Podarillu August 31 Episode: పొదరిల్లు- రాఖీ కట్టి ఆస్తిలో వాటా అడిగిన తాయారు- పళ్లు రాలతాయన్న కూతురు- నారాయణ కన్నీళ్లు

Podarillu Serial August 31st Episode: పొదరిల్లు సీరియల్ ఆగస్ట్ 31వ ఎపిసోడ్‌‌లో నారాయణకు రాఖీ కట్టిన చెల్లి తాయారు ఆస్తిలో వాటా అడుగుతుంది. అన్నా చెల్లెళ్ల బంధాన్ని కూడా నీ స్వార్థానికి వాడుకున్నావ్ కదా బుజ్జమ్మా అని నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తాయారు కట్టిన రాఖీని విసిరేస్తాడు.

Published on: Aug 31, 2026, 09:25:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గాయత్రి ఇంటికి వచ్చి శుభవార్త తీసుకొచ్చానని చెబుతుంది. ఫుల్ బాటిల్ తీసుకొచ్చావా. అదే నాకు శుభవార్త అని తాగుబోతు నారాయణ అంటాడు. కాదు నీకు మా అమ్మ తాయారు రాఖీ కట్టేందుకు వస్తుందని గాయత్రి చెబుతుంది.

పొదరిల్లు సీరియల్ ఆగస్ట్ 31వ ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ ఆగస్ట్ 31వ ఎపిసోడ్

అమ్మ రాఖీ కట్టేందుకు వస్తుంది

దాంతో అంతా షాక్ అవుతారు. మావయ్య గురించి చెబితే మా అమ్మ ఫీల్ అయింది. ఇవాళ రాఖీ కట్టేందుకు వస్తోందని గాయత్రి అంటుంది. అంతా సంతోషిస్తారు. గిఫ్ట్ ఏమిద్దామని చక్రి అంటే.. నా దగ్గర చీర ఉంది. అది పెడదామని మహాలక్ష్మి అంటుంది. నారాయణ బాగా రెడీ అయి వస్తాడు. మొహం బాగా వెలిగిపోతుందని మహాలక్ష్మి అంటుంది.

అది నా బతుకు కోరదే. నా చావే కోరుకుంటుంది అని నారాయణ అంటాడు. రాదని చక్రి, వస్తుందని కేశవ పందెం వేసుకుంటారు. చక్రిపై కేశవ సెటైర్లు వేస్తాడు. తాయారు రాఖీలతో పాతికేళ్ల తర్వాత నారాయణ ఇంటికి వస్తుంది. గుమ్మం దగ్గర నిల్చుండి చూస్తుంది. ఇంటి ఆడపడుచుని వచ్చాను. కాళ్లకు నీళ్లు ఎవరు ఇస్తారంటా అని తాయారు అంటే మాధవ వెళ్తాడు.

మీ నాన్నకు ఇష్టం లేదా అని తాయారు అంటే నారాయణ వెళ్లి నీళ్లు ఇస్తాడు. తాయారు కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్తుంది తాయారు. మర్యాదలు అడిగి మరి చేయించుకుంటుంది తాయారు. నారాయణకు తాయారు బొట్టుపెట్టి రాఖీ కడుతుంది. కన్నాను మహా ఫొటోలు తీయమంటుంది. స్వీట్స్ తినిపించుకుంటారు. కట్నం ఇవ్వడానికని అంతా డబ్బులు తీసి నారాయణకు ఇస్తారు.

ఇంటి స్థలంలో వాటా ఇవ్వు

నేను డబ్బుకోసం రాలేదురా అని తాయారు అంటుంది. తీసుకో అత్త. మంచి చీర కొనుక్కో అని మాధవ అంటాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటికి కళ వచ్చింది. ఇది మా సంతోషం కోసం ఇస్తున్నామని చీర పెడుతుంది మహాలక్ష్మి. అందరిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది తాయారు. ఏరా.. నీ కొడుకులు డబ్బులిచ్చారు. నీ కోడలు చీర పెట్టింది. నీకు రాఖీ కట్టినందుకు నాకేం ఇస్తావురా అని తాయారు అడుగుతుంది.

