Podarillu September 18 Episode: పొదరిల్లు- మనీషా ప్రేమలో మునిగిపోయిన మాధవ- చక్రికి మహా రొమాంటిక్ పిలుపు- తలుపు వేయమంటూ!

Podarillu Serial September 18th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 18వ ఎపిసోడ్‌‌లో మా మనీషాను పెళ్లి చేసుకుంటారా అని మాధవను అడుగుతాడు బన్సీ. మనీషాకు కూడా ఇష్టమే అని తెలియడంతో ప్రేమలో మునిగిపోతాడు మాధవ. చక్రిని గదిలోకి రమ్మని పిలిచిన మహాలక్ష్మి తలుపు వేయమంటుంది. మాధవ పనికి అంతా షాక్ అవుతారు.

Published on: Sep 18, 2026, 09:29:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బన్సి ఇంటి దగ్గర మాధవ ఉంటాడు. జయంతితో ఎంగేజ్‌మెంట్ గురించి, కేశవ పెళ్లి గురించి, వాడు నావల్ల వాయిదా వేసుకుంటాడు అని మాధవ మాట్లాడుతాడు. మీరంతా ఒకరికొకరు ఆలోచించుకున్నారు. గొప్ప విషయమేగా భాయ్ అని బన్సీ అంటాడు.

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 18 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 18 ఎపిసోడ్

మనీషాను పెళ్లి చేసుకుంటారా భాయ్

మనీషా టీ తీసుకొస్తుంది. తననే ఇవ్వమంటే మనీషా సిగ్గుపడుతుంది. బన్సీ ఇస్తాడు. మీరు రెండో పెళ్లి సంబంధం చేసుకోవడం మాకెవరికి ఇష్టంలేదని బన్సీ అంటాడు. ఇది కూడా తప్పిపోయింది. నాకు సంబంధాలు వస్తాయా అని మాధవ అంటాడు. మనీషాను చూసిన బన్సీ.. తడబడుతూనే మా మనీషాను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు.

దాంతో మనీషా తెగ సంతోషిస్తుంది. మాధవ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని మాధవ అంటాడు. ఇన్ని సంబంధాలు చూశారు. కానీ మా మనీషా కళ్లలో మీపై ఉన్న ప్రేమను చూడలేదు. మనీషా జీవితం బాగుండాలని మా బావకు దూరంగా తీసుకొచ్చాను. మీలాంటి మంచి మనిషికి ఇచ్చి చేస్తే జీవితాంతం నా చెల్లి గురించి బాధపడాల్సిన అవసరమే రాదని బన్సీ అంటాడు.

నా మీద జాలితో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని మాధవ అంటాడు. మేమందరం మిమ్మల్ని గొప్పగా చూస్తున్నామే కానీ జాలిగా కాదని, తను మీ కుటుంబంలో పడితే అందరితో మంచిగా ఉంటుందని బన్సీ అంటాడు. ఆ మాట మనీషా చెప్పాలి. నువ్వు కాదని మాధవ అంటాడు. మీరే మనీషాను అడగండి. తనకు తెలుగు పూర్తిగా అర్థం అవుతుందని వెళ్లిపోతాడు బన్సీ.

కేశవ, శైలు గొడవ

మాధవను చూసి మనీషా నవ్వుతుంది. మాధవ కూడా సంతోషంగా నవ్వుతాడు. పెళ్లి ఇష్టమేనా అన్నట్లుగా తల ఊపుతాడు మాధవ. అవును అన్నట్లుగా మనీషా తల ఊపుతుంది. ఇద్దరు మౌనంగానే ప్రేమలో పడతారు. సిగ్గు పడుతూ మాధవ వెళ్లిపోతాడు. మరోవైపు శైలు చేసినదానిగురించి కేశవ ఆలోచిస్తాడు. ఇంతలో శైలు కాల్ చేస్తుంది.

కేశవ కాల్ కట్ చేస్తాడు. పదే పదే శైలు కాల్ చేస్తుంది. దాంతో కేశవ లిఫ్ట్ చేస్తుంది. ఇద్దరు గొడవ పడతారు. నాకు సారీ చెప్పాలని తెలియదా. నేను చేసిన తప్పు ఏంటీ అని శైలు అంటుంది. నీ స్వార్థం కోసం మా అన్నయ్య పెళ్లి జరగాలనుకోవడం తప్పే అని కేశవ అంటుంది. ఇష్టం లేని పెళ్లి మీ అన్నయ్య చేసుకుంటే బాధపడతాడని తెలిసిన నీకు నేను ఏమైపోతానే తెలియట్లేదా అంటుంది శైలు.

