Podarillu September 10 Episode: జయంతి డామినేషన్- నారాయణకు శశిపాల్ అవమానం -నోరు జారిన మనీషా- పెద్ది నిశ్చితార్థంలో తాయారు

Podarillu Serial September 10th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 10వ ఎపిసోడ్‌‌లో నారాయణ ఇంటికి జయంతి తమ్ముడు శశిపాల్ వస్తాడు. ఇల్లు, ఇంటి మనుషుల గురించి అవమానంగా మాట్లాడుతాడు. మాధవతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోమని జయంతి తండ్రి చెబుతాడు. శశిపాల్‌ను కొత్తెం అని నారాయణ పిలుస్తాడు.

Published on: Sep 10, 2026, 08:32:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి, మాధవ అన్నదమ్ములంతా కలిసి ఉండటం చూసి ఒకరికొకరు అన్నట్లుగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అని మహాలక్ష్మి అంటుంది. ఇంతలో ఇంటికి జయంతి తమ్ముడు శశిపాల్ వస్తాడు.

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 10 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 10 ఎపిసోడ్

ఇల్లేంటీ ఇలా ఉంది

శశిపాల్‌పై చక్రి సెటైర్లు వేస్తాడు. ఇల్లేంటీ ఇలా ఉంది. సున్నం వేసుకోడానికి కూడా డబ్బులు లేవా, ఇల్లు చూడాలని అంటాడు. నువ్వు కూడా మీ అక్కతో కాపురానికి వస్తావా అని చక్రి పంచ్ ఇస్తాడు. ఇల్లు చూసిన శశిపాల్ ఫర్నిచర్ లేదు. ఇలాంటి ఇల్లు ఎక్కడ చూడలేదని అంటాడు. ఇంతలో నారాయణ వచ్చి ఎవడీడు అని అడుగుతాడు.

ఇతనెవరు వైన్ షాప్ దగ్గర 10 రూపీస్ ప్లీజ్ అని అడుక్కునే అతనా అని శశిపాల్ అంటాడు. ఆయన మా నాన్న అని మాధవ అంటే.. అవునా. పోలికలులేకుంటే అని దుసురుగా మాట్లాడుతాడు. ఇంటికి పెయింట్ వేయించండి. లేకుంటే మా అక్క అటు నుంచి అటే వెళ్లిపోతుంది. 6 బై 6 బెడ్, ఫర్నిచర్ పెట్టండి, ఇదేం డ్రెస్ ఎంగేజ్‌మెంట్‌కు మా అక్క డ్రెస్ పంపింది. పదివేలు. ఇదే వేసుకోవాలని అక్క ఆర్డర్ అని శశిపాల్ అంటాడు.

పోనీలే పెద్ది ముచ్చటపడి పంపించింది అని మహా అంటుంది. నొచ్చుకోవడం కాదు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని అబిడ్స్‌లో ధర్నా చేస్తుంది. ఇదే వేసుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు శశిపాల్. అన్నయ్య నువ్వు ఇది వేసుకో. పెళ్లి కాకముందే ఇంత డామినేషనా అని కేశవ అంటాడు. ఇంతలో జయంతి కాల్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి మాధవ మాట్లాడుతాడు.

ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవాలి

నేను పంపించిన డ్రెస్ వేసుకోండి. అదే నా కలర్‌కి మ్యాచ్ అవుతుంది. ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవాలని ఆర్డర్ వేసి కాల్ కట్ చేస్తుంది. ఏంట్రా ఇది నీకు నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు కూడా లేదా అని నారాయణ అంటాడు. హలో సుపుత్ర కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి. వాళ్లకు కొన్ని ముచ్చట్లు ఉంటాయి. ఇప్పుడు మ్యాచింగ్ ట్రెండ్ కూడా నడుస్తుందని మహా అంటుంది.

కాదు తను డామినేట్ చేస్తుందని కేశవ అంటాడు. తన మనసు నొప్పించడం ఎందుకు తను పంపిన డ్రెస్సే వేసుకుంటాను అని మాధవ అంటాడు. తర్వాత మహాలక్ష్మికి మ్యాచ్ అయ్యే కలర్ షర్ట్ నీ దగ్గర ఉందిరా ఇచ్చేయిరా అని బలవంతంగా కేశవ నుంచి తీసుకెళ్లిపోతాడు చక్రి. జయంతి పంపిన డ్రెస్ వేసుకుని మాధవ వస్తాడు. తర్వాత నారాయణ కూడా రెడీ అయి వస్తాడు.

మహాలక్ష్మి వస్తుంది. మహాను చూసి కేశవ, కన్నా నవ్వుతారు. మహాకు మ్యాచింగ్ అనుకున్న చక్రి ప్లాన్ రివర్స్ అవుతుంది. ఇద్దరి డ్రెస్సులు వేరేగా ఉండటంతో అలా నవ్వుతూనే ఉంటారు. మరోవైపు జయంతి రెడీ అవుతుంటుంది. శశిపాల్ వెళ్లి ఏంటా ఇల్లు, ఏంటా మనుషులు, నలుగురిని మర్డర్ చేసే వాళ్లలా ఉన్నారు అని అంటాడు. పెళ్లి అయితే కానీవ్వురా ఆ తర్వాత వేరు కాపురం పెట్టిస్తానని జయంతి అంటుంది.