ఏం కావాలో అడగమని మాధవ అంటే.. బాండ్ పేపర్స్ తీసి ఈ స్థలంలో నా వాటా రాసిస్తే చాలు అని తాయారు పెద్ద బాంబ్ పేలుస్తుంది. నా వాటా కింద రేపే ఆ స్థలం రాసిస్తే రేపే కిరాణ కొట్టు పెట్టుకుంటాను అని తాయారు అంటుంది. అంతా షాక్ అవుతారు. ఆడపడుచు కోసం ఆమాత్రం రాసివ్వరా. నేను పెట్టిన శాపం వెనక్కి తీసుకుంటాను. నీ కొడుకుల పెళ్లిళ్లు మీదేసుకుని చేస్తానని తాయారు అంటుంది.

ఆఖరికి అన్నాచెల్లెళ్ల బంధాన్ని ఎంతకు దిగజార్చావే బుజ్జమ్మా.. నీ భర్త అసమర్థుడు అయితే నీకు నీ బిడ్డకు గూడు లేకుంటే.. నువ్వు రాఖీ కట్టేందుకు వచ్చి వాటా కావాలని అంటే ఎంత బండరాయిలాంటి అన్నయిన కరిగిపోడా. అలాంటిది అన్ని ఉండి, అన్నతో చేరి నా చావు కోరుకునే నువ్వు రాఖీ కట్టి నా ఆస్తి కావాలని వచ్చావ్. అలాంటి నువ్వు నా దృష్టిలో మరోసారి నువ్వు చచ్చిపోడానికి వచ్చావని అర్థమైందే అని నారాయణ ఎమోషనల్‌గా అంటాడు.

నీ బొందమీద వేసుకుని కొట్టుకుంటావా

గాయత్రి నువ్వు వస్తున్నావని చెబితే ఎందుకు వస్తున్నావో నాకు అర్థమైన చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయే అని చిన్నప్పటి ప్రతి ఒక్క విషయం చెబుతూ ఏడుస్తాడు నారాయణ. ఇవన్నీఎలా మర్చిపోయావే. ఎంత స్వార్థమే నీది. తోడబుట్టిన రుణం కోసం ఏమైనా చేసేవాన్ని కానీ నా కొడుకులకు అన్యాయం చేసి నీలాంటిదానికోసం నా ఇంటిని ఎప్పటికీ ముక్కలు చేయలేను అని నారాయణ అంటాడు.

నీ కన్నుకూడా నా ఇంటి మీద పడనివ్వను. నేను కాటికి వెళ్లిన నా ఆత్మ ఈ బృందావనం చుట్టూ తిరుగుతుంది. రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లిని మెడపట్టి గెంటేస్తారని ఊర్లో వాళ్లు కథలుగా చెప్పుకుంటారని నిన్ను క్షమిస్తున్నాను. వెళ్లిపో అని నారాయణ అంటాడు. ఒక్క మాట మావయ్యను అన్నా ఊరుకోను అని గాయత్రి అంటుంది.

ఈ స్థలం నీ బొందమీద వేసి కొట్టుకుంటావా అని తాయారు అంటుంది. పళ్లు రాలతాయ్ అని తల్లిని అంటుంది గాయత్రి. తాయారు కట్టిన రాఖీని నారాయణ విసిరేస్తాడు. రాఖీ అనేది రంగులు, పూసలతో కలిసింది కాదు అన్నయ్య క్షేమం కోరుకునే రక్షాబంధన్ ఇది. ఇలా కడుపులో విషం నింపుకుని వస్తే రక్షాబంధన్ అనరు. ఆ వట్టి తాడు చేతికి ఎందుకు అని నారాయణ అంటాడు.

విక్కీకి మహాను రాఖీ కట్టమన్న చక్రి

తాయారు వెళ్లిపోతుంది. పడేసిన రాఖీ తీసుకున్న గాయత్రి తల్లి చేసిన మోసం గురించి కన్నీళ్లుపెట్టుకుంటుంది. మా అమ్మ ఎప్పటికీ నీ సంతోషం కోరుకోదు. కానీ నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఇది నా పుట్టిల్లు అనుకుని నేను నీకు రాఖీ కడతాను మావయ్య అని గాయత్రి అంటుంది. అంతా ఎమోషనల్ అవుతారు.

నారాయణకు మేనకోడలు గాయత్రి రాఖీ కడుతుంది. తర్వాత మహాను తీసుకుని మీ అన్నయ్యకు రాఖీ కట్టమని విక్కీని చూపిస్తాడు చక్రి. కట్టను అని మహా, కట్టించుకోనని విక్కీ అంటారు. ఈ రాఖీ మీరు కట్టించుకోండని చక్రికే ఝలక్ ఇస్తాడు విక్కీ. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More