Podarillu September 4 Episode: ఇంటి ఆస్తి పేపర్స్ అడిగిన పెళ్లికూతురు- జయంతికి మహా పంచ్- పెద్ది పెళ్లి చెడగొడతామన్న కేశవ
Podarillu Serial September 4th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్‌లో చక్రికి మహాలక్ష్మి అంట్లు తోమే శిక్ష వేస్తుంది. కేశవ, కన్నా వీడియో తీస్తారు. పెళ్లిచూపుల వాళ్లు వస్తారు. నారాయణ వాళ్లు ఏది అడిగిన, ఏం చెప్పిన జయంతి పొగరుగా సమాధానమిస్తుంది. ఇంటి డాక్యుమెంట్స్ చెక్ చేయమంటుంది.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చక్రిని ఇంట్లో పనులు చేయమంటుంది మహాలక్ష్మి. చక్రి చేయకుంటే హాస్టల్‌కి వెళ్లిపోతానని బెదిరిస్తుంది. దాంతో అన్ని పనులు చేస్తానని చక్రి చేస్తాడు. అంట్లు తోముతాడు. ఎంత తోమిన ప్లేట్స్ తీసుకొచ్చి ఇస్తూనే ఉంటుంది మహాలక్ష్మి.

చక్రిని ముప్పుతిప్పలు పెట్టిన మహాలక్ష్మి
ఇంకా పక్కింటివాళ్లవి కూడా ఉన్నాయా అని చక్రి అంటాడు. ఒక్కో దానికి ఒక్కే ప్లేట్ వాడినప్పుడు లేదా. పెద్ది ఎంత కష్టపడుతున్నాడో ఇప్పటికైనా అర్థమైందా అంటుంది మహాలక్ష్మి. ఫాస్ట్‌గా తోమితే సౌండ్ వస్తుందని, మెల్లిగా తోమితే ఎప్పుడు పూర్తవుతాయని చక్రికి వంకలు పెడుతుంది మహాలక్ష్మి.
పెద్ది కష్టపడి వండిపెడితే బాగా తిని కూర్చుంటున్నారని అంటుంది మహా. అదంతా చూసిన కేశవ, కన్నా నవ్వుకుంటారు. గోపికకు లైన్ వేసినందుకు అసూయతో చక్రిని ముప్పుతిప్పలు పెడుతుంది మహాలక్ష్మి. అదంతా వీడియో తీస్తారు కేశవ, కన్నా. చక్రి అలసిపోతాడు. అలవాటు లేని పని కదా అని చక్రి అంటాడు. ఇక నుంచి రోజు అలవాటు చేసుకోండి. మిగతా గిన్నెలు కూడా కడగండి. అసలే టైమ్ లేదని మహాలక్ష్మి అంటుంది.
టైమ్ లేకపోవడం ఏంటని కన్నా అడిగితే ఇవాళ పెళ్లి చూపులు, అందుకే ఇళ్లంతా నీట్‌గా ఉండేలా చేస్తున్నానని అంటుంది మహా. చక్రికి పెళ్లి చూపులు అనుకుంటారు. కాదని చక్రి అంటే.. కన్నాకు, నారాయణకేమో అని అనుకుంటారు. పెద్దికి పెళ్లి చూపులు అని, ఈ సంబంధం పెద్దినే చూసుకున్నాడని జరిగింది అంతా చెబుతుంది మహాలక్ష్మి.
కడుపు మంటగా ఉందా
దానికి నోరెళ్లబెడతారు అన్నదమ్ములు. బయటకెళ్లి అర్జంట్‌గా వస్తువులు తీసుకురండని పెద్ద లిస్ట్ చెబుతుంది మహా. కన్నాను చక్రి వెళ్లమంటాడు. బిల్ వాచిపోతుందని భయపడుతున్నాడని చెప్పి కేశవ వెళ్లి తీసుకొస్తానంటాడు. చక్రికి గోపిక కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి కావాలనే గట్టిగా మాట్లాడుతాడు చక్రి. లౌడ్ స్పీకర్ పెట్టి కాల్ మాట్లాడుతాడు చక్రి.
ఇంట్లో అంట్లు తోముతున్నాడని, ఆడవాళ్లు చేయాల్సిన పనులన్నీ చేస్తాడని మహాలక్ష్మి చెబుతుంది. ఇక్కడ ఒకరికి కడుపు మంటగా ఉండి మాట్లాడుతున్నారని చక్రి అంటే.. వెంటనే కాల్ కట్ చేస్తుంది మహాలక్ష్మి. ఇద్దరు వాదించుకుంటారు. మిమ్మల్ని ఇంకా ఉడికిస్తానని చక్రి అనుకుంటాడు. తర్వాత నారాయణ వచ్చి తనకు పెళ్లిచూపుల గురించి చెప్పొద్దా అని తిడతాడు.