ఇంట్లోవాళ్లు అడిగిన ప్రశ్నలకు నిలదీస్తుంది శైలు. ఇప్పుడు కూడా సారీ చెప్పడానికి కాకుండా ఇంట్లోవాళ్లు అడిగిన దానికి చేశావా. పెట్టవే ఫోన్ సెల్ఫీష్ దానా అని కాల్ కట్ చేస్తాడు కేశవ. మరోవైపు సైకిల్‌‌పై మాధవ వెళ్తూ మనీషా ఊహల్లో తేలిపోతుంటాడు. బైక్‌తో ఒకడు ఎదురు వచ్చి ఢీకొడతాడు. కానీ, మాధవకు ఏం కాదు. ప్రేమలో మునిగిపోయిన మాధవ అతన్ని ఏమనకుండా వెళ్లిపోతాడు.

మనీషా ప్రేమలో మునిగిపోయిన మాధవ

మరోవైపు మాధవ ఇంకా ఇంటికి రాకపోవడంపై చక్రి, మహావాళ్లంతా మాట్లాడుకుంటారు. ఇంతలో మాధవ వస్తాడు. సైకిల్ స్టాండ్ వేయకుండానే పడేసి వస్తాడు. చక్రివాళ్లు ఏం మాట్లాడిన వినిపించుకోకుండా మాధవ వెళ్తాడు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావని అడిగితే.. మాధవ నవ్వేసి వెళ్లిపోతాడు. ఈ లోకంలోనే లేడేంటని కేశవ అంటాడు.

గదిలో మాధవ ఏం చేస్తున్నాడని వెళ్లి చూస్తారు. మాధవ సిగ్గుపడుతూ నవ్వడం చూసి షాక్ అవుతారు. అంతా పిలిచిన పలకడు పెద్ది. గాలిసోకి ఉంటుందా అని చక్రి అంటాడు. మాధవని గట్టిగా పిలిచి ఏమైందని అడిగితే.. ఏం కాలేదంటాడు. కలిసి తిందామని అడగ్గానే వెళ్లి కూర్చుంటాడు. మనమే అన్ని తీసుకొచ్చి పెడదామని పెడతారు.

మహాలక్ష్మి అన్నం వడ్డిస్తుంది. కూర వేయకుండానే మాధవ తింటాడు. ఎంగేజ్‌మెంట్ జరగనందుకు బాధగా ఉందా అని చక్రి అడుగుతాడు. ఇంకోవైపు నారాయణ తాగుతుంటాడు. మాధవ సైలెంట్‌గా వెళ్తాడు. మాధవను పిలిచి నీకు రాసిపెట్టాలని గుండె రాయి చేసుకోమ్మని చెబుతాడు నారాయణ. ఏం జరిగిన అంతా మనమంచికే నాన్న అని మాధవ అంటాడు.

కొడుకును మందు తాగమన్న నారాయణ

కాస్తా నాలుగు పెగ్గులు వేస్తావా ఏంటీ అని నారాయణ అడుగుతాడు. మందు తాగితే మత్తుగా నిద్రపడుతుందని మాధవ అంటాడు. అందుకేగా తాగమంది. మతిగాని చెడిపోయిందా ఏంటీ అని నారాయణ అనుకుంటాడు. చక్రిని లోపలికి రమ్మని పిలుస్తుంది మహాలక్ష్మి. దాంతో మహా రొమాంటిక్‌గా పిలిచిందనుకుని చక్రి సంతోషంతో షాక్ అవుతాడు. నన్ను తన గదిలోకి రమ్మంది. ఇంత తొందరగా నా పంటపండుతుందనుకోలేదే అని చక్రి ఎగిరి గంతేస్తాడు.

సెంట్ కొట్టుకుని మరి మహా గదిలోకి వెళ్తాడు. ఇప్పుడు ఎవరు లేరుగా. ఏం మాట్లాడుకున్నా ఎవరికి వినపడదు కదా అని మహాలక్ష్మి అంటుంది. అవును చెప్పేయండి అని చక్రి అంటాడు. తలుపు వేయమని మహాలక్ష్మి అంటుంది. దాంతో చక్రి తలుపు మూస్తాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More