గ్రాండ్‌గా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి తీసిన సినిమా అంటూ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కామెంట్స్

Kalyanam Kamaneeyam Jeevitham Teaser Launch: తెలుగులో వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా సినిమా కళ్యాణం కమనీయం జీవితం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా నిర్వహించిన కళ్యాణం కమనీయం జీవితం టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన అతిథులు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

Published on: Jul 17, 2026, 14:38:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kalyanam Kamaneeyam Jeevitham Teaser Launch Event: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించారు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.

గ్రాండ్‌గా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి తీసిన సినిమా అంటూ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కామెంట్స్
గ్రాండ్‌గా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి తీసిన సినిమా అంటూ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కామెంట్స్

కళ్యాణం కమనీయం జీవితం టీజర్ లాంచ్ ఈవెంట్

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కళ్యాణం కమనీయం జీవితం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, నిర్మాత కిశోర్ గుండాల, దర్శకుడు రవి లోకిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వీఎన్ ఆదిత్య కామెంట్స్

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "కళ్యాణం కమనీయం జీవితం టైటిల్ చూసి మీకు పెళ్లయ్యిందా అని డైరెక్టర్‌ను అడిగాను. టీజర్ చూస్తే ఆకట్టుకునేలా ఉంది. ఇంత భారీగా తెరకెక్కించారు. తన లైఫ్ నుంచి ఇన్స్‌పైర్ అయి చేసిన సినిమా ఇదని దర్శకులు రవి లోకిరెడ్డి చెప్పారు" అని అన్నారు.

"చాలామంది కొత్త దర్శకులు రూపొందించే ప్రేమ కథలు వారి నిజ జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి. అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే కళ్యాణం కమనీయం జీవితం సినిమా కూడా మంచి విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు" అని దర్శకుడు వీఎన్ ఆదిత్య చెప్పారు.

నిర్మాత కిశోర్ గుండాల స్పీచ్

ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లాడుతూ.. "మా కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు చేశారు. అలాగే మా చిత్రంలో చంద్రబోస్ గారు ఓ పాటను విడుదల చేశారు. ఇప్పుడు వీఎన్ ఆదిత్య గారు అతిథిగా వచ్చారు. ఇంతమంది పెద్ద వాళ్ల సపోర్ట్ మా టీమ్‌కు దక్కడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

"నేను కార్పొరేట్ ప్రపంచం నుంచి సినిమాల మీద ప్యాషన్‌తో టాలీవుడ్‌కు వచ్చాను. యూఎస్‌లో ఫిలిం మేకింగ్ మీద కోర్స్ చేశాను. గతంలో 24 కిస్సెస్ సహా మరికొన్ని చిత్రాలు నిర్మించాము. ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం సినిమా చేస్తున్నాం. మరో సినిమా కూడా లైనప్‌లో ఉంది. ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి" అని నిర్మాత కిషోర్ గుండాల తెలిపారు.

దర్శకుడు రవి లోకిరెడ్డి ఏమన్నారంటే?

డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. "నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్‌కు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది" అని వెల్లడించారు.

"ఈ కథ రాసినప్పుడు రైటర్ అరవింద్ ఒక కొత్త పాయింట్‌ను యాడ్ చేశాడు. ఆ పాయింట్‌తో మూవీ స్క్రిప్ట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. మా ప్రొడ్యూసర్స్ ఎంతో సహకరించారు. మా టీమ్ చాలా ప్యాషన్‌తో వర్క్ చేశారు. మంచి సాంగ్స్ కుదిరాయి. కళ్యాణం కమనీయం జీవితం సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది" అని దర్శకుడు రవి లోకిరెడ్డి పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More