Mahesh Babu: వారణాసి తర్వాత ఏకంగా మూడు సినిమాలు.. మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేేదుగా.. బాక్సాఫీస్ షేక్ అవాల్సిందే!
Mahesh Babu: వారణాసి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ ప్లాన్ మరో లెవల్ లో ఉందని, అతని సినిమాల లైనప్ మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది.
Mahesh Babu: ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘వారణాసి’. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేయబోయే మూవీ ఏంటీ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ బాబు సినిమాలు
వారణాసి మూవీతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని మహేష్ బాబు టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. మరి ఆ తర్వాత మహేష్ చేయబోయే సినిమాల విషయంపై ఇప్పటి నుంచే డిస్కషన్ సాగుతోంది. ఇప్పుడీ విషయమే ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
మూడు చిత్రాలు
వారణాసి తర్వాత మహేష్ బాబు మూవీ లైనప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సూపర్ స్టార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టారనే టాక్ తెగ వైరల్ గా మారింది. మహేష్ ఎప్పుడైనా ఒకే సమయంలో ఒకే మూవీ షూటింగ్ చేస్తాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేదే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్
రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు ఓ చిత్రం చేయనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘శ్రీమంతుడు’, ‘సర్కారు వారి పాట’ లాంటి సినిమాలు చేశాడు మహేష్.
ఇప్పుడు వారణాసి తర్వాత సూపర్ స్టార్ తో ఇంటర్నేషనల్ లెవల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్. దీనికి ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. వారణాసి తర్వాత మహేష్ నెక్ట్ప్ ప్రాజెక్ట్ ఇదే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సెన్సేషనల్ డైరెక్టర్
మహేష్ బాబు లైన్లో పెట్టిన మూడు సినిమాల్లో ఒకదానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ వహిస్తాడని సమాచారం. మహేష్ తో సినిమా తీయాలని ఉందని గతంలోనే సందీప్ పేర్కొన్నాడు. అందుకే త్వరలోనే ఈ కాంబో పట్టాలు ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు కూడా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా వారణాసితో గ్లోబల్ లెవల్ లో వచ్చే స్టార్ డమ్ ను మరింత పెంచుకునేలా మహేష్ పక్కా ప్లాన్ వేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


