ఈరోజు ఓ రాశి వారికి కొత్త బాధ్యతలు, ఆదాయం పెరుగుతుంది, జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు!

రాశి ఫలాలు 16 అక్టోబర్ 2025: వైదిక జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించారు. గ్రహాలు, నక్షత్ర, రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. అక్టోబర్ 16, 2025న ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో, ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

Published on: Oct 16, 2025, 04:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు రాశి ఫలాలు16 అక్టోబర్ 2025: గ్రహాలు, నక్షత్ర, రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది, ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, అక్టోబర్ 16 కొన్ని రాశిచక్రాలకు చాలా శుభదినం కానుంది, అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ 16, 2025 న ఏ రాశులకు కలిసి వస్తుందో తెలుసుకుందాం.

రాశి ఫలాలు 16 అక్టోబర్ 2025
రాశి ఫలాలు 16 అక్టోబర్ 2025

మేష రాశి: ఈరోజు మేష రాశి వారు శక్తితో నిండి ఉంటారు. ఈరోజు విభిన్నంగా ఏదైనా చేస్తారు. మీ ఖర్చులు పెరిగినప్పటికీ, మీ ఆదాయం కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

వృషభ రాశి: ఈరోజు మీ జీవితంలో అనేక సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. పెద్దల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. మానసికంగా మీరు కలత చెందవచ్చు, మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. ఎప్పటి నుంచో పూర్తి కావాల్సిన పనులు ఈరోజు పూర్తయ్యాయి. మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందవచ్చు.

మిథున రాశి: ఈరోజు మీరు మీ మానసిక స్థితిని మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న వారితో గొడవలు జరగవచ్చు, కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ జీవితంలో ఉత్తమమైన రోజును గడుపుతారు.

కర్కాటక రాశి: ఈరోజు మీరు బాగా డబ్బు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు కానీ సాయంత్రానికి అంతా సవ్యంగా ఉంటుంది. ఆఫీసులో మీ సృజనాత్మకతను చూపించే అవకాశం లభిస్తుంది. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. పనిప్రాంతంలో సీనియర్ మద్దతు ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని పొందవచ్చు.

సింహ రాశి: ఈరోజు సింహ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు, మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా రుణం కోసం అడగవచ్చు, దీని కారణంగా మీరు ఆర్థిక పరిమితులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ట్రిప్ ని వాయిదా వేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన రోజును గడుపుతారు. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి.

కన్యా రాశి: ఈ రోజు మీరు మీ భావాలను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు, మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు వ్యాపారవేత్తలు శుభవార్తలు పొందుతారు. కష్టపడి పనిచేయడం ఈ రోజు ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

తుల రాశి: ఈరోజు తుల రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కెరీర్ పురోగమిస్తుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు అనుకూలమైన రోజు కానుంది. మీరు ప్రశాంతంగా మీ లక్ష్యాల వైపు వెళతారు. విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు.

వృశ్చిక రాశి: ఈ రోజు మీరు మానసిక సమస్యల నుండి బయట పడతారు. పెట్టుబడులకు దూరంగా ఉండండి. ప్రేమలో నిరాశ మిమ్మల్ని బాధించదు. ఈ రోజు, ఖర్చుల కారణంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు దెబ్బతింటాయి. ఆర్థిక బడ్జెట్ రూపొందించండి, లేకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

ధనుస్సు రాశి: ఈ రోజు మీరు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు. మీరు పొదుపు చేయడం ప్రారంభించవచ్చు, ఇది భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది. మీరు కార్యాలయంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు. మీరు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

మకర రాశి: ఈ రోజు మకర రాశి వారు కుటుంబంతో సమయం గడుపుతారు. సింగిల్స్ జీవిత భాగస్వామిని పొందే అవకాశం వుంది. మీరు మీ ప్రియమైనవారి మద్దతును పొందుతారు. జీవితంలో సంతోషం, సంవృద్ధి రావడంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. పనిప్రాంతంలో ఫలితాలు మీ ప్రకారం ఉంటాయి. కానీ ఈ రోజు మీరు మీ స్నేహితులను కలవడానికి కూడా సమయం కేటాయించాలి.

కుంభ రాశి: ఈ రోజు కార్యాలయంలో మీ ఎదుగుదలకు అడ్డంకులు ఉండవచ్చు. మీరు మీ డబ్బు, పెట్టుబడులు, పొదుపు గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఎలాంటి తొందరపడవద్దు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. వృత్తిపరంగా కాల్షిప్ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

మీన రాశి: ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా వుంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగార్ధులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More