Missing Meghana: తెలుగులో సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మిస్సింగ్ మేఘన.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్
VV Vinayak Launch Missing Meghana First Look: తెలుగులో వస్తున్న న్యూ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మిస్సింగ్ మేఘన. తాజాగా మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను సీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వీవీ వినాయక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Missing Meghana First Look Launched By VV Vinayak: టాలీవుడ్‌లో వస్తున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా నిర్మించారు. వాచస్పతి దర్శకత్వం వహించారు.

మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్ లాంచ్
మిస్సింగ్ మేఘన సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకి సంబంధించిన మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్‌ను సెన్సేషనల్ టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా జరిగింది. శామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీంతో పాటు నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
వీవీ వినాయక్ కామెంట్స్
ఈ సందర్భంగా డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "బెక్కం వేణుగోపాల్ గారు, శ్రీనివాస్ గారి సపోర్ట్‌తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమాతో హీరో రామ్ కార్తీక్‌కి, దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను" అని కోరారు.
"అదేవిధంగా ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్ పాటల రాస్తాడు మ్యూజిక్ చేస్తాడు. అతడికి సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఈ టీంకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని వీవీ వినాయక్ తెలిపారు.
మీడియాతో మంచి అనుబంధం ఉంది
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. "వీవీ వినాయక్ గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన మా సినిమా టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీడియాతో నాకు మంచి అనుబంధం ఉంది ఈ సినిమాకి మీడియా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను" అని అన్నారు.
"ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" డైరెక్టర్ వాచస్పతి ఆకాంక్షించారు.
హీరో రామ్ కార్తీక్ స్పీచ్
"ముందుగా వీవీ వినాయక్ గారికి మా టీం తరఫునుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి, ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నాను" అని హీరో రామ్ కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. "లెజెండ్రీ డైరెక్టర్ వీవీ వినాయక్ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్నీ ఎమోషన్స్
"ఒక మంచి మ్యూజిషియన్‌కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా నాకు చాలా మంచి అవకాశం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా టీంని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని స్పీచ్ ముగించారు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


