దగ్గుబాటి ఫ్యామిలీ గురించి అబద్దాలు ప్రచురిస్తే చర్యలు తప్పవు: సురేష్ బాబు లీగల్ టీమ్ వార్నింగ్
డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ కూల్చివేతపై కేసులో దగ్గుబాటి కుటుంబం మీద అవాస్తవాలు ప్రసారం చేయొద్దని సురేష్ బాబు లీగల్ టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
డెక్కన్ కిచెన్ వర్సెస్ దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు కేసులో వస్తున్న వార్తలపై దగ్గుబాటి సురేష్ సీరియస్ అయ్యారు. తప్పుడు వివరాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్స్ తప్పవని సురేష్ బాబు లీగల్ టీమ్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇంతకు ఏమైంది? ఈ కేసు సంగతి ఏంటీ? అన్నది ఇప్పుడు చూద్దాం.

అది పచ్చి అబద్దం
జూబ్లీహిల్స్ లోని డెక్కన్ కిచెన్ స్థల వివాదంలో దగ్గుబాటి కుటుంబం మీద కేసు నడుస్తోంది. బలవంతంగా తమను రౌడీలతో సాయంతో ఖాళీ చేయించారని నంద కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై నాంపల్లి కోర్టు విచారణ కొనసాగిస్తోంది. అయితే కోర్టులో అది జరిగిందని, ఇది జరిగిందని వస్తున్న వార్తలు పచ్చి అబద్దాలని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
కోర్టుకు హాజరు కావాలని
‘‘దగ్గుబాటి ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలు అవాస్తవం. కోర్ట్ కి హాజరు కావాలన్నది పచ్చి అబద్ధం. జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కేసు విషయంలో నాంపల్లి కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి చుక్కెదురైందని. కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు జడ్జి సీరియస్ అయ్యారని, సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్టు వస్తోన్న వార్తలు నిజం కాదు’’ అని ఆ ప్రెస్ నోట్ లో సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ పేర్కొంది.
నాన్ బెయిలబుల్ వారెంట్
‘‘వచ్చే నెల 5 న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సహజంగానే కేసు 05/02/2026కి వాయిదా పడింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాము’’ అని ప్రెస్ నోట్ లో తెలిపింది.
చర్యలు తీసుకుంటామని
దగ్గుబాటి కుటుంబంపై తప్పుడు వార్తలు, వివరాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ తమ ప్రెస్ నోట్ లో వార్నింగ్ ఇచ్చింది. ‘‘తప్పుడు వివరాలు ప్రచురించితే చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది’’ అని పేర్కొంది.
ఏమైందంటే?
ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని సుమారు 1,000 గజాల స్థలాన్ని 2014లో దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ నుంచి వ్యాపారవేత్త నందకుమార్ లీజుకు తీసుకున్నారు. అక్కడ 'డెక్కన్ కిచెన్' అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే లీజు గడువు తీరకముందే స్థలాన్ని ఖాళీ చేయాలని దగ్గుబాటి కుటుంబం తనపై ఒత్తిడి తెచ్చిందని నందకుమార్ సివిల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది.
కూల్చివేతతో
అయితే నవంబర్ 2022లో అనుమతులు లేవని ఆ రెస్టారెంట్ ను జీహెచ్ఎంసీ పాక్షికంగా కూల్చివేసింది. కోర్టు స్టే ఉన్నా అధికారులు, దగ్గుబాటి కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారని నందకుమార్ ఆరోపించారు. ఇక 2024 జనవరిలో దగ్గుబాటు ఫ్యామిలీ రౌడీలతో రెస్టారెంట్ ను పూర్తిగా కూల్చివేయించారని నందకుమార్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఇవాళ (జనవరి 23) దీనిపై విచారణ జరిగింది. అయితే కోర్టులో జరిగింది తెలియకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని సురేష్ బాబు టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












