18 ఏళ్ళ తర్వాత కుజ, చంద్రుల కలయికతో తులా రాశిలో మహాలక్ష్మి యోగం.. ఈ మూడు రాశులకు డబ్బు, సంతోషం, ప్రమోషన్లు ఇలా ఎన్నో!
హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాము. ఈ గ్రహాల కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ రాజయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారు ఊహించని లాభాలను పొందుతారు. శుభకార్యాలు జరుపుతారు. అనేక విధాలుగా విజయాలను సాధిస్తారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. దాంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాము.

ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44కి ప్రారంభమై, అక్టోబర్ 21 సాయంత్రం 5:54 వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు తులా రాశిలో సంచరిస్తాడు. ఇప్పటికే తులా రాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది.
మహాలక్ష్మి రాజయోగం
ఈ గ్రహాల కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ రాజయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారు ఊహించని లాభాలను పొందుతారు. శుభకార్యాలు జరుపుతారు. అనేక విధాలుగా విజయాలను సాధిస్తారు. మరి ఏ రాశుల వారు ఈ మహాలక్ష్మి యోగం వలన శుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.
18 ఏళ్ల తర్వాత తులా రాశిలో మహాలక్ష్మి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం!
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు, ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. శుభకార్యాలు జరుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి మహాలక్ష్మి యోగం బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు, నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అనేక విధాలుగా విజయాలను సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. స్నేహితుల సపోర్ట్ కూడా ఉంటుంది.
3.కన్యా రాశి:
ఈ రాశి వారికి మహాలక్ష్మి యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి. పాత ప్రాజెక్టుల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడుల నుంచి కూడా అధిక లాభం వస్తుంది.
4.వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి మహాలక్ష్మి యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. వ్యక్తిత్వం మరింత బాగుంటుంది. వ్యాపారులకీ ఇది మంచి సమయం అవుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