ఏమైంది సుపుత్రి అని మహా అంటే.. హర్ట్ అయ్యానని నారాయణ అంటాడు. మాకు కూడా రెండు గంటల ముందే తెలిసిందని మహాలక్ష్మి చెబుతుంది. తర్వాత పెళ్లిచూపుల వాళ్లు వస్తారు. తండ్రిని కారు డోర్ వేయమంటుంది పెళ్లికూతురు. నేను వేస్తానని పెళ్లిళ్ల పేరయ్య వేసి వస్తాడు. మాధవ ఇంట్లోవాళ్లను పరిచయం చేస్తే ఇంట్లోకి తీసుకెళ్లి పరిచయం చేయొచ్చుగా అని ర్యాష్‌గా మాట్లాడుతుంది పెళ్లికూతురు.
పెద్ది ఇంటి డాక్యుమెంట్స్ చెక్ చేయండి
ఇంట్లో అంతా కూర్చుంటారు. ఇల్లు చూసి ఏ కాలంలో ఉన్నారని అడుగుతుంది పెళ్లికూతురు జయంతి. పరిచయం చేసిన, కాంప్లిమెంట్ ఇచ్చిన సరే అన్నట్లుగా రియాక్ట్ అవుతుంది జయంతి. తర్వాత ఇంటి డాక్యుమెంట్స్ చెక్ చేయమని తండ్రికి చెబుతుంది జయంతి. ఈ ఏరియాలో ఇంత పెద్ద ఇల్లు అంటే ధర బాగానే పలుకుతుందని తండ్రి అంటాడు.
అది విని మహా వాళ్లు షాక్ అవుతారు. బెడ్‌రూమ్ చూడొచ్చా అని జయంతి అడిగితే మహాలక్ష్మి చూపిస్తుంది. ఇదా బెడ్ రూమ్. గాలి వెలుతురు సరిగా ఉండాలిగా అని జయంతి అంటే.. పెళ్లయితే గాలి వెలుతురు అవే వస్తాయని మహా అంటుంది. అన్నీ మీరే మాట్లాడుతున్నారు. ఆయనేం మాట్లాడట్లేదని జయంతి అంటుంది.
మీరు ఆయన్ను చూడటానికి వస్తే ఎందుకు మాట్లాడరు. మీరు ప్రాపర్టీ చూడటానికి వచ్చానన్నారుగా అని మహాలక్ష్మి కౌంటర్లు వేస్తుంది. తర్వాత మేమంతా మా అన్నయ్య పెళ్లి కోసం ఎదురుచూస్తున్నామని చక్రి అంటాడు. విడాకులు కాస్తా అయిపోతే వెంటనే ముహుర్తాలు పెట్టుకుందామనుకుంటున్నాం అని ఒకావిడ అంటుంది.
ఇది రెండో పెళ్లే
విడాకుల ఎవరికి అని నారాయణ అంటాడు. మీరు ఇంట్లో ఎవరికి చెప్పలేదా. నాకే విడాకులు అని జయంతి అంటుంది. దాంతో నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. అంటే, ఇది మీకు సెకండ్ మ్యారేజా అని కేశవ అడుగుతాడు. అవును, ఇదంతా మీ అన్నయ్యకు ముందే తెలుసే అని జయంతి అంటుంది.
తర్వాత పెళ్లూచుపులు వాళ్లు వెళ్లిపోతారు. మాధవను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తమ్ముళ్లు నిలదీస్తారు. ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా అని మాధవ అడిగితే.. ఈ అమ్మాయి ఇష్టం లేదు. ఆమె ప్రతి మాటలో పొగరు, అహంకారం కనిపించలేదా. మొదటి భర్త ఈవిడను భరించలేకే వదిలించుకున్నట్లు ఉన్నాడు అని మహా అంటుంది.
నీ పెళ్లి చెడగొడతాం
ఈ నిర్ణయం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉంది అని చక్రి డౌట్‌గా అంటాడు. శైలు గురించి చెప్పకుండా నా పెళ్లి నా ఇష్టం. ఈ పెళ్లి నాకు చాలా ముఖ్యం అని పెద్ది అంటాడు. నీ పెళ్లి చెడగొడతామం అని కేశవ అంటాడు. అక్కడితో నేటి పొదరిల్లు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


