Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ‌ జయంతి.. తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్.. పోస్టు వైరల్

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ‌.. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తుండిపోయే పేరు ఇది. తన మూవీస్ తో ప్రయోగాలు చేసి నటశేఖరుడిగా నిలిచిపోయిన ఆయన జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుంటూ పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ గా మారింది.

Published on: May 31, 2026, 11:08:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahesh Babu: తెలుగు చిత్రసీమలో ఎంతోమంది దిగ్గజాలు. ఒక్కొక్కరు తమ ప్రత్యేకతతో అభిమానుల మనసుల్లో నిలిచిపోయారు. అలాంటి వాళ్లలో సూపర్ స్టార్ కృష్ణ‌ ముందు వరుసలో ఉంటారు. తన విలక్షణమైన నటనతో లక్షలాది మంది ఫ్యాన్స్ ను ఆయన సంపాదించుకున్నారు. ఈ రోజు కృష్ణ‌ జయంతి సందర్భంగా ఆయన కొడుకు మహేష్ బాబుతో పాటు అభిమానులు అందరూ నటశేఖరుడిని గుర్తు చేసుకుంటున్నారు.

తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టిన మహేష్ బాబు (x/mahesh babu)
తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టిన మహేష్ బాబు (x/mahesh babu)

మహేష్ బాబు ఎమోషనల్

సూపర్ స్టార్ కృష్ణ‌ కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. ఒక సక్సెస్ ఫుల్ ఫాదర్ కూడా. తన కొడుకు మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసిన ఘనత ఆయనది. ఇవాళ (మే 31) కృష్ణ‌ జయంతి సందర్భంగా తన తండ్రిని మహేష్ బాబు గుర్తు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో తండ్రితో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

మై హీరో

తండ్రితో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను మహేష్ బాబు తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్టు చేశాడు. ‘‘ఎప్పటికీ నా హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న’’ అని మహేష్ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ‌ను తలుచుకుంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

తండ్రితో ఎమోషన్

తండ్రి కృష్ణ‌తో మహేష్ బాబుకు ప్రత్యేన అనుబంధం ఉంది. నాన్నను చూసే మహేష్ నటనలోకి అడుగుపెట్టాడు. బాలనటుడిగా సత్తాచాటాడు. కొడుకులు దిద్దిన కాపురం, గూఢచారి 117 లాంటి సినిమాల్లో కృష్ణ‌తో కలిసి మహేష్ బాబు స్క్రీన్ పై అదరగొట్టాడు. ఈ ఫాదర్ సన్ డ్యూయో అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

సాహసమే ఊపిరి

నిర్మాతల మంచి కోరే హీరో.. సూపర్ స్టార్ కృష్ణ‌ పేరు వినగానే గుర్తొచ్చేది ఇది. ఆయన కేవలం హీరో మాత్రమే కాదు ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ఎడిటర్ కూడా. సాహసమే ఊపిరిగా తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు చేశారు.

350కి పైగా సినిమాల్లో నటించారు కృష్ణ‌. పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఫస్ట్ ఫుల్ లెంగ్త్ సినిమాస్కోప్, ఫస్ట్ 70 ఎంఎం ఫిల్మ్, ఫస్ట్ గూఢచారి మూవీ, ఫస్ట్ వెస్టర్న్ జోనర్ ఫిల్మ్.. ఇలా తెలుగు వెండితెరకు కొత్త సొబగులు అద్దిన దిగ్గజం కృష్ణ‌.

కృష్ణ‌ అస్తమయం

వయసు మీద పడ్డా వివిధ క్యారెక్టర్లతో కృష్ణ‌ సినిమాల్లో కొనసాగారు. కానీ 2022 నవంబర్ 15న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ బాధను సూపర్ స్టార్ మహేష్ బాబు తట్టుకోలేకపోయారు. అంతకు కొన్ని నెలల ముందే అన్నను, ఆ తర్వాత తల్లిని పోగొట్టుకున్న మహేష్ బాబుకు తండ్రి మరణం తీరని లోటును మిగిల్చింది. 2022లోనే జనవరిలో అన్న రమేష్ బాబు, సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More