకూరేదట.

స్థిరాస్తి పెట్టుబడులు.. చెన్నైలో సొంత ఇల్లు

సంగీత రంగం ద్వారా సంపాదించిన డబ్బును జానకమ్మ తెలివిగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెట్టారని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి. తమిళనాడు రాజధాని చెన్నై వంటి నగరాల్లో ఆమెకు విలువైన ఆస్తులు, లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. తన జీవితంలో ఎక్కువ భాగం, ముఖ్యంగా చివరి రోజులను ఆమె చెన్నైలోనే గడిపారు.

కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వచ్చిన రాయల్టీలు కూడా ఆమె ఆర్థిక స్థిరాస్తిని మరింత బలోపేతం చేశాయి. ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, అంకితభావం వల్లే జానకమ్మ ఈ స్థాయి సంపదను కూడబెట్టగలిగారు.

కోట్ల సంపద కంటే ఆ పాటలే అసలైన ఆస్తి

ఆమె ఆస్తి విలువపై రకరకాల అంచనాలు వస్తున్నప్పటికీ, జానకమ్మ నిజమైన సంపదను కేవలం అంకెలతో కొలవలేమని ఆమె అభిమానులు, సినీ పెద్దలు గుర్తుచేస్తున్నారు. ఏ భాషలో పాడినా అక్కడి స్పష్టమైన ఉచ్చారణను పట్టుకోవడం, ప్రతి పాటకూ ప్రాణం పోయడం, భావోద్వేగాలను పలికించడంలో ఆమె శైలే వేరు.

"ఆమె సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తి కంటే, కోట్లాది మంది గుండెల్లో సంపాదించుకున్న స్థానమే అత్యంత విలువైనది" అని శ్రోతలు కొనియాడుతున్నారు. ఎంతో మంది యువ గాయనీగాయకులకు ఆమె ఒక నిఘంటువులా నిలిచారు జానకమ్మ.

వారసత్వంగా

వెండితెరపై సింగర్‌గా జానకి పాడిన అజరామర గీతాలు సంగీత ప్రియుల హృదయాలలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. భారతీయ సినిమాకు ఆమె అందించిన అసమానమైన సేవలే ఆమె వదిలివెళ్లిన శాశ్వత వారసత్వంగా నిలిచిపోతాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More