చెబితే వినేవాడిలా ఉన్నాడు

ఆ మనిషి నాకు నచ్చాడు. అందంగా ఉన్నాడు. చెబితే వినేవాడిలా ఉన్నాడు. నా మొదటి మొగుడిలా డబ్బున్న అహంకారం చూపించేలా లేడు అని జయంతి అంటుంది. ఇంతలో తండ్రి వచ్చి నాకు మనసు ఒప్పుకోవడం లేదు. ఎంగేజ్‌మెంట్ అయితే ఏం చేయలేం. ఇప్పుడే మాట్లాడుకోవాలని అంటాడు. దేని గురించి అని జయంతి అంటుంది.

శేఖర్ వాళ్లలాంటి వాడు కాదు. శేఖర్ అంత దారుణమైన మనిషి కాదు. నిన్ను అంత కష్టాలకు కూడా గురి చేయలేదు అని జయంతి తండ్రి అంటాడు. ఆయనకు ఇగో ఎక్కువ నాన్న అని శశిపాల్ అంటే.. మనకు లేదా నీకు లేదా అమ్మకు లేదా జయంతికి లేదా కేవలం ఇగోల వల్ల ఇక్కడి వరకు వచ్చింది. విడాకుల వరకు తెచ్చారు అని తండ్రి అంటాడు.

శేఖర్ ఛాలెంజ్ గురించి జయంతి చెబుతుంది. నువ్వు కాస్తా తగ్గితే మంచిదమ్మా. ఈ సంబంధం వాళ్లు కూడా మంచివాళ్లలా ఉన్నారు. చెబితే అర్థం చేసుకుంటారు. పెళ్లికి ముందే నిర్ణయం తీసుకుంటే మంచిదని తండ్రి అంటాడు. ఇంతలో తల్లి వచ్చి దాన్ని కన్‌ఫ్యూజ్ చేయకని అంటుంది. నేనంటే వాల్యూ లేని వాళ్ల దగ్గర నేను ఎంతకాలం భరిస్తాను అని జయంతి అంటుంది.

వాళ్లకు అంత స్థాయి లేదు

మొదటి పెళ్లి నీదే అని చెప్పాను. ఇప్పుడు కూడా నీకే వదిలేశా. కానీ ఆలోచించుకోమంటున్నా అని జయంతి తండ్రి అంటాడు. ఇప్పుడేంటీ వచ్చేవాళ్లకు మర్యాదలు చేయాల అని జయంతి తండ్రి అంటే.. అవసరం లేదు. వాళ్లకు అంత స్థాయి లేదు. పలకరించండి చాలు. ఎవరిని ఎక్కడ ఉంచాలో చెప్పుచేతల్లో ఉంచాలని తల్లి అంటుంది.

శేఖర్ బావకు ఎంగేజ్‌మెంట్ గురించి తెలుసా అని శశిపాల్ అడిగితే.. అందరికంటే ముందు అతనికే చెప్పాను. నన్ను మిస్ అవుతున్నట్లు తెలియాలిగా అని జయంతి అంటుంది. నారాయణ కుటుంబం వస్తుంది. నారాయణ కోపంగా ఉండటం చూసి మనీషా ఏమైందని అడుగుతుంది. మాకు ఎవరికి పెళ్లి అంటే ఇష్టం లేదని కన్నా అంటే.. నాకు కూడా ఇష్టం లేదని మనీషా నోరు జారుతుంది.

ఏంటని కన్నా అడిగితే.. మీకు అందరికి ఇష్టమైందే నాకు ఇష్టమని మనీషా అంటుంది. శశిపాల్ వస్తాడు. అదిగో శిశుపాలుడు వచ్చాడని చక్రి అంటాడు. శశిపాల్ పేరుపై చక్రి, నారాయణ సెటైర్లు వేస్తారు. నేను కొత్తెం అని పిలుస్తాను. ఇదేనా నీ మర్యాద అని నారాయణ అంటాడు.. వద్దంటే పోతారా అని శశిపాల్ అంటాడు. పోతారానా.. రేయ్ పదండ్రా అని నారాయణ గొడవ చేస్తాడు.

ఇంకో సంబంధం తెస్తానన్నాడు

ఇంతలో జయంతి తండ్రి వచ్చి అడిగితే.. ఈ కొత్తెం పోతారా అన్నాడు. పోతే ఏం చేస్తావంటే మా అక్కకు ఇంకో సంబంధం తెస్తామన్నాడు. మాకు అవమానం జరిగింది అని నారాయణ అబద్ధం చెబుతాడు. దాంతో శశిపాల్‌ను తిట్టి తన తరఫున తను సారీ చెబుతాడు. ఇలాగేనా మర్యాదలు చేసేది. కడుక్కోడానికి చెంబు, తుండు ఇవ్వరా.. ఇలా చేయబట్టే మొదటి మొగుడు దొ.. అని నారాయణ అంటుంటే.. సుపుత్ర కాస్తా తగ్గండి సుపుత్ర అని మహాలక్ష్మి ఆపుతుంది.

తర్వాత శేఖర్ వస్తాడు. ఇప్పుడిప్పుడే ఒకరినొకరు బాగా చూసుకోండి. పెళ్లయితే వరదల్లో కొట్టుకుపోయినట్లు అవుతారు అని జయంతి మాజీ భర్త అంటుంది. తర్వాత నారాయణ చెల్లెలు తాయారు, గాయత్రి ఎంగేజ్‌మెంట్‌కి వస్తారు. ఇదేం పెళ్లి, ఇదేం కుటుంబం, ఇదేం ఆడపిల్ల, వాడేం మొగుడు అని మాధవను తిడుతుంది మేనత్త తాయారు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